S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వాధ్యాయ సందోహం

09/27/2018 - 18:36

యజ్ఞానికి ఆహూతులైన దేవతలనెందుకు కలుసుకోవాలి? శాంతికోసం. మరియు సోమరస పానం కోసమే. అయితే అందరూ వచ్చి ‘పిబా నిషద్య’ కూర్చుని త్రాగండి అని యాజ్ఞికులచే ఆహ్వానం పలుకబడింది. కూర్చోవడం మనసునకు గల చంచలతను పారద్రోలే స్థితికి సంకేతం. అసలు త్రాగినా- తిన్నా కూర్చుండి మాత్రమే చేయాలి. వైద్యులు కూడ ఆ మాటనే చెబుతారు. ప్రస్తుతం యజ్ఞానికి వచ్చినవారు త్రాగేది సోమరసం కదా. కాబట్టి దానికో ముఖ్యమైన నియమముంది.

09/26/2018 - 18:37

ఇది సామాన్య విషయమైన అంత్యకాలంలోగాని జీవుడికి నిజంగా స్వానుభవంలోనికి రాని ఈ నిత్యసత్యాన్ని యస్య ప్రయాణమస్యన్య ఇద్యాయు ర్దేవా దేవస్య మహిమాన మోజసా ప్రథమ దేవ సమానుడైన ఆత్మ ప్రయాణ (శరీర త్యాగం) సమయంలో ద్వితీయమైన దేవసమానమైన ఇంద్రియాలన్నీ వెంటనే ప్రయాణమై ఎటుకో వెళ్లిపోతాయి అని శుక్ల యజుర్వేదం (11-6) మానవ సమాజానికి జ్ఞప్తికి తెచ్చింది.

09/25/2018 - 18:22

జడమైన ప్రకృతికి దానినుండి పుట్టిన జీవానికి ప్రాణ చైతన్యాన్ని ప్రదానంచేసేవాడు కేవల మాదైవమే. మానవుడిగా పుట్టి దైవసమానుడవుకావాలని కోరుకొంటె నీవు కూడ ఈ జడ ప్రకృతిలో జీవనాన్ని నింపేవాడవుకమ్ము అని పై వేదమంత్ర పరమార్థ బోధన.

09/24/2018 - 18:19

యజుర్వేదంలోని 1-5 మంత్రాన్ని వ్యాఖ్యానిస్తూ శతపథ బ్రాహ్మణంలో మహర్షి యాజ్ఞవల్క్యుడు ‘సత్యం వై దేవా అనృతం మనుష్యాః’ దివ్యులు సత్యశీలురైయుంటారు. మానవులు అనృతులు (న+ఋత)గా ఉంటారు అని నిష్కర్షగా చెప్పాడు. అంటె మనుష్యులు మనుష్యత్వ స్థితిలో ఉన్నంతవరకు ‘ఋత్’= సత్యనియమాలను వ్యతిరేక పద్ధతిలో ఆచరిస్తూ ఉంటారని ఆ ఋషి ఆంతర్యం. కాని మనిషి జీవిత లక్ష్యం దివ్యత్వాన్ని పొందడమే.

09/23/2018 - 22:22

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512

09/21/2018 - 19:51

‘ఆపిః పితాప్రమతి? సోమ్యానామ్’’ శాంతికాములకు నీవే పొందదగిన ఆప్తబంధువు.’’ ఉత్సాహపరచే తండ్రివి. శాంతిని అనే్వషిస్తూ ఎన్నోచోట్ల తిరిగాం. తిరిగి తిరిగి చివరకు శాంతికి బదులుగా అశాంతికి గురయ్యాం అని దైవం ముందా జీవుడు మోకరిల్లాడు.

09/20/2018 - 20:19

అయితే లోకంలో అందరూ యజ్ఞ- దాన- తపో దీక్షాదులు చేయలేరు. అట్టివారు వాటి ప్రాధాన్యాన్ని గుర్తించి వాటిని ఆచరించలేని తమ అశక్తతను గ్రహించి భగవంతుని శరణాగతిని పొందితే ఆయన వారిని ‘ఆధ్రస్య చిత్ప్రమతి రుచ్యసే పితా’ తండ్రివలె ఆదరించి జ్ఞాన ప్రబోధం చేస్తాడని వేదం ధైర్యాన్ని చెబుతూంది. అంతమాత్రమే కాదు.

09/19/2018 - 19:19

ఈ మంత్రంలో దైవోపాసన మరియు దైవ పూజ వలన కలిగే ఫలం వివరింపబడింది. చీమ నుండి బుద్ధిమంతుడైన మనిషి వరకు అందరూ సంపాదనలో నిమగ్నులైయుంటారు. అందరకు ధనం మీద ఆశే. ధనమే లేకుంటే అందరకు మృత్యువే కనబడుతుంది. అన్నం, వస్త్రం, పశువులు, గృహాలు, ఇలా అన్నీ ధన స్వరూపాలే. బయట తిరుగుతూ ఆహారాన్ని సంపాదించుకోలేని కాలంలో సుఖంగా జీవించేందుకు చీమలు రాత్రింబవళ్ళు ఆహార సంపాదనకై తిరుగుతూ ఉంటాయి.

09/18/2018 - 18:52

అలాగే సూర్యుడు తన ఆకర్షణ- వికర్షణల బలంచేత భూమిని తన అదుపులో ఉంచుకొంటున్నాడు. చంద్రుణ్ణి భూమి తన ఆకర్షణ శక్తి చేత తన చుట్టూ తిరిగేవానిగా చేసికొంటూంది. మరి చంద్రుణ్ణో సముద్రానే్న సంక్షోభానికి గురిచేస్తున్నాడు. సముద్రం! తీర ప్రాంతాలను కోతకు గురిచేస్తోంది. అగ్ని నీటిని ఆవిరి చేస్తోంది. నీరు నిప్పును ఆర్పివేస్తోంది. పెనుగాలి ఇండ్లను, వృక్షాలను కూల్చివేస్తోంది.

09/17/2018 - 18:39

ఈ విషయాన్ని గురించి స్వామి దయానంద సరస్వతి ఇలా అన్నారు.

Pages