S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వాధ్యాయ సందోహం

11/02/2018 - 19:57

భగవంతుడిని మేమేవిధంగా పూజించగలం?

11/01/2018 - 19:05

ఆధ్యాత్మిక మార్గంలో నడవాలని కోరుకొనేవాడు ముందుగా తనకు తానై తన జీవిత వ్యవహార సరళిని పరిశుద్ధం చేసుకోవాలని భావం. భగవద్గీత (6-17) ‘యుక్తాహార విహారస్య...యోగో భవతి దుఃఖహో’ ‘‘యుక్తియుక్తమైన ఆహార విహారాలు కలవానికే యోగం దుఃఖ నాశనకారకమవుతుంది’’అని ఈ విషయానే్న సమర్థించింది.

10/31/2018 - 20:46

ఓ మనిషీ! నా మాట విను
ఆశ్రుత్కర్ణ శ్రుధీ హవం నూ చిద్ద్ధిష్వ మే గిరః
ఇంద్ర స్తోమ మిమం మమ కృష్వా యుజశ్చిదంతరమ్‌॥ ఋ.1-10-9॥
భావం:- అన్నివైపులనుండి అన్నింటిని వినగల ఓ నరుడా! నా ఉపదేశాన్ని విను. నా మాటలను తప్పక ఆచరణలో పెట్టు. జ్ఞాన సంపన్నుడవైన ఓ మానవుడా! నా రుూ జ్ఞానోపదేశాన్ని శ్రద్ధ్భాక్తులతో నీవు మనస్ఫూర్తిగా స్వీకరించు.

10/30/2018 - 19:10

ఈ కారణంచేతనే వేదాన్ని కణాదుడు ‘తద్వచనా దామ్నాయస్య ప్రామాణ్యమ్’ వేదం ఈశ్వరప్రోక్తమైన వచనం కాబట్టి పరమ ప్రామాణికమైనదని చెప్పాడు.

10/29/2018 - 20:37

సోమరసపాన ఫలం
ఇమే సోమాస ఇందవః సుతాసో అధి బర్హిషి
తా ఇంద్ర సహసే పిబ॥ ఋ.1-16-6॥
భావం:- ఓ ఇంద్రా! ఆనందదాయకమైన సోమరసాన్ని దర్భాసనం మీద కూర్చుని పిండి ఉంచుతారు. దానిని బలంకోసం త్రాగుము.

10/28/2018 - 22:34

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512

10/26/2018 - 18:45

ఆ పసిబిడ్డ నున్నని బుగ్గలమీద నీ చేతినుంచి జాగ్రత్తగా పరిశీలించు. ప్రాణప్రథమ స్పందన స్పష్టంగా అక్కడ కనబడుతుంది. ఈ విధంగా ప్రాణాలు క్రిందినుండి పైకిపోయే తమ సంచారాన్ని తెలుపుతూ ఉంటాయి. ఆ ప్రాణ సంచారాన్ని చాలామంది గుర్తించలేరు. కాని ‘శ్రుణోతి కశ్చి దేషామ్’ ఎవరో కొద్దిమంది మాత్రమే గుర్తించగలుగుతున్నారు. ఒక దినమంతా ప్రాణాల సంచార శబ్దాన్ని విను. వానిని నిరోధించు. నీ దేహగతమైన మేరుదండం చలించిపోగలదు.

10/25/2018 - 18:33

ఆ సర్వభూత నివాసుడు ‘ప్ర వీర్యేణ దేవతాతి చేకితే’ (ఋ.1- 55-3) సర్వశక్తిమంతుడు కావడంవలన దేవతలకంటె, మహాదానవీరుల కంటె మరియు దివ్యగుణసంపన్నుల కంటె మిన్నగా పరిగణింపబడతాడు. అం దుచేత
అధా చ న శ్రద్ధ్ధతీ త్విషీమత ఇంద్రాయ (ఋ.1-53-5)
జ్ఞానక్రియాబల తేజఃసంపన్నుడైన భగవానుని ఎడల భక్తికలిగి ఏకాంతంగా ఆయనను భజించి నీలోని బల- వీర్య- పరాక్రమ- జ్ఞాన- ధ్యానాదులకు యోగ్యమైన జ్ఞానోపదేశాన్ని గ్రహించు.

10/24/2018 - 18:55

ఇతరుల సహాయ సహకారాలను అపేక్షించనివాడనని భగవచ్ఛక్తి సామర్థ్యాలను వివరించింది.
కాని దీనికి ప్రమాణమేది? అన్న వితండవాదం చేసేవారికి సమాధానంగా ‘చక్రుషే భూమిం ప్రతిమానమోజసః’ ‘‘పరమాత్మ ఈ భూమిని తన శక్తిసామర్థ్యాలకు ప్రతి రూపంగా నిర్మించాడు’’అని తార్కాణాన్ని చూపింది. ఇది ఒక్క వాక్యంలో ఉన్నా ఎంతో విశే్లషాత్మకమైన గంభీర విషయగర్భిత వాక్యం.

10/23/2018 - 22:39

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512
*
మనువు ఈ క్రింది విధంగా పేర్కొన్నాడు.
అకామస్య క్రియా కాచిత్ దృశ్యతే నేహ కర్హిచిత్‌
యద్యద్ధి కురుతే కించిత్తత్తత్కామస్య చేష్టితమ్‌॥ మనుస్మృతి 2-4॥
భావం:- నిష్కాముడు చేసిన పని లోకంలో ఎక్కడ కనబడదు. లోకంలో ఎక్కడ ఏ పని కనబడినా అది కోరిక చేత చేయబడింది.

Pages