S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వాధ్యాయ సందోహం

01/30/2019 - 18:41

నా మరణ శాసనంలో కూడ నీ దయయే ఇమిడి యుంటుంది. జ్ఞానప్రదాయకా! సృష్ట్యారంభంలో మానవులకు మార్గోపదేశకంగా బుద్ధినిచ్చావు. దానికి సహయోగంగా కంటికి సూర్యకాంతితో సమానమైన వేద విజ్ఞానాన్ని అందించావు. అది నాడు నేడురేపు మానవులకు కల్యాణదాయకమైయుంది. కాని జన్మమరణ చక్రభ్రమణ రూపమైన సంసారచక్రంలో నీవు ప్రదానం చేసిన మానవజన్మ స్వల్పకాలం కూడ మనలేక సుడులు తిరిగిపోతూ ఉంది. నీకు దూరంగా నాకు ఎన్నో జన్మలు నిరర్థకమైపోయాయి.

01/29/2019 - 19:44

నేను కూడ దానిని తినవచ్చుగదా అని ఒక ఆస్తికుడు ‘తదస్య ప్రియమభి పాథో అశ్వాం నరో యత్ర దేవ యవో మదంతి’ ‘‘దేనిని భుజించి భగవదనురక్తులు ఆనందాన్ని అనుభవిస్తున్నారు? వారు తినే అన్నాన్ని నేను కూడ తిననా’’అని ప్రకటించిన చిత్రమైన ఆకాంక్షతో ఈ మంత్రమారంభమైనది. ఆ అన్నమేదో ఆ అన్నప్రదాత ఎవడో ఈ మంత్రంలో వివరించబడుతూ ఉంది.

01/28/2019 - 19:06

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం:
డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512

01/27/2019 - 22:20

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512
*
అది ఇతరులకు సాధ్యపడేది కూడా కాదు. నిర్థారించుకొన్న లక్ష్యాలను సాధించేందుకు యోగ్యమైన సాధనాలను ఆ మనిషికి సమర్థులైనవారు కొందరు సూచించవచ్చునేమోగాని నిర్థారించుకొన్న జీవన లక్ష్యాల సాధనకై చేసే కార్యాలలో నిమగ్నుడు కావడం స్వేచ్ఛగా జరగాలని వేదం మంత్రంలో ‘స్వయమ్’ శబ్దాన్ని ప్రయోగించింది.

01/23/2019 - 19:39

ఆచార్యుడే ఉత్తముడయితే బాలుర జీవితమే సమున్నతస్థాయి నందుకొంటుంది. అంతేకాదు తల్లిదండ్రులవలన సంక్రమించిన కుసంస్కారాలు కూడ ఆ బాలురనుండి తుడిచిపెట్టుకుపోతాయి.

01/22/2019 - 18:45

జనులకు ఇట్టివారి కంటె హితైషులు లోకంలో మరొకరు ఉండరు. సహజంగా విద్వాంసులలో ఉండే ఈ సద్గుణాలను చూచి నేను కూడ విద్వాంసుడను కావాలనే కోరిక కలుగుతున్నది.
వివరణ:- ఈ మంత్రంలో విద్వాంసుల మాహాత్మ్యాన్ని సంక్షిప్తంగా వివరించడం జరిగింది.
క్రతూయంతి క్రతవః :- వారు క్రతు= కర్మలను చేయుటయే సహజ స్వభావంగా కలవారు. ఇట్టి విద్వాంసులను గురించి ముండకోపనిషత్తు (3-1-4)

01/21/2019 - 18:51

సృష్టికర్త సమస్తమూ ఇచ్చుగాక!
సవితా పశ్చాతాత్ సవితా పురస్తాత్ సవితోత్తరాత్తాత్సవితాధరాత్తాత్‌
సవితా నః సువతు సర్వతాతిం సవితా నో రాసతాం దీర్ఘమాయుః॥
భావం:- సృష్టికర్తయైన పరమేశ్వరుడు వెనుక, ముందు, పైన, క్రింద ఉన్నాడు. ఆయన మాకు సర్వవిధాలైన అనేక పదార్థాలను, సుదీర్ఘమైన ఆయువును ప్రసాదించుగాక!

01/20/2019 - 22:16

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం:
డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512
*

01/18/2019 - 19:16

అందుకే లింగ వివక్ష లేక వారిని విచారింపకయే వధింపమని అథర్వవేదం రాజును ఆదేశించింది. అయితే రాజు ఎవరు ఆతతాయే, ఎవరుకాదో నిర్ణయించే విషయంలో బహుజాగరూకుడైయుండాలి. అందుకై దానికి తగిన న్యాయ- ధర్మవ్యవస్థను, తత్కార్య నిర్వహణ వ్యవస్థను సువ్యవస్థితం చేయవలసి యుంది.
**
అతిథి పూజ
హిరణ్యస్రగయం మణిః శ్రద్ధాం యజ్ఞం మహో దధత్
గృహే వసతు నో - తిథి.

01/17/2019 - 19:08

నిద్రించుటకు శయ్యమీద వాలినా వెంటనే ఓంకారాన్ని జపించు. నిద్రవచ్చేవరకు ఆ జపాన్ని కొనసాగించు. ఆ స్మరణలోనే నిద్రపో. వాసనామయ శరీరం అణగిపోతుంది. దానివలన ప్రయోజనమెంతో ఉంటుంది’’.
పరమాత్మ ధ్యానం చేత సకల దురితాలు నశిస్తాయి. స్వప్నమంటే అది కేవలం మిథ్యయే. జాగ్రద్దశలోని సంస్కారాల ఖేలనమే స్వప్నం. ఈ స్వప్నాన్ని గూర్చి వేదమిలా హెచ్చరించింది.

Pages