S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వాధ్యాయ సందోహం

03/06/2019 - 20:00

ఇక మానవుని ఆత్మ సృష్టికూడ వాటికి తక్కువేమీకాదు. సూర్యతాప ప్రభావం తనమీద పడకుండ ఎన్నో శీతలీకరణ సాధనాలను కనుగొన్నాడు. బడబానలాన్ని పూర్తిగా చల్లార్చివేసే జలాన్నికూడా గొట్టాల ద్వారా తన గృహసీమలోనకి తెచ్చుకోగలిగాడు.

03/05/2019 - 21:59

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు
*
శుక్ల యజుర్వేద మీ మంత్రార్థానే్న-
యస్మిన్ సర్వాణి భూతాన్యాత్మైవాభూద్విజానతః
తత్ర కో మోహ. కః శోక ఏకత్వమనుపశ్యతః శు.య.వే. 40-7
‘‘సమస్తజీవులు ఆత్మతో(తనతో) సమానమని భావించిన క్షణంలో ఆ జ్ఞానికి శోకమేమిటి? మోహమేమిటి? అని అనువదించింది.

03/05/2019 - 21:58

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం:
డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512
*

03/01/2019 - 19:41

ఎందుకంటే కారణాలేవయినా నాటివారి కంటే నేటి కాల దంపతులే విడివిడిగా జీవించే దౌర్భాగ్యస్థితిలో ఉన్నారు. అందుకే ‘ఇహైవ స్తం మా వి ష్టవ్’ ‘‘మీరిక్కడే విడివిడిగాగాక కలిసియే ఉండండి’’అని వేదం దంపతులకు సార్వకాలికమైన, సార్వజనీనమైన సందేశాన్ని విన్పించింది.

02/28/2019 - 20:19

అలాగే సత్పురుషుల ఆరాధన. సమాజపరంగా అది జరగకుంటే వారు నిరాదరణ వేదనాభరితులై దేశానికి అవసరమైన స్థాయిలో తమ సేవలనందించలేకపోతారు. ఆ విధంగా దేశ సంరక్షణా దృష్ట్యా ప్రతి అంశాన్ని యజ్ఞ భావనతో పౌరులు నిర్వహించవలసి యుంది. ఈ గుణాలు ఏనాటికైనా సార్వజనీనమైనవి. సార్వకాలికమైనవి.

02/27/2019 - 19:43

తీక్ష్ణమైన బల, వీర్య, మనోధైర్య సంపన్నత ఉగ్ర శబ్దానికి అర్థం. ఇది ఒక అసాధారణమైన కేవలం సంకల్పబల సంపన్నులయందు మాత్రమే కానవచ్చే అద్భుత లక్షణం. ఆ స్వతంత్య్ర పరిరక్షణకు ఎంతటి బృహత్ సంకల్పమున్నవారయినా తీవ్ర ప్రతిఘటన ఎదురయినపుడు మాత్రం వారు కొంత నిరుత్సాహానికి గురయి వెనుకంజ వేయవచ్చు.

02/26/2019 - 19:33

ఇలా ఎన్నో అర్థాల నిమిడించుకొన్న కార్యాచరణ రూపమే యజ్ఞం. యజుర్వేదంలోని 18వ అధ్యాయంలోని మొదటి ముప్పది ఎనిమిది మంత్రాలలో యజ్ఞార్థంగా జీవనోపయోగియైన సమస్త పదార్థాలను చెప్పి ఒక ప్రత్యేక మంత్రంలో ‘యజ్ఞేన కల్పంతామ్’ ‘‘ఈ పదార్థాలన్ని యజ్ఞార్థాలు కావాలి’’ అని ఆదేశం కనబడుతుంది. కాబట్టి సర్వభూత రహితమైన సమస్త కార్యాలు యజ్ఞార్థకాలే.

02/25/2019 - 19:34

ఈ సత్యధర్మ విరహితులు దేశాన్ని ఎంతటి అధోగతికైనా దిగజార్చుతారు. సత్యమహిమను వర్ణిస్తూ ‘సత్యేనోత్త్భితా భూమిః’ (అథర్వణవేదం. 14-1-1) ‘‘సత్యధర్మం మీదనే భూమి నిలిచియుంది’’అని అథర్వణవేదం హెచ్చరించింది. మనుస్మృతి కూడ ‘నాస్తి సత్యాతృపరో ధర్మః’ ‘‘సత్యాన్ని మించిన ధర్మంలేదు’’ అని వేద సందేశానే్న నిర్దేశించింది.

02/24/2019 - 19:46

సర్వేషాం మంగళం భూయాత్ సర్వేసంతు నిరామయాః
సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్‌॥
॥ పు.ఉత్తరాఖండం. 35-51॥
ఈ శ్లోక భావమే అర్ధ శ్లోకంగా మహాభారతంలో కనబడుతూంది.
సర్వస్తరస్తు దుర్గాణి సర్వో భద్రాణి పశ్యతు
మహా.్భ.శాంతి. 327-48॥
**
ప్రజలు రాజును ఎన్నుకుంటారు
త్వాం విశో వృణతాం రాజ్యాయ త్వామిమాః ప్రదిశః పంచదేవీః

02/22/2019 - 20:31

పుత్రో యజ్జానం పిత్రో రధీయతి:- తానూ సంతానవంతుడను కావాలనే కోరకను తల్లిదండ్రుల ఎదుట పలుమార్లు ప్రస్తావించిన కుమారుని మాటలు తల్లిదండ్రులకు సంతోషాన్ని కల్గిస్తుందని బాహ్యార్థమే అయినా సంతానోత్పత్తి చేయగల వయస్సునకు చేరిన తరువాత గాని కుమారునకు వివాహం చేయరాదని వేదం అంతరార్థంగా ప్రకటిస్తూంది. అంటే బాల్యవివాహం చేయవద్దని పరోక్షంగా వేదం శాసించిందని భావించాలి.

Pages