S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రుచి

05/10/2017 - 01:20

పిల్లలు బ్రెడ్ తినడానికి ఇష్టపడరు. బ్రెడ్‌లో రకరకాల కూరలు, మొలకెత్తిన విత్తనాలు, పళ్లు కూరగాయలతో టోస్ట్‌లు చేసిపెడితే ఇష్టంగా తింటారు. పెనంపై కాల్చేవారు. ప్రత్యేకమైన టోస్టర్లు వచ్చాయి.
టమాటాతో..

05/07/2017 - 10:15

బార్లీ పేరు వినగానే అనారోగ్యంతో బాధపడేవారికి మాత్రమే అది ఉపయోగపడుతుంది అనే దురభిప్రాయం ఉంది. ఇది ఎంతమాత్రమూ సరికాదు. బార్లీ అనారోగ్యంతో బాధపడేవారికి ఎంత ఉపయోగపడుతుందో, ఆరోగ్యంగా ఉన్నవారు అనారోగ్యంకు గురికాకుండా చూడడం కూడా చేస్తుంది. అయితే, నాగరికత ముసుగులో మనం ఎన్నో పోషక విలువలు ఉన్న బార్లీని నిర్లక్ష్యం చేసి, జంక్‌ఫుడ్స్‌పట్ల ఆకర్షితులమై అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నాం.

05/02/2017 - 22:33

హల్వా అనగానే శనగపిండి, గోధుమ పిండితో చేసేవే జ్ఞప్తికి వస్తాయి. కాని పండ్లతో కూడా నోరూరించే హల్వాలు చేసుకోవచ్చు. ఆరోగ్య రీత్యా మంచివి. యాపిల్, పైనాపిల్, సపోటా, సీతాఫలం, కర్బూజా, జామ, మామిడి, ద్రాక్ష, దానిమ్మ, కమలా హల్వాలు, పందిరిదోస పుచ్చ వంటి వాటితో రకరకాల హల్వాలు చేసుకోవచ్చు.
దానిమ్మ హల్వా

04/25/2017 - 23:43

వేసవిలో చల్లదనానికి పిల్లలు, పెద్దలు ఇష్టంగా తింటారు. ఇది బలవర్థకమైన ఆహారం. వెరైటీ ఫ్రూట్ కస్టర్స్ ఎలా చేయాలో తెలుసుకుందాం.
బనానా కస్టర్డ్
చక్కరకేళి అరటిపళ్ళు -2
పాలు - 1/2 లీటరు
కస్టర్డ్ పౌడర్ - 1 కప్పు
పంచదార - 1/2 కప్పు
ఏలకులు - 5
ఎండుకొబ్బరికోరు - 1/2 కప్పు

04/23/2017 - 20:59

సీజనల్‌గా దొరికే పండ్లలో వెలగపండు ఒకటి. దీనిని కనీసం ఒక్కసారైనా తింటే మంచిది. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఇందులో సమృద్ధిగా ఉండే విటమిన్ సి వ్యాధి నిరోధక శక్తిని పెంచి వ్యాధులను దరిచేరనివ్వదు. మహిళల్లో వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్, గర్భకోశంలో వచ్చే పుళ్లను రాకుండా ఆపుతోంది. వెలగ ఆకులను ఎండబెట్టి మెత్తగా నూరి, పొడిచేసి పంచదార కలిపి ఉంచుకోవాలి.

04/13/2017 - 01:45

రకరకాల పళ్లు వేసవి కాలం లో విరివిగా దొరుకుతాయి. తాజా పండ్లతో జ్యూస్‌లుగా చేసి ఫ్రిజ్‌లో పెట్టుకుంటే ఎండవేళ తాగతే సేదతీరుతుంది. చల్ల దనాన్ని ఇచ్చే పండ్ల రసాలలో బయట కెమికల్స్ వాడుతున్నారు. ఇవి వాడకుండా రెండు మూడు రోజులు నిలువ వుండేలా తయారుచేసుకుంటే మం చిది. వివిధ రకాల జ్యూస్‌లు ఎలా తయారుచేసుకోవచ్చు తెలుసుకుందాం.

04/08/2017 - 00:09

ఆధునిక జీవన విధానంలో మార్పు వల్లనేమోగానీ ఇటీవల కాలంలో కమ్మటి నిద్ర పోయి చాలారోజులైందంటున్నారు. కొందరికి సరిగా నిద్ర పట్టదు. మరికొందరికి నిద్రపట్టినా మధ్యలో మేలుకుంటారు. వీరికి మళ్లీ నిద్రపట్టక ఇబ్బంది పడుతుంటారు. అటువంటివారు
ఇవి తినాలంటారు.

04/06/2017 - 21:39

ఉసిరిలో అనేక ఔషదగుణాలున్నాయి. ఉసిరి కాయలో విటమిన్ సి ఉండటం వల్ల కళ్లకు మేలు చేస్తుంది. అలాగే జీర్ణశక్తిని పెంచి పైత్యాన్ని తగ్గిస్తుంది. వీర్యవృద్ధిని పెంచి సంతానోత్పత్తికి తగిన బలం చేకూరుస్తుంది. ఉసిరికాయ పొట్టు, నిమ్మరసం సగభాగాలుగా కలిపి నీటితో మెత్తగా మర్దించి ఆ మిశ్రమాన్ని తలకు రాసుకుంటే కళ్లలో చురుకుదనం కనిపిస్తుంది. ఇలా చెయ్యడం వల్ల తెల్లజుట్టు నల్లబడటమే కాక వెంట్రుకలు రాలకుండా ఉంటాయి.

04/06/2017 - 04:40

ఈ వేసవిలో ఎటువంటి పోషకాహారం తీసుకుందామా అని చాలామంది ఆలోచిస్తుంటారు. మండు వేసవిలో నిండు చల్లదనాన్ని పంచే తాజాపండ్లు ప్రతినిత్యం తీసుకోవడంవల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తవు. పైగాఅందంగా ఉంటారు.

03/17/2017 - 21:33

సిట్రస్ జాతికి చెందిన కమలాఫలంలో విటమిన్ సి పుష్కలంగా ఉంది. కమలా రసంలో కొంచెం ఉప్పు, కొంచెం పంచదార కలిపి తిన్నా బాగుంటుంది. మంచి వ్యాధి నిరోధక శక్తి కలిగిన కమలా పండు నేడు మార్కెట్లో విరివిగా దొరు కుంది. కమలాల తొక్కను ఎండబెట్టి పొడి చేసి నీళ్లలో కలిపి స్నానం చేస్తే చర్మవ్యాధులు తగ్గుతాయి. దీనితో హల్వా, తొక్కల పచ్చడి, పెరుగుతో సలాడ్ కూడా చెయ్యవచ్చు. కస్టర్డ్ ఇంకా బాగుంటుంది.
హల్వా

Pages