S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

02/17/2017 - 22:33

నేనెక్కడ లావెక్కాను అని అంటుంది తల్లయిన కరీనాకపూర్. కొంతమంది నేను లావెక్కాను అని ఎందుకు అంటున్నారు అని ఈ అందమైన అమ్మ ప్రశ్నిస్తుంది. డిసెంబర్‌లో మగబిడ్డకు జన్మనిచ్చిన కరీనా ప్రముఖ డైటీషియన్ రుజుత దివేకర్ సలహాలతో స్లిమ్‌గా తయారయ్యాయని చెబుతుంది. నా కొడుకు ఏడిస్తే చాలు చేతుల్లో ఎత్తుకుని ఇల్లంతా తిరుగుతాను. అలా తిప్పితేనే ఏడుపు ఆపి ఊరుకుంటాడట.

02/17/2017 - 22:30

కొప్పున్నమ్మ ఎన్ని సోకులైనా పోతుంది...అనే మాటని నిజం చేస్తూ ఈ ముద్దుగుమ్మలు తమ శిరోజాలతో చూడ చక్కని జంతు ఆకృతులతో తీర్చిదిద్దారు. స్టైల్స్‌లో తమ స్టైల్ వేరయా(మ్మా) అన్నట్లు కుక్క, నక్క, గుర్రం, గేదె, ఏనుగు, జింక, ఖడ్గమృగం, మేషం తదితర జీవాకృతులను నెత్తిన పెట్టుకుని చూసేవాళ్లని అవాక్కయ్యాలా చేస్తున్నారు. వైవిధ్యభరితమైన హెయిర్ స్టైల్స్‌తో షోలలో ఆకట్టుకుంటున్నారు.

02/17/2017 - 22:24

గింజ ధాన్యాలలో మినుములకు ఎంతో ప్రాముఖ్య ఉంది. మినుములలో పోషక పదార్థాలు లభిస్తాయి. వీటితో ఎన్నో రకాలైన తీపి, కారం పిండి వంటలను తయారుచేస్తారు. దేహారోగ్యానికి ఇవి ఎంతగానో తోడ్పడతాయి. ఇవి అనారోగ్యాల నివారణకు ఔషధంలా పనిచేస్తాయి. వీటిని పిండి పట్టించి అప్పడాలు తయారుచేస్తారు. వీటిని నానేసి రుబ్బి, రకరకాలైన వడియాలను వేసవిలో తయారుచేసి ఎండబెట్టి గలగలా ఎండిన తర్వాత డబ్బాల్లో నిలవ ఉంచుకుంటారు.

02/16/2017 - 23:49

కప్పు పుట్టగొడుగుల్లో మాంసంలో లభించే పోషకాలన్నీ ఉంటాయి. వీటిని తీసుకోవడంవల్ల శరీరానికి విటమిన్ డి అధికంగా లభిస్తుంది. వీటిలోని పోషకాలు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. వీటిల్లో వుండే విటమిన్ బి, రైబోప్లైవిన్, నియాసిన్ వంటి నాడీ వ్యవస్థకు మేలు చేస్తాయి. రైబోప్లేవిన్ ఎర్ర రక్తకణాల వృద్ధికి తోడ్పడుతుంది. నియాసిన్ చర్మ సమస్యలను దూరం చేస్తుం ది. జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది.

02/16/2017 - 23:47

ప్యారిస్‌లో ప్రముఖ మ్యాగజైన్ వోగ్ మార్చి ఎడిషన్ కవర్ పేజీపై ఓ ట్రాన్సజెండర్ మోడల్ ఫొటోను ప్రచురించింది. బ్రెజిల్‌కు చెందిన సాంపియో మోడల్ రంగంలో రాణిస్తోంది. ప్యారిస్‌లో పేరొందిన వోగ్‌మ్యాగజైన్ సాంపియో ఫొటోను ప్రచురించటం వల్ల తొలిసారి ట్రాన్సజెండర్ ఫొటోను ప్రచురించిన పత్రికగా పేరు గడించింది.

02/15/2017 - 21:07

చైనా తూర్పు ప్రాంత రాష్ట్రం ఫ్యుజియన్ రాష్ట్రంలో ‘యూక్సీ’ గ్రామంలో ఒక గొప్ప చిత్రమయిన సాంప్రదాయముంది. ఈ ఫిబ్రవరి 10, 11 తేదీలలో కోలాహలంగా జరిగిన ఒక ఉత్సవంలో బుద్ధ భగవానుణ్ని (విగ్రహం) గ్రామీణులు కసితీరా, కొరడాలతో చితకబాదారు. అలా చేస్తే తప్ప బుద్ధుడు కనికరించడు. వారికి ‘వరదల’నుంచి రక్షణ యిచ్చి, మంచి పంటలు పండే వరం ప్రసాదిస్తాడుట!

02/15/2017 - 21:06

అత్తారింటి కి పోతూనే యింటి పేరు మారిపోయే సంప్రదాయమున్నచోట- డిగ్రీలో పుట్టింటి పేరే వున్నందున చాలామంది విద్యావంతులు డబుల్ యింటిపేర్లను సందర్భోచితంగా వాడుకుంటూండటం గమనించే వుంటారు గానీ ఇంటి వీధి తలుపుమీద ఆడపిల్ల పేరు పెట్టడం యించుమించుగా ఎక్కడా లేదు.

02/15/2017 - 21:05

ఆరో నెల గర్భవతి అయిన లారేన్ బోల్ట్- ‘వేల్స్’ రాజధాని అయిన కార్డ్ఫి నగర మెయిన్ స్టేషన్ నుంచి రోజూ తన ఉద్యోగానికి వెళ్లి వస్తూంటుంది. పుట్టబోయే శిశువుకోసం పైసా, పైసా కూడబెడుతూంటుంది. అటువంటిది, ఆ రోజు ప్లాట్‌ఫామ్‌మీదున్న టికెట్ మెషీన్ మొరాయించింది. రైలు కదిలే ముందు యింక గత్యంతరం లేక రైలెక్కేసింది. రెండు పౌండ్ల మూడు సెంట్‌ల టిక్కెట్. రైలెక్కేక కండక్టర్ దగ్గర కొందామనుకుంది.

02/15/2017 - 21:03

మనకి పదోక్లాసు దాకా బోర్డు పరీక్షలు లేవు. క్రింది క్లాసులో డిటెన్షన్లు లేవుగానీ వెనుకబడ్డ రాష్ట్రంగా పేరుబడ్డ రాజస్థాన్‌లో రుూ ఏడాది మార్చినుంచీ ప్రాథమిక విద్యాబోర్డువారు రాష్ట్ర స్థాయిలో ఒకే మాదిరి పేపర్లతో పరీక్షలు నిర్వహిస్తున్నారు- అలా అని రాష్ట్ర విద్యా మంత్రి ఉవాచ.

02/14/2017 - 22:58

ప్రపంచీకరణ నేపథ్యంలో భారతగడ్డపై విదేశీయ వస్తువులు ఎన్నో వాలుతున్నాయ. స్వదేశీ వస్తువుల ముందు అవన్నీ దిగదుడుపేనని నిరూపిస్తున్నారు మదనపల్లికు చెందిన బి.లలిత, విశాఖలోని జ్ఞానాపురానికి చెందిన దూబ రాజు. సహజ వనరులనే ముడిసరుకుగా ఎంచుకుని, మార్కెట్లో పోటీని తట్టుకుని ముందుకు సాగు తున్నారు.

Pages