S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వాధ్యాయ సందోహం

12/11/2018 - 22:19

151. మా సత్సంగం జ్ఞానులతో మాత్రమే
తం సుప్రతీకం సుదృశం స్వంతమవిద్వాంసో విదుష్టరం సపేమ
స యక్షద్విశ్వా వయునాని విద్వాన్ ప్ర హవ్యమగ్నిరమృతేషు వోచత్‌॥ ఋ.6-15-10.

12/09/2018 - 22:11

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512
*

12/07/2018 - 22:45

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512
*
భావం:- ఎవరు హృదయ విహారి అయిన భగవంతుని ఆజ్ఞలను బిడ్డలు తండ్రి చేసే పనులను ప్రీతితో అనుసరించే రీతిగా విని వెంటనే ఆచరిస్తారో వారికి మహాదాతయైన పరమేశ్వరుడు సకల ఐశ్వర్యాల ద్వారాలు తెరచి ఇస్తాడు. వారికై ఆనందాన్ని తెరల మాటున గుప్తంగా భద్రంగా ఉంచి అందిస్తాడు.

12/06/2018 - 18:43

జీవుని పదాలు అనగా సజీవంగా నిలిపి ఉంచే శరీరం, ఇంద్రియాలు, అంతఃకరణాలు మొదలైనవి. వీనిని రక్షించుమని చేసే ఇచటి ప్రార్థన చాలా విశిష్టమైనది. జ్ఞాన, కర్మ, ఇంద్రియాల అద్భుత రచనా విశేషం చేత, అనమాన ప్రమాణం చేత భగవంతుడు తెలియబడుతున్నాడు. అంతఃకరణలో (మనోబుద్ధ్యహంకార చిత్తాలలో) దైవ సాక్షాత్కారమే సిద్ధిస్తూ ఉంది. ఈ జ్ఞాన, కర్మ, ఇంద్రియాలకు, అంతఃకరణకు ఈ శరీరమాశ్రయం.

12/05/2018 - 18:49

వివరణ:- భగవదనే్వషణలు దైవముందనే విశ్వాసంతో సదా దైవాన్ని అనే్వషిస్తూ ఉంటారు. కాని లోకంలో సాధారణ జనులు దైవమెక్కడో ఏదో లోకాలలోనే ఉన్నాడని ఆయనను దర్శించే శక్తితమకులేదని కాబట్టి దైవం ఎప్పుడూ కనబడని వాడేనని భగవద్దర్శనానికి ప్రయత్నమే చేయరు. మరి కొందరు పరమేశ్వరుడు ధనం-బలం- సర్వసమర్థతలు కలవాడనే ఆశాభావంతో ఆయననుకోరి ప్రార్థిస్తూ ఉంటారు. ఆ భావన కూడ అసత్యం కాదు.

12/04/2018 - 18:53

‘తమ ఆసీత్ తమసా గూళ్హమగ్రే-ప్రకేతం సలితం సర్వమా ఇదమ్’
‘‘సృష్టికి పూర్వం గాఢాంధకారంతో ఆచ్ఛాదింపబడి యుండటంవలన సమస్తమూ గుప్తంగా ఉండిపోయింది. చలనశీల వస్తుజాలమంతా నిశే్చష్టమై రూపరహితమైపోయాయని వివరించింది.
మనస్మృతిలో దాదాపు ఈ మంత్రానికి అనువాదంగా ఈ వాక్యాలు కనబడతాయి.
ఆసీదిదం తమోభూతమప్రజ్ఞాతమ లక్షణమ్‌

12/03/2018 - 18:28

స్వారాజ్యం కోసం ఆకాంక్ష
ఆ యద్వామీయచక్షసా మిత వయం చ సూరయః
వ్యచిష్ఠే బహుపాయ్యే యతేమహి స్వరాజ్యే
భావం:కోరదగిన జ్ఞానవంతులారా! పరస్పరమూ అభిమానించుకొనే స్ర్తి పురుషులారా! విద్వాంసులైన మీరు మేము కలిసి సర్వ విధాలుగా సంరక్షణీయమైన స్వర్గరాజ్యాభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేద్దాం.

12/02/2018 - 21:52

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512
*

11/30/2018 - 18:28

సదుపదేశానికి అధికారి ఎవరు?
య శ్చికేత స సుక్రతు ర్దేవత్రా స బ్రవీతు నః
వరుణో యస్య దర్శతో మిత్రో వా వనతే గిరః॥ ఋ.5-65-1॥
భావం:- ఎవడు జ్ఞానియో, ఎవనికి దైవమే ఆదర్శమో, ఎవని మాటలను భగవానుడు కూడ సమాదరిస్తాడో అతడే సత్కర్మల నాచరించినవాడు. అతడే మాకు దేవతలను లేదా సజ్జనులను గురించి ఉపదేశించుగాక!

11/29/2018 - 19:46

కాని పైకి లేపడమే కష్టం. అలాగే చంపడం కూడ కష్టమైన పనికాదు. కాని జీవింపచేయడమే మహాకష్టం. అదే వీరకార్యమవుతుంది. దేవతలు కూడ మానవునినుండి ఇట్టి వీరకృత్యాలనే ఆశిస్తారు. అథర్వణ వేదంలో ‘పునంతు మాదేవజనాః’ (అథ.వే.6-10-1) ‘‘అపరాధులైన మమ్ము దేవజనులు (సత్పురుషులు) పవిత్రులుగా చేయుదురుగాక’’అని కనబడుతున్న ప్రార్థన ‘‘దేవా జీవయథా పునః’’అన్న ఋగ్వేద సందేశానే్న పునరుద్ఘాటిస్తూంది.

Pages