S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వాధ్యాయ సందోహం

07/18/2018 - 19:24

సంసార సాగరాన్ని దాటడానికి ఈ దేహం నౌక వంటిది. దానికి చిల్లు పెట్టి ముంచివేస్తే మునిగేది నౌకే కాదు దానితోబాటు మీరూ మునిగిపోతారు. మోక్ష్య లక్ష్యాన్ని చేరుకోకనే సంసార కూపంలో మునిగిపోతారు. అందుకే దేహనౌకను శ్రద్ధగా రక్షించుకోవాలి. అందుకే వేదమీ మంత్రంలో ‘యజస్వ తన్వమ్’ అని చెప్పింది.

07/17/2018 - 18:50

శరీర సంరక్షణయే యజ్ఞం
స్వయం యజస్వ దివి దేవ దేవాన్ కిం తే పాకః కృణవదప్రచేతాః
యథా యజ ఋతుభిర్దేవ దేవా నేవా యజస్వ తస్వం సుజాత
భావం: ఓ మానవుడా! శిరస్సున నుండే జ్ఞానేంద్రియాల ద్వారా సమీకరింపబడిన సదాలోచనలను ఉత్తేజపరచుము. సదాలోచన తత్పరుడవైన నిన్ను మూఢులేమి చేయగలరు? ప్రతి ఋతువునందు తదనుగుణంగా దేవతలనెలా ఆరాధిస్తావో అదే విధంగా నీవు దేవతామయమైన శరీరాన్ని ఆరాధనాభావంతో ఆదరించుము.

07/16/2018 - 19:00

శుక్రమ్= జ్ఞాన బలరూపమైన తేజస్సును; యజతమ్- హృదయగతంగా చేసికొంటున్నాను.;
భావం:- అగ్నిరూపుడైన భగవంతుని తల్లి-తండ్రి-సోదరుడు- మిత్రుడుగా స్వీకరిస్తున్నాను. జీవనప్రదాయకమైన అట్టి భగవానుని మహాతేజస్సు సదా పూజార్హమైనది. జ్ఞానబలరూపమైన పరమాత్మ సూర్యాగ్ని తేజస్సును సదా హృద్గతంగా చేసికొంటున్నాను.

07/15/2018 - 22:14

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు
*

07/13/2018 - 18:49

నిరంతర ధ్యానంవలన గొప్ప శాంతి రూపమైన జ్ఞానాన్ని పొందగలరని ‘ఉరుజ్యోతిర్వివిదుర్ద్ధ్యీనాః’ అని వేదం కంఠోక్తంగా చెబుతూంది. ధ్యాన శబ్దానికి ఒక సామాన్యార్థం విచారణ చేయుట అని. ఏదేని పదార్థంలోని గుణ-దోషాలను పరిశీలించుటయే విచారణ. ఫలానా వస్తువు గ్రహించదగినది ఫలానా వస్తువు గ్రహింపరానిది అన్న వివేకమే విచారణగా చెప్పబడుతుంది.

07/12/2018 - 18:30

అంతేకాక సర్వవ్యాపకుడైన ఆ విరాట్ స్వరూపుడు ఏ కర్మకు- ఎవరికి ఎట్టి ఫలాన్ని అనుగ్రహించాలో కూడ సంకల్పిస్తాడు. ఆ విధంగా జీవులకు కర్మఫలప్రదాతయై యుంటాడు అన్న సద్భావనతో వారు జీవిస్తూ ఉంటారు. అట్టి సజ్జన జీవనంతో వారి పాపకర్మఫలాలు దగ్ధమైపోతాయి. ఇట్టి విజ్ఞానం సర్వజన సాధారణంకాదు. అందుచేత జీవులు తమ నైసర్గిక అజ్ఞానం వలన పాపకూపంలో పడగొట్టే పాపకృత్యాలను చేసేందుకు సిద్ధపడుతూ ఉంటారు.

07/11/2018 - 19:51

ఈ విషయాన్ని అటుంచి ప్రస్తుతాంశమైన ఇంద్రియ పరిశుద్ధతకు హేతువయిన సంయమనాన్ని గూర్చి విచారిద్దాం.
మంత్రంలో ఇంద్రియాలు ‘హరి’ శబ్దంచేత చెప్పబడ్డాయి. హరిశబ్దానికి హరించునది అని గికార్థం. బలీయమైన తమ శక్తిచేత ఇంద్రియాలు ఆత్మను వశపరచుకొని మంచిగాని చెడు గాని మార్గాలవైపునకు హరించుకొని అంటె లాగికొనిపోవడం వాటి స్వభావం. అందుకే ఇంద్రియం= హరిశబ్ద యోగ్యమయింది.

07/10/2018 - 19:49

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు

07/08/2018 - 21:30

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు
*
భావం: జ్ఞానదృష్టితో వస్తుతత్వాన్ని దర్శించగల శాంతికాముక జీవులారా! సమస్త భోగవస్తువులతో నిండిన ఈ లోకాలన్నీ మీ కొరకు మాత్రమే సృజింపబడియున్నాయి. నదీ నదాలు, సెలయేర్లు మొదలగునవన్నీ మీ కొరకు మాత్రమే పుష్కల జలప్రవాహాలతో ప్రవహిస్తూ ఉన్నాయి.

07/06/2018 - 22:21

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు

Pages