S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్ర గాథాలహరి

11/11/2018 - 22:48

ఆ.వె కానలోనమండు కార్చిచ్చునుగనియు
అరుణవర్ణ శోభనలరుచున్న
పూచినెగడు నట్టి మోదుగు చెట్లంచు
భ్రమసి లేడి కూన వదలిరాదు
అడవిలో కార్చిచ్చు ఎర్రగా మండుతోంది. కానీ అమాయకమైన లేడి మాత్రం ఆ ఎర్రదనాన్ని పూచిన ఎర్రని మోదుగు పూలుగా భావించి ఇవతలికి రావటం లేదట. పాపం ఆ అమాయకపు లేడికి ఏవౌతుందోనని ఆందోళన పడుతున్నాడు గాథాకారుడు.
వివరణ

11/09/2018 - 18:53

ఆ.వె మావిచిగురు కనగ, మధుమాసవేళలో
మరి మరి విహరించు మన్మధుండు
విరహుల ప్రహరించి పెకలించినట్టిదౌ
బల్లెమట్లు అరుణ వర్ణమందె
నవ వసంతవేళ కుంకుమ వర్ణంతో ఉన్న మావిచిగురు ఎలా ఉందంటే, విరహ బాధాతప్తులైనవాళ్లను మన్మథుడు తన బల్లెంతో పొడిచి వెలికి తీయగా దానికి నెత్తురంటితే ఎలా ఉంటుందో, అలా ఉందట.
వివరణ

11/08/2018 - 19:12

ఆ.వె చెరకు గడకు గాని, స్థిరచిత్తునకుగాని
నలిగిపోవు బాధ కలుగుగాక!
ఒకటి మధుర రసము నొసగు, మరియొకండు
మధుర భాషణంబు మానలేడు

భావం : చెరకు గడను పీల్చి పిప్పి చేసినా కూడా మధురమైన రసానే్న ఇస్తుంది. అలాగే ఉత్తములైన వాళ్ళకు బాధ కలిగినా కూడా కఠినంగా, అప్రియంగా మాట్లాడకుండా తమ సహజమైన రీతిలో మధురంగానే మాట్లాడతారు.

వివరణ:

11/06/2018 - 19:38

ఆ.వె ఆమె ఇంటిలోని అవనీతలంబెల్ల
తడియుచుండె వర్షధార తోడ
కొంత మిగిలెనేని గుడిసెయందు, అదియు
తడియు, నామె బాష్పధారతోడ

11/05/2018 - 19:07

ఆ.వె మధుర సౌరభములు, మంగళవాద్యమల్
భక్ష్య భోజ్యతతులు, పానకములు
కంటగింపులాయె, కాంతకు హోళిలో
చెంత ప్రియుడు లేని చింత చేత
హోళీ పండుగ జరుగుతోంది. మంగళవాద్యాలు అందంగా మ్రోగుతున్నాయి. సుగంధ పరిమళాలెల్లెడలా వెదజల్లబడుతున్నాయి. తినడానికి రుచికరమైన పదార్థాలు అందుబాటులో ఉన్నాయి. ఇవేవీ ఆమెకు ఆనందం కలిగించడంలేదు. కారణమేమిటంటే ప్రియుడు చెంత లేకపోవడమే.
వివరణ

11/04/2018 - 22:18

ఆ.వె నిఖిల జగమునందు నీ చిత్రపటముల
వ్రేలగట్టిరనగ వేల్పులెవరో
అన్ని దిక్కులందు అగుపించు నీ రూపు
నాదు నేత్రములకు ననవరతము
ప్రియా! ఎటు చూస్తే అటు నువ్వే కనిపిస్తున్నావు. నీ చిత్ర పటాలను భూమిపై అన్ని దిక్కులయందు వ్రేలగట్టినారా ఏమి? అని ప్రశ్నిస్తోంది నాయిక.
వివరణ

11/02/2018 - 19:59

తే.గీ మేనిపై ధూళి మెండుగా మెలగుగాక!
పంక సంకరస్థితిలోన పరుగుగాక!
గడ్డిపోచలు దేహాన కలుగుగాక!
తానె చాటగలదు కరి తనదు ఘనత

11/01/2018 - 19:06

ఆ.వె ఆలుబిడ్డలెపుడు అనుకూలముగనున్న
వాడె, చూడ! పరమ భాగ్యశాలి
అట్లు లేనివాడు అవనీధవుండైన
కడు దరిద్రుడనుట, కటిక నిజము
అనుకూలంగా వున్న భార్యా బిడ్డలున్నవాడే లోకంలో అదృష్టవంతుడు, ధనవంతుడు. అలా కాకుండా నిరంతరం జగడమాడే భార్య, సమస్యలతో సతమతమయ్యే సంసారమున్నవాడు ఎంత ఐశ్వర్యమున్నా, తుదకు రాజాధిరాజే అయినా వాడు కటిక పేదవాడితో సమానం అని ఈ గాథాకారుడి భావం!
వివరణ

10/31/2018 - 20:53

ఆ.వె నీరజాక్షి! కనగ, నీదు కనుబొమల
విల్లునుండి బయలు వెడలుచున్న
వాలుచూపులనెడు, బాణాలు తగిలియు
బ్రతికి బయటపడిన వాడెవండు?
‘‘అందమైన కన్నులుగల ఓ అమ్మారుూ! నీ కనుబొమలు అనే విల్లునుండి వెలువడుతున్న వాలు చూపుల బాణాలు తగిలి బ్రతికి బట్టకట్టిన వాడెవడు?’’ అని అందమైన నాయిక వాడి చూపులను వర్ణిస్తున్నాడు గాథాకారుడు. ‘చంపేసేంత అందం’ అంటారే! అదే ఈ గాథలోని విశేషం.
వివరణ

10/30/2018 - 19:12

ఆ.వె కామితముల దీర్ప, కష్టంబులను బాప
కలిమి బలిమి జవముగలుగువారు
శాలివాహనుండు, సర్వేశ్వరుండును
గాక, అన్యులెవరు కలరు ధరణి

Pages