S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రుచి

02/07/2016 - 00:15

‘నోట్లో పచ్చి వెలక్కాయ పడ్డట్టు’ అని అంటుంటాం. ఎందుకంటే మరీ
వగరుగా ఉండే దీని గుజ్జు గొంతు దిగడం చాలా కష్టం. అయినా దీంతో
చేసే పచ్చడి, పెరుగు పచ్చడి, పప్పు కూర, హల్వా వంటివి ఏడాదికోసారైనా రుచి చూడాల్సిందే. పండిన గుజ్జు మంచి వాసనతో తీపి, పులుపూ
కలగలిసిన భిన్నమైన రుచితో ఉంటుంది. వినాయక చవితి నాడు గణపతికి అంత్యంత ప్రీతిపాత్రమైన వెలక్కాయలను పాలవెల్లి అలంకారంగాను,

02/04/2016 - 03:26

ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు కాలీఫ్లవర్‌లో పుష్కలంగా ఉన్నాయి. అందుకే శాకాహారంలో దీనికి ప్రత్యేక స్థానం ఉందని పోషకాహార నిపుణులు చెబుతుంటారు. పలురకాల క్యాన్సర్లను నివారించే గుణం దీనిలో ఉంది. విటమిన్-సి,కెతో పాటు ఫోలేట్ (్ఫలిక్ యాసిడ్), పొటాషియం, పీచు అధికంగా లభిస్తాయి. క్యాన్సర్‌ను ఎదిరించే ‘సల్పోరాఫెన్’ (ఫైటో కెమికల్స్) కాలీఫ్లవర్‌లో గణనీయంగా ఉం టుంది.

01/30/2016 - 21:20

దబ్బకాయలో విటమిన్-సి అధికంగా వుంటుంది. ఎలర్జీలు, దగ్గు, రొంపను ఇది తగ్గిస్తుంది. వీటిలో నారదబ్బ, తెల్లదబ్బ (పుల్లదబ్బ) అనే రకాలున్నాయి. నారదబ్బ మార్కెట్‌లో దొరకడం తక్కువ. పుల్లదబ్బ ప్రస్తుత సీజన్‌లో విరివిగా దొరుకుతుంది. వీటితో పులిహోర, నిల్వ పచ్చడి, పొగిచిన పచ్చడి, కూర వంటి వంటకాలు చేస్తారు.

.

01/30/2016 - 21:19

ఆవాలు - 2 చెంచాలు
మినప్పప్పు,శెనగపప్పు- 5 చెంచాలు
ఎండుమిర్చి - 24
పసుపు - 1 చెంచా
నూనె - 1 కప్పు
కొత్తిమీర - కొంచెం
దబ్బకాయలు - 2
బెల్లం - చిన్న ముక్క
ఉప్పు - 4 చెంచాలు

01/30/2016 - 21:18

బియ్యం - 2 కప్పులు
దబ్బరసం - 2 కప్పులు
పోపు- 2 చెంచాలు
కరివేపాకు - కొంచెం
ఎండుమిర్చి - 6
నూనె - 2 చెంచాలు
ఉప్పు - 2 చెంచాలు
పసుపు - 1/2 చెంచా

పోపు వేయించి చల్లార్చాలి. దబ్బరసంలో ఉప్పు,పోపువేసి ఊరనివ్వాలి. బియ్యం, పసుపు, కాస్త నూనె వేసి బిరుసుగా అన్నం వండుకోవాలి. దీన్ని చల్లార్చిన తర్వాత దబ్బరసం కలపాలి

01/30/2016 - 21:17

దబ్బకాయలను సన్నటి ముక్కలుగా తరిగి ఉప్పు, పసుపువేసి ఊరనివ్వాలి. మూడవ రోజున రసం పిండివేసి, ముక్కలను విడిగా ఎండబెట్టాలి. నాల్గవ రోజున పోపులు వేయించి కారం కలిపాక దబ్బరసంలో ఎండిన ముక్కలతో పాటు వేయాలి. తడి తగలకుండా ఉంచితే ఆవకాయలా ఏడాదిపాటు చెడిపోకుండా ఉంటుంది.

01/30/2016 - 21:16

బాణలిలో నూనె కాగనిచ్చి పోపులు వేయించి పక్కన పెట్టాలి. ఇదే బాణలిలో దబ్బ ముక్కలు, ఉప్పు, పసుపు, పచ్చిమిర్చి వేసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత ఇందులో బెల్లం కలిపి పాకం వచ్చేలా ఉడికించి పోపు, కొత్తిమీర వేసి కిందకు దింపాలి. ఈ వంటకం రెండు రోజుల పాటు చెడిపోకుండా నిల్వ వుంటుంది.

01/28/2016 - 21:35

ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేసే పీచు పదార్థాలు మన దైనందిన ఆహారంలో తప్పనిసరిగా ఉండాలి. జీర్ణం కాని కార్బోహైడ్రేట్స్‌నే ‘పీచు’గా వ్యవహరిస్తారు. మన జీర్ణాశయం జీర్ణించుకోలేని ఆహార పదార్థాలను పీచు పదార్థాలు అంటారు. నిజానికి పీచు చేసే మేలు ఎలాంటిదో నేటితరానికి అంతగా తెలియదు. ఇది ఆహారంలో పుష్కలంగా జీర్ణవ్యవస్థ మెరుగుపడడమే కాదు, చర్మానికి కాంతి వస్తుంది.

01/27/2016 - 22:33

పోషకాలున్న ఆహారం అంటే ఏమిటన్న సంశయం శాకాహారులను తరచూ వేధిస్తుంది. మంచి ఆరోగ్యం కోసం వేటిని తీసుకోవాలన్న ఆలోచన కలిగినపుడు పోషక విలువలపై తగిన అవగాహన ఏర్పరచుకోవాలి. శాకాహారులు తమ ఆహారానికి సంబంధించి ముఖ్యంగా అయిదు విషయాలను గుర్తుంచుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. గింజలు, పాలు, ఆహార ధాన్యాలు, పండ్లు-కూరగాయలు, కాయధాన్యాలు విరివిగా తీసుకుంటే శాకాహారులకు అవసరమైన పోషకాలు లభిస్తాయి.

01/23/2016 - 20:15

అరటిమొక్క కాండాన్ని ఒలిస్తే లోపలి భాగంలో తెలుపురంగులో పొడవైన గొట్టాల మాదిరి దవ్వ ఉంటుంది. అరటి దూటగా కూడా వ్యవహరించే దీనితో పలురకాల రుచికరమైన వంటకాలు చేస్తారు. ఆరోగ్యరీత్యా అరటిదవ్వ ఎంతో మేలు చేస్తుందని ఆయుర్వేద వైద్యులు చెబుతుంటారు. దవ్వను ముక్కలుగా కోసి బాగా ఎండబెట్టి తేనెతో కలిపి తింటే మహిళల్లో గర్భాశయ వ్యాధులు తగ్గుముఖం పడతాయి. ఇది మలబద్ధకాన్ని నివారించి శరీరానికి చలువను అందిస్తుంది.

Pages