S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

03/23/2017 - 01:20

మాటల్లేవ్.. మాట్లాడుకోవడాల్లేవ్.. మెసేజ్ పంపడం.. షేర్ చేసుకోవడమే. ప్రస్తుతం వాట్సాప్ హంగామా ఇదీ.. సాంకేతిక విప్లవం పరుగులు తీస్తున్న నేపథ్యంలో వాట్సాప్ వినియోగం ఎక్కువైంది. చేతిలో సెల్‌ఫోన్ పట్టుకుని చిటికెలో అద్భుత దృశ్యాలను, కీలక సమాచారాన్ని, చక్కటి సందేశాలను, ఆకట్టుకునే వీడియోలను షేర్ చేసుకుంటూ ఇలా అనేక రకాలుగా యువత వాట్సాప్‌కు హ్యాట్సాప్ చెబుతున్నారు.

03/23/2017 - 01:21

ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్‌లో వైశాలి ప్రాంతంలో ఒక సెంట్రల్ పార్కు వుంది. ఐతే, దానికి ఆలనా పాలనా లేక కునారిల్లిపోతోంది. చిన్ని చిన్ని పాపలు దీని దీవస్థను చూడలేక, దానిని దత్తత తీసుకున్నారు. రోజూ రెండు గంటలపాటు రుూ పార్కులోకి పోయి- మొక్కలు నాటుతూ, వాటికి సంరక్షణ చేస్తూ, పచ్చిక మెత్తల్ని పరుస్తూ- శ్రమదానం చేస్తున్నారు. ఎవరు వేసిన మొక్కకి వాళ్లే సంరక్షణ చెయ్యాలి.

03/23/2017 - 01:21

పంజాబ్‌లోని లూథియానా జిల్లాకి చెందిన కాటాన్ గ్రామ రైతు- సంపూర్ణ సింగ్‌కు ఉత్తర రైల్వే వారు ఇవ్వాల్సిన భూపరిహారం సొమ్మును ఇవ్వలేదు. 2007లో అతని గ్రామంలో వున్న భూముల్ని తీసేసుకున్నారు గానీ ఎకరాకి 25 లక్షల రూపాయల వంతున ఇవ్వాల్సిన పరిహారం ఇవ్వనే లేదు.

03/17/2017 - 21:42

వేసవి వచ్చేసింది. దొంగలు విజృంభించే కాలమిది. వేసవి ఉక్కబోతతో ప్రజలు డాబాలపైన, ఆరుబయట నిద్ర కు ఉపక్రమిస్తుంటారు. సెలవులని పలు కుటుంబాలు సొంతూళ్ళు, విహార యాత్రలకు వెళుతుంటాయ. గుట్టుచప్పుడు కాకుండా చోరులు అందినకాడికి దోచుకువెళ్ళే ప్రమాదం ఉంది. వీటిని నియంత్రించాలంటే కెమెరా కన్ను ఉండాల్సిందే. చోరీ జరిగితే ఆధారాలు ఇచ్చే వ్యవస్థే ఈ నిఘానేత్రం.

03/16/2017 - 22:04

పిల్లలు చిచ్చర పిడుగుల్లా చురుగ్గా ఉన్నారంటే వారిలో శారీరక మార్పులు చక్కగా ఉన్నట్లేనని అంటున్నారు అమెరికా పరిశోధకులు. సరైన వ్యాయామం, ఆటలు వారిలో వయసుకు తగ్గ ఎదుగుదలకు కారణమవుతాయని వారంటున్నారు. మగపిల్లలు టివీ, స్మార్ట్ ఫోన్లకు అతుక్కుపోకుండా చక్కగా ఆడుకుంటే వారు ఎప్పటికప్పుడు మెరుగైన రీతిలో ఎదుగుతారని చెబుతున్నారు.

03/16/2017 - 21:56

పురిటి నొప్పుల బాధ మాటల్లో వర్ణించలేని వేదన. అలాంటి బాధను సైతం పంటి బిగువున ఓర్చుకునే తల్లులు పండంటి బిడ్డను పొత్తిళ్లలో చూసుకోగానే మురిసిపోతూ అంతకుముందు పడిన బాధనంతా మర్చిపోతారు. కాని దురదృష్టవశాత్తు ప్రసవవేదన సందర్భంగా భావోద్వేగాలు వెల్లువెత్తి తల్లుల మెదడపై తీవ్ర ప్రభావం చూపుతాయని కెనడాలో జరిగిన తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఈ సమయంలో వారికి తాజా పండ్ల రసాలు ఇవ్వమని చెబుతున్నారు.

03/16/2017 - 21:54

భూమికకు రచనలు
పంపాలనుకునే వారు
రచనలను
ఈ మెయిల్‌లో స్కాన్ లేదా
పిడిఎఫ్ ఫార్మాట్‌లో
bhoomika@andhrabhoomi.netకు
మెయల్ చేయవచ్చు.
లేదాఈకింది చిరునామాకు పంపగలరు.
మా చిరునామా :
ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్
సికిందరాబాద్- 03

03/15/2017 - 21:13

దెయ్యాల నమ్మకం, భయం- రెండూ మన దేశంలోనే కాదు- పాశ్చాత్య దేశాలలోనూ, యితర దేశాలలలోనూ కూడా అమితమే! బ్రెజిల్‌లో కొత్తగా అధ్యక్షుడైన శ్రీ మైఖేల్ టెమెర్‌గారు గృహప్రవేశం చేసిన పది రోజుల్లో యిల్లు వదిలిపెట్టి- సకుటుంబంగా పరుగులు తీశాడు. మైఖేల్‌గారు తాత్కాలిక అధ్యక్షుని హోదాలో అల్వోరాడో పేలెస్‌లో సంబరంగా ప్రవేశం చేశాడు. కానీ, ఆ రాత్రినుంచే నిద్ర పట్టక, భార్యాభర్తలు అల్లాడిపోయారు.

03/14/2017 - 21:33

సింధూ,బిందూ కూర్చొని గుసగుసలాడుకుంటున్నారు. ఆ ఇద్దరూ అంత రహస్యంగా ఏమి మాట్లాడుకుంటున్నారో విందామని సింధూ తల్లి పనిచేసుకుంటునే ఓ చెవి వారి మాటలపై వేసింది. టీవీ లో వచ్చిన సినిమాలోని కొన్ని శృంగార సన్నివేశాల గురించి ఎవరికీ వినపడకుండా మాట్లాడుకుంటున్నారు. ఏయ్! ఏమిటా మాటలు? మీరు చిన్న పిల్లలు అలాంటి మాటలు మాట్లాడుకోకూడదు అని కసిరి వారిని అక్కడ నుంచి పంపించివేసింది.

03/11/2017 - 22:28

ఆత్మీయానురాగాలను
రంగుల్లో రంగరించి
హోలీ అంటూ...
ముఖచిత్రంపై
కారికేచర్...
శిశిరమున ఆకురాలి
కామదహనమై...
వసంతాగమన ప్రాభవాన
తరువులు కొత్త చిగురులు తొడగి
ప్రేమ చిగురించి
వసంతోత్సవమై...
ప్రకృతి సత్కారమై
అడవి అంతటా
గోగుపూల అరుణ కాంతులైన
ఆకుపచ్చని పండుగ...
పొద్దుతిరుగుడు పూలు (కర్షకలోకం)

Pages