S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

08/25/2016 - 21:45

దేశాభివృద్ధి అనే యజ్ఞానికి తాను కూడా ఒక సమిధను అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు అహుజ అక్షయ్. స్వతహాగా ఇంజనీర్ అయిన 23 సంవత్సరాల అక్షయ్ మురికివాడలలోని పిల్లలు తగిన సామర్థ్యం కలిగి ఉన్నప్పటికీ, సరైన శిక్షణ లేకపోవడంవలన వారు కూలీ పనులకే పరిమితం అవుతున్నారు.

08/24/2016 - 21:21

మనిషి దోనే చంపలేడు- ఎలుకని మూషికాసురుడు అంటారు కొంతమంది- యింక దానే్నం చంపుతాడు? కానీ- లక్నోలో, రెండో స్టేషన్ అయిన ‘చార్‌బాగ్’ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫామ్‌ని, పాసింజర్ల సామాన్లని, డాక్యుమెంట్లనీ ఒకటేమిటి? అన్నింటినీ సర్వభక్షకులై తినేసి- లక్షల్లో కాదు కోట్లల్లో నష్టం తీసుకొస్తున్నాయి ఎలుకలు. క్లోక్‌రూమ్‌లో లగేజీ పెడితే- ‘గాయబ్’.

08/24/2016 - 21:20

ఫోన్ అయినా, సెల్ అయినా ట్యాబ్‌ఐనా, ఫ్యాబ్ ఐనా, ఎంక్వయిరీ కార్యాలయమైనా, ఏమంటాం? మొట్టమొదట? ‘హలోవ్!’ అంటాం. అసలీ ‘హలో’ ఎప్పుడు పుట్టింది? దీన్ని కనిపెట్టిందెవరు? అదో గాథ!
‘్ఫన్’ అనగా ‘క్రింఖెంల్’ లేదా ‘బుల్లిపెట్టెలో బూచాడు’- మనం ఎత్తుకోంగానే ‘హలోవ్!’ అంటుంది. మనమూ అంతే ‘హలో’ అంటాం తిరిగి.

08/24/2016 - 21:19

పడతికి పంతం రావాలేగానీ, బ్రహ్మరుద్రాదులు కూడా ఆమెను ఆపలేరు. నిండు చూలాలుగానే బీహార్‌కు చెందిన ముజఫ్ఫర్‌పూర్ వాస్తవ్యురాలు శ్రీమతి రంజుకుమారి బిరుూ్యడీ పరీక్షరాసి తీరాలనుకుంది. గానీ పరీక్షనాడు ప్రొద్దునే్న (13వ తేదీ) పరీక్ష హాలుకు బయలుదేరే ప్రయత్నంలో వుండగానే నొప్పులొచ్చాయి. ప్రయివేటు ఆసుపత్రికి పట్టుకుపోయారు కుటుంబ సభ్యులు. పండంటి బిడ్డను కన్నది. అది ఆమెకు రెండో బిడ్డ.

08/20/2016 - 22:25

ఓసారి ఓ ఫనె్నండేళ్ళ పిల్లాడ్ని వాళ్లమ్మ తీసుకొచ్చింది. స్కూల్‌లో తన స్నేహితులతో జరిగిన కొట్లాటలో అతని ముందు పన్ను సగం విరిగింది. ‘‘ఎంత ఖర్చయినా పర్వాలేదు, మంచి చికిత్స చెయ్యండని’’ కోరింది. ఆ పిల్లవాడికి రూట్ కెనాల్ చేసి చాలా ఖరీదైన కృత్రిమ పన్నుని తొడిగాం. వారం కాకుండానే మళ్లీ ఆ పిల్లవాడ్ని పట్టుకొని ఆ తల్లి వచ్చింది.

08/18/2016 - 21:54

ఉల్లిపాయ వంటింట్లో ఉండవలసిన ముఖ్యమైన వంటక సాధనం.
ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు.
ఉల్లిపాయలో విటమిన్లు, ఖనిజాలు అధికంగా వున్నాయి.
ఉల్లిపాయ జీర్ణ వ్యవస్థను, రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది.
క్యాన్సర్ రాకుండా కాపాడే గుణం ఉల్లిపాయలో వుంది.
షుగర్, బి.పి. తగ్గుదలకు ఎంతో ఉపయోగపడుతుంది.
ఆస్తమా లక్షణాలను తగ్గించే గుణం ఉల్లిలో వుంది.

08/17/2016 - 23:50

న్యూఢిల్లీలో స్వాతంత్య్ర దినోత్సవంనాడు- చారిత్రాత్మక ప్రదేశాల దగ్గర- సందర్శనీయ స్థలాలలోను ‘‘సెల్ఫీలు తీసుకుంటే కేసుపెడతామని హెచ్చరించారు గానీ, అహ్మదాబాద్ స్టేషన్లో, ఏరోజయినా ‘‘సెల్ఫీ’’ ఊసెత్తితే- వెంటనే తీసుకుపోయి ‘‘మూసేస్తా’’మంటూ ఉత్తర్వులు జారీచేశారు.

08/15/2016 - 03:36

భారతదేశ 70వ స్వాతం త్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐక్యరాజ్య సమితి కర్నాటక సంగీత మహారాజ్ఞి దివంగత ఎంఎస్ సుబ్బులక్ష్మి గౌరవార్థం ప్రత్యేక స్టాంపును విడుదల చేస్తోంది. ఈ ఏడాది ఐరాసలో భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలతో పాటు ఆమె శతజయంతి ఉత్సవాలను కూడా నిర్వహిస్తున్నారు.

08/14/2016 - 22:48

ప్రజల్లో ఐక్యతను పెంపొందించడమే లక్ష్యంగా 70వ స్వాతంత్య్ర దిన వేడుకల వేళ దేశవ్యాప్తంగా ‘తిరంగా యాత్ర’ చేపట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ బిజెపి శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ నెల 9 నుంచి 23 వరకూ నిర్వహిస్తున్న తిరంగా యాత్ర సందర్భంగా నాలుగు భాషల్లో నేపథ్యగీతాన్ని ఆవిష్కరించారు.

08/14/2016 - 22:46

సూర్యుని కోమల కిరణాలు భూమిని తాకిన వేళ
అణువణువూ ఓంకార ధ్వని !
ధిక్కారాల నుండి విముక్తి పొందిన
శోభాయమైన దివ్యకాంతిలో
స్వేచ్ఛా విద్యుల్లత మెరిసి నాట్యమాడే తరుణంలో
శాంతి సందేశం వందేమాతరం!

గడచిపోయిన గతకాలపు గాయాలు
గంగా ప్రవాహ శీతల జల స్పర్శలో పునీతమైనట్లు
ప్రతిధ్వనిస్తున్న జయకేతనాల మధుర ధ్వనుల మధ్య
కొన్ని స్మృతులను మరచిపోవడంలోనే సుఖం ఉంది

Pages