S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకృష్ణ లీలారింఛోళి

04/10/2019 - 19:30

ఆ. వె. ధాన్య లక్ష్మికొరకు ధనలక్ష్మి కొరకునై
అవని భక్తజనులు అడుగుచుంద్రు
మోక్షలక్ష్మి కొరకు మునులు ధ్యానింతురు
ఎన్న నీవె తగదు వన్ని యొసగ ॥

04/09/2019 - 19:51

ఉ. నందుని సుందరీ నయన నర్తన మూర్తికి చారుకీర్తికిన్
ఇందుని సోదరరీలలిత సృత్కమలాంతర నిత్యవర్తికిన్
చందన గంధ బంధురిత సాంద్రదయారస పూర్ణ మూర్తికిన్
వందన మాచరించెద శుభంబులనందగ నందమందగన్

భావం: నందుని సుందరి అనగా యశోదమ్మ కన్నులలో నిత్యమూ నాట్యమాడెడు వాడు, లక్ష్మీదేవి హృదయంలో నిత్యమూ వసించే వాడు, చందనము వలె దయతో కూడిన చల్లని హృదయం కలవాడు ఐన నంద గోపాలునికి వందనం.

04/08/2019 - 19:28

తే.గీ. రమ్య చంద్రికా రోచిస్సులలరు వేళ
ఫుల్లమల్లికా స్తబకముల్ వెల్లివిరియ
పికరవమ్ములు వీనుల విందు సేయ
మధుర మురళీరవంబులు మలయుచుండ
ప్రధిత బృందావనాంతర ప్రమద సదన
మందు సుందర గోపికా బృంద మెల్ల
ఘనత రానంద జలధిలో మునిగి తేలె

04/07/2019 - 22:34

సీ. గోపాల బాలుని గో పాలనంబును
ప్రత్యక్షముగ జూచు భాగ్యగరిమ
గోపాల దేవుని గోవర్థనోద్ధార
కార్యనిర్వహణంబు గాంచు కలిమి
విశ్వాంత రాత్ముని వేంనాదమ్ములా
కర్ణించు కర్ణముల్ గల్గియుంట
నంద నందనుని ఆనంద కేళీవిలా
సంబులక పరోక్ష సాక్షులగుట

04/04/2019 - 19:49

తే.గీ. నందనందను శుభవందనార వింద
చంద్రికాదర్శనానంద సమయమందు
తనువునయన మయమ్మైన తనవి తీ రు
నని తలచిరి వ్రజాంగనల్ మనమునందు

04/03/2019 - 19:54

తే.గీ. వెన్న దుత్తను జూచియు వేగ జేర
కడగి మెల్లగా పాకుచు వెడలుచుంట
ఇంతలోపల ను యశోద ఎదురుపడగ
ఏమియు నెరుగ కున్నట్లు మోము ద్రిప్పి
చల్లగా జారుకొన జూచు నల్లనయ్య
చల్లగా చూచి మనలను సాకుగాక!

04/02/2019 - 19:52

సీ. అమరేంద్రు గర్వంబు హరియించి వెల్గిన
ధనగోవర్థనోద్ధర్త వీవు
వల్లవీ జనముల వలువలు హరియించి
భాసిల్లు గోపికా భర్త వీవు
క్రౌర్య స్వరూపుడౌ కంసుని ప్రాణముల్
హరియించిన యసుర హర్త వీవు
ఆర్తజనంబుల అఘముల బాపియు కాచిరక్షించెడు కర్త వీవు

04/01/2019 - 19:59

తే.గీ. న్యాయశాస్త్రంపులోతుల నరసినాను
తర్కశాస్త్రంబు దుముట్ట తరచినాను
విరివిగా శాస్తమ్రముల్ చదివితినిగాని
నీదు మురళీ రంవబున నిండియున్న
కమ్మదనమును వానిలో గాంచనైతి

03/29/2019 - 19:01

తే.గీ. దారుణ ధ్వాంత తతికి మార్తాండుడైన
వాడు భవరోగ సమితికి వైద్యుడైన
వాడు, దాహార్తులకు భవ్య వర్షమేఘ
మైన వాడు మా పెన్నిధి యైనవాడు
భక్తజనపాలుడౌ చక్రి వచ్చుచుండె

03/28/2019 - 19:12

సీ. అల్లబృందావనిన్ వల్లవీ జనులకు
ఆలంబనంబులై అమరెనెవ్వి
సౌవర్ణమయములై సద్రత్నయుతములౌ
అంగదంబులతో నడరునెవ్వి
క్రౌర్య స్వరూపుడౌ కంసుని గూల్చిన
వితత మసాబలయుతము లెవ్వి
గోవర్ధనము నెత్తి గోపాలకులగాచు
వేళ, పంకంబుతో వెలసెనెవ్వి?
తే.గీ. కులయాపీడనంబును దివికి బంపు
తరిని, మదజలంబులతోడ తడిసెనెవ్వి
అట్టిసుశ్యామలాంగుని అతులమైన

Pages