S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రుచి

08/15/2017 - 22:07

గోధుమ పిండితో మనం ఎక్కువగా పుల్కాలు, పూరీలు, చపాతి, పరోటాలు చేస్తుంటాం. పిల్లలు, పెద్దలు ఇష్టంగా తినే కొన్ని వంటకాలు చేసుకోవచ్చు. రోజు రోజుకు మధుమేహగ్రస్తులు పెరుగుతుండటంతో రైస్ కన్నా గోధుమలతో చేసిన వంటకాలు ఎక్కువగా చేసుకుంటున్నారు. గోధుమ పిండితో లడ్డులు, తీపి దోశె, కారం దోశె, తీపి పొంగడాలు, కారం పొంగడాలు, మడత పూరీలు, కాజాలు వంటివి చేసుకోవచ్చును.
లడ్డూలు

07/20/2017 - 23:56

పనస తొనల రుచి అద్భుతం. ఈ కాలంలో దొరికే పండ్లలో పనస ఒకటి. తొనలు తినేసి గింజలను చాలామంది పారేస్తుంటారు. వీటితో కూడా రుచికరమైన వంటలు చేసుకోవచ్చు. హల్వా, వడ, పాఠళీ, ఫ్రై, వంకాయ పనస గింజల కూర ఎలా తయారుచేసుకోవచ్చో తెలుసుకుందాం.

07/14/2017 - 23:10

ప్రకృతిలో లభించే పండ్లు ఆరోగ్య పరంగా మంచిది. సమతుల్య ఆహారం తిన్నామంటే పండ్లు కూడా ఆహారంగా తీసుకుంటేనే సాధ్యం. పిల్లలు కొన్నిరకాల పండ్లను తినటానికి ఇష్టపడరు. వారికి ఆయా పండ్లలోని విటమిన్లు అందాలంటే వాటిని తియ్యగా, పుల్లగా హల్వా చేసి తినిపిస్తే సరిపోతుంది. కొన్నిరకాల ఆహార పదార్థాలు కూడా రోగనిరోధక శక్తిగా ఉపయోగపడతాయి. ఇటువంటి ఆహారపదార్థాల్లో హల్వా కూడా చేరుతుంది.

07/07/2017 - 22:56

పండ్లతో చేసే హల్వాలు ఆరోగ్యరీత్యా మంచివి. తియ్యగా, పుల్లగా ఉండటం వల్ల పిల్లలు ఇష్టంగా తింటారు. యాపిల్, పైనాపిల్, సపోట, సీతాఫలం, కర్బుజా, జామ, మామిడి, ద్రాక్ష, దానిమ్మ, కమలా, పందిరి దోస, పుచ్చ వంటివాటితో హల్వా తయారుచేసుకుంటే పిల్లలు, పెద్దలకు ఎంతో మంచిది.

07/01/2017 - 22:34

కేవలం తీసుకొనే ఆహారం గురించే కాదు ఏ విధంగా ఆహారాన్ని ఎప్పుడెప్పుడు తీసుకోవాలో కూడా అంటే మనం తీసుకొనే ఆహారంలో సగం తిని, మరో పావువంతు నీరు త్రాగి మిగతా పావు భాగాన్ని ఖాళీగా వుంచాలని, సాత్వికాహారం మాత్రమే భుజించాలని, అపక్వాహారాన్ని అంటే పచ్చికూరలు, పళ్లు, మొలకెత్తిన గింజలు వంటివి తినడం ఉత్తమమని మనకు భగవద్గీత చెబుతుంది.

06/29/2017 - 21:14

గోధుమ లు బలవర్ధకమైన ఆహారం. అన్ని వయసులవారికి ఈ ఆహారం మంచిదే. ఈ పిండితో సరికొత్త వంటలు చేస్తే పిల్లలు, పెద్దలు కూడా ఇష్టంగా తింటారు. మార్కెట్లో రకరకాల గోధుమ పిండి లభిస్తున్నా మంచి బ్రాండ్‌ది వాడితే మేలు.

06/22/2017 - 22:30

పనీరు పాలతో చేసిన పదార్థం. పాలలో ఎన్ని పోషక విలువలున్నాయో, పన్నీర్‌లో కూడా అంతకన్నా ఎక్కువ ఉంటాయి. పాలను విరిగిపోయేలా చేసి అందులో నీరు తీసివేసి దీన్ని అచ్చుగా ఫ్రిజ్‌లో పెడితే గట్టిగా కేక్ మాదిరి తయారవుతుంది. దీన్ని కావాల్సినంత ముక్క తీసుకొని వంటల్లోకి వేసుకోవచ్చు.

06/10/2017 - 21:25

మనం ప్రతిరోజూ ఎన్నో రకాల ఆహార పదార్థాలను తీసుకుంటాం. కాని వీటిలో ఏది మనకు ఎక్కువ పోషకాలను అందిస్తుందో తెలియదు. ముఖ్యంగా మధుమేహంతో బాధపడేవారు ఆహార నియంత్రణ పాటించకపోతే ఆరోగ్యం దెబ్బతింటుంది. వీరు కొద్దికొద్దిగా ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. విపరీతమైన నీరసం, అలసటకు గురవుతుంటారు.

06/02/2017 - 20:51

ప్రేమకు చిహ్నంగా భావించే పారిస్‌వాసులు అరకు కాఫీ ప్రేమలో పడిపోయారంటే అతిశయోక్తి కాదు. ఇక్కడ ఆరు అరకు కాఫీ విక్రయ కేంద్రాలు ఉన్నాయి. కిలో కాఫీ పౌడర్‌ను 92.05 యూరోలు అంటే మన దేశీయ కరెన్సీలో దీని రేటు 6,700.20 రూపాయలన్న మాట. నెస్‌కేఫ్ వంటి బహుళజాతి సంస్థలు అందించే కాఫీతో అరకు కాఫీ రుచిని పారిస్‌వాసులు ఆస్వాదిస్తారు. పారిస్ మహిళలు అధిక సంఖ్యలో వచ్చి అరకు కాఫీని కొనుగోలు చేస్తారు.

06/01/2017 - 20:54

వేడి వేడి అన్నంలో ముద్దపప్పు, ఆవకాయ, నెయ్యి కలుపుకుని తింటే ఆ రుచే వేరు. ఒక్క ముద్ద తింటే చాలు స్వర్గానికి బెత్తడు దూరంలో ఉన్నట్లు తెలుగువారు భావిస్తుంటారు. వేసవి సీజన్ వచ్చిందంటే ప్రతి ఇంట్లో ఆవకాయ తప్పనిసరిగా ఏడాదికి సరిపడా పెట్టుకుంటారు.

Pages