S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వాధ్యాయ సందోహం

04/08/2019 - 22:15

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512
*
విచిత్ర ధనాన్ని ఇమ్ము
సుబ్రహ్మాం దేవవంతం బృహంతమురుం గభీరమ్ పృథుబుధృమింద్ర
శ్రుత ఋషిముగ్రమభిమాతిషాహమస్మభ్యం చిత్రం వృషణం రయం దాః॥

04/03/2019 - 19:39

ఓ పరమేశ్వరా! ఉత్సాహాన్ని, చాతుర్యాన్ని, సత్కర్మాచరణ జ్ఞానాన్ని, సౌభాగ్యాన్ని, ఆరోగ్యవంతమైన శరీరాన్ని, మృదువు మరియు హితకరమైన వాగ్వైభవాన్ని, శోభన దినాలను, శ్రేష్ఠమైన ఈ ఐశ్వర్యాలను నాకనుగ్రహించుము.

04/01/2019 - 19:46

వేద మాకాంక్షించిన దేశం
ఆ బ్రహ్మన్ బ్రాహ్మణో బ్రహ్మవర్చసీ జాయతామా రాష్ట్రే రాజన్యః
శూర- ఇషవ్యో-తివ్యాధీ మహారథో జాయతాం దోగ్ధ్రీ
ధేనుర్వోఢానడ్వానాశుః సప్తిః పురంధిర్యోషా జిష్ణూ రథేష్ఠాః
సభేయో యువాస్య యజమానస్య వీరో జాయతాం
నికామే నికామే నః పర్జన్యో వర్షతు ఫలవత్యోన - ఓషధయః
పచ్యంతాం యోగక్షేమో నఃకల్పతామ్‌॥
యుజుర్వేదం 22-22॥

03/31/2019 - 22:22

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం:
డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512
*
భావం:- రెండు కాళ్లు మరియు నాలుగుకాళ్లుగల సమస్త జీవులపైన మృత్యువు తన అధికారాన్ని చూపుతుంది. అది కేవలం ఇంద్రియ సహితమై శరీరంమీద మాత్రమే అధికారం చూపగలదు. ఆత్మమీద కాదు. అట్టి గోపతి అయిన మృత్యువునుండి నిన్ను ఉద్ధరించి రక్షిస్తున్నాను. కాబట్టి నీవు ఆ మృత్యువునకు భయపడవద్దు.

03/28/2019 - 20:02

సంసార బాధాతప్త హృదయంతో విన్నవించుకొంటున్నాను
ఇదమింద్ర శ్రుణుహి సోమప యత్త్వా హృదా శోచతా జోహవీమి
వృశ్చామి తం కులిశేనేవ వృక్షం యో అస్మాకం మన ఇదం హినస్తి॥ ॥
భావం:- ఓ పరమేశ్వర! దుఃఖభారమైన మనస్సుతో నీకు నేనొక విన్నపాన్ని చేసుకొంటున్నాను. దానిని శ్రద్ధగా విను. ఈ నా మనోగత భావానికి అడ్డుతగిలి బాధించేవారిని గొడ్డలితో చెట్టును కూల్చేవిధంగా నరికి కూల్చివేస్తాను.

03/27/2019 - 20:08

దానమిప్పించండి
వాజస్య ను ప్రసవే సం బభూవిమేమా చ విశ్వా భువనాన్యంతః
ఉతాదిత్సంతం దాపయతు ప్రజానన్య్రిం చ న. సర్వవీరం ని యచ్ఛ॥

భావం:- అన్నం, ధనం, మరియు జ్ఞానాలను వృద్ధిచేసే కర్మలో మేము సంఘటితులమై ఉన్నాం. మాతోబాటు ఈ పదునాల్గులోకాలు కూడ ఈ కర్మలో సంఘటితమై ఉన్నాయి. ఓ జ్ఞానీ! దానమీయని లుబ్ధులచేత కూడ మాకు దానమిప్పింతువుగాక! మాకు దానవీరులచేత ధనాన్ని అనుగ్రహించండి.

03/26/2019 - 20:27

ఇందలి మొదటిది దేహం పృథివి. దీనినే ఆరంభంలో సాధకుడు సర్వస్వంగా భావిస్తాడు. దైవకృపవలన జ్ఞానుల సాంగత్యంలో భగవత్క్థాశ్రవణంవలన కలిగిన జ్ఞాన ప్రబోధం వలన పృథివీ తత్వమైన దేహంకంటే ఉన్నతమైనదొకటి ఉందని సాధకుడికి ఎరుకలోనికి వస్తుంది. అది మనసు, బుద్ధి, చిత్తం, అహంకారాల సమాహారం. వేదాంతులు ఈ సమాహారానే్న సూక్ష్మ శరీరమంటారు. ఇది మొదటి దేహం (పృథివి)కంటే మరింత సూక్ష్మమైనది మరియు ఉన్నతమైనది. ఈ దశయే అంతరిక్ష దశ.

03/25/2019 - 19:44

కొందరున్నచోటనే కూర్చుండి, మరికొందరు స్వయంగా తామే అన్నిచోట్లకు వెళ్లి, అన్నిచోట్లా నిత్యమూ పాపకార్యాలను, మోసాలనుచేస్తూ ఉంటారు. ఈ రీతిగా ఒక్కరేగాక మరికొందరిని కూడ తమతో కలుపుకొని రహస్యంగా దురాలోచనలుచేసి పాపకార్యాలను చేస్తూ ఉంటారు. వారంతా తామే చేసే పాపకృత్యాలను ఎవడూ గుర్తించలేదని భావిస్తూ ఉంటారు.

03/24/2019 - 21:57

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం:
డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512
*
నేను కాలిడిన గ్రామంలో
పిశాచాదులు పారిపోతాయి
న పిశాచైః సం శక్నోమి న స్తేనైర్న వనర్గ్భుః
పిశాచాస్తస్మాన్నశ్యంతి యమహం గ్రామమావిశే॥
అథ.వే.4-36-7॥

03/20/2019 - 22:20

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం:
డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512
*
బ్రహ్మవేత్తను చంపరాదు
తద్వై రాష్టమ్రా స్తవ్రతి నావం భిన్నామివోదకమ్‌ బ్రహ్మాణం
యత్ర హింసంతి తద్రాష్ట్రం హంతి దుచ్ఛునా॥ అథ.వే.5-19-8॥
భావం:- నీరు చిల్లుపడిన ఓడనే విధంగా ముంచివేస్తుందో ఆ విధంగా బ్రహ్మవేత్తను హింసించి చంపిన దేశం సర్వనాశనమవుతుంది.

Pages