S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మ ధ్వజం

06/21/2018 - 21:36

తలమీధ పోసే (పాలు-బియ్యం) అని అర్థం. మన వివాహ వేడుకల్లో అత్యంత వినోదంగా సాగే కార్యక్రమం. అత్యంత వినోదంగా సాగే కార్యక్రమంలో వధూవరులు తలంబ్రాలు పోసుకోవడం ఒక చక్కని సంప్రదాయం. వధూవరులు పసుపుతో అలంకృతమైన అక్షతలను దోసిళ్ళతో పోసుకోవడం మనం చూస్తాం. ఈ కార్యక్రమాన్ని ‘అక్షతారోపణ’మని పిలుస్తారు. మనం వివాహాల్లో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తాం.

06/20/2018 - 21:48

మాతృగణంలో భ్రాహ్మి, మహేశ్వరీ, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి అనే వాళ్లుంటారు. చాళుక్యులు మాతృగణ పరిపాలితులమని చెప్పుకున్నారు. కాబట్టి వీరి కాలంలో మాతృగణ ఆరాధన బాగా ఉండేది. అందుకే నన్నయ వీరిని పేర్కొనక తప్పలేదు. మాతృగణం తర్వాత సరస్వతిని స్తుతించాడు. సరస్వతి కవులకు ఇష్టదైవం. జ్ఞానప్రతీక. అక్షర స్వరూపం అందుకే ఆమెను స్తుతించారు. సరస్వతి తర్వాత చివరగా గిరిసుతను- పార్వతిని పేర్కొన్నాడు.

06/19/2018 - 21:25

‘శ్రీవాణీ గిరిజాశ్చిరాయ ధధతో వక్షోముఖాజ్గేషుయే
లోకానాం స్థితి మావహన్త్యవిహతాం స్ర్తిపుంసయోగోద్భవాం
తే వేదత్రయ మూర్తయ స్ర్తీపురుషాస్సంపూజితావస్సురై
ర్భూయాసుః పురుషోత్తమామ్భుజభవ శ్రీకన్ధరాశ్రే్శయసే’

06/18/2018 - 21:32

ఈ ధృష్ట్యా నాగార్జునుని గురించి పలురకాల కథలు వ్యాప్తిచెందాయి.
నాగార్జునుడు సిద్ధ నాగార్జునుడు వేరువేరని ప్రజల్లో ఒక గందరగోళం ఏర్పడింది. ఈ గందరగోళంలో ఈయన రసాయనిక శాస్త్రానికి చేసిన సేవలు, అనుపమానమైన పరిశోధనా కృషి యావత్తు తెరమరుగున ఉండిపోయాయి. ఈ వివాదానికి నిర్దిష్టమైన సమాధానానికి చరిత్ర ఆధారాలు సుస్పష్టముగా లేవు. ఈ విషయ చరిత్ర గ్రంథాల్లో అక్కడక్కడ వీరి పేర్లు వేరువేరుగానే వున్నాయి.

06/17/2018 - 21:16

ఓజస్సు, మనిషిలోని ఫ్రాణశక్తి, అస్వస్థతలు, దీర్ఘకాలిక వ్యాధులవలన ఈ ఓజస్సు క్షీణదశకు చేరుకుంటుంది. ఓజస్సును తిరిగి శక్తివంతంగా మార్చడానికి రసాయనములే ప్రధాన పాత్ర పోషించగలవని ఈయన వివరించారు.

06/15/2018 - 21:25

రసవాధ సిద్ధాంతాన్ని ప్రామాణికంగా తీసుకుని రసవిద్యలో అనేక ప్రయోగాలు చేసారు. భారతీయ రసవాదులలో ప్రథమశ్రేణికి చెందుతారు. బట్టీ పట్టడం(స్వేదనం), పరిశుభ్రం చేయడం (శుద్ధిపరచడం), భస్మం చేయడం (కాల్సినేషన్) మొదలైన విధానాలతో లోహముల రంగు మార్పు తీసుకురావడం, లోహ మిశ్రమం (మిశ్రధాతువు) చేయడం మొదలైనవి ఈయన నూతన ఆవిష్కరణలు.

06/14/2018 - 21:05

నాగార్జునుఢి పేరు తలచినంతనే బంగారాన్ని కృత్రిమంగా తయారుచేయడానికి అష్టకష్టాలు పడిన బౌద్ధ సన్యాసిగా గుర్తించే కాలం అది. ధాతు విజ్ఞానవేత్తగా ప్రచారం, గుర్తింపు పొందినా ఆచార్య నాగార్జునుడు ఆధునిక శాస్తవ్రేత్తలకు దూరమైపోయారు. పాదరసము వాడకాన్ని తొలిసారిగా ప్రయోగించినవారు ఈయనే. పాదరస్యాన్ని దాన్ని శుద్ధి చేసి ఉపయోగించే విధానం గూర్చి ప్రపంచానికి పరోక్షంగా తెలిపిందీ ఈయనే.

06/17/2018 - 21:57

నాగార్జునుఢి గురించి సకల శాస్త్ర పారంగతులు, అపరధన్వంతరి, శస్తశ్రాస్త్ర ప్రవీణుడు, తత్వవేత్త, తార్కికులు, ఖనిజ కళా నిష్ణాతులు, వేద విద్యా విశారదులు. కవి సార్వభౌములు, కళోపాసకులు, మాధ్యమికవాద (ప్రవక్త), మహాయన మార్తాండులు. శతాధిక గ్రంథకర్త- ఈ విధంగా ఎందరో పండితులు తమ తమ రచనలలో ప్రశంసించారు.

06/12/2018 - 21:44

‘‘మానవజాతి భవితవ్యాన్ని నిర్ణయించడానికి ఇంతవరకు కారణాలయినటువంటివి; ఇకమీద కారణాలు కాకున్నట్టివి అయిన మూలశక్తులన్నింటిలో కూడా మత రూపంలో కనబడేదాన్ని మించింది మరోటి లేదు’’ అన్నాడు స్వామి వివేకానందుడు. వందేళ్ళ క్రితం లండన్ నగరంలో మతావశ్యకత గురించి చెప్పిన సందర్భంలోని అమృతవాక్కులు మనం అవలోకనం చేసుకోవాలి.

06/11/2018 - 21:44

ఆఛార్యాత్ పాదమాదత్తే పాదం
శిష్య స్వమేధయా!
పాదం సబ్రహ్మచారిభ్యః పాదం
కాలక్రమేణచ
ఆచార్యునివల్ల ఒక పాదం (భాగం) స్వంత మేధతో ఒక పాదం (భాగం) ఒక పాదం (భాగం) తన తోటివారివల్ల, ఇంకో పాదం (భాగం) కాలక్రమంలో నేర్చుకొంటారని ఈ శ్లోకార్థం.

Pages