S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

02/05/2020 - 22:11

భక్త జన సందోహంతో..
అడవి పల్లె విరిసేను

వనదేవతల కొలుపుతో
మేడారం మురిసెను

జమిడిక డప్పు మోతతో..
చిలకల గుట్ట పరవశించేను

పసుపు కుంకుమార్చనతో
కనె్నపల్లి ముక్తి కాంతులీనేను
జన స్నానాలు, తలనీలాలతో..
జంపన్న వాగు ఎద ఉప్పొంగేను

బెల్లం బంగరు రాశితో..
తల్లి గద్దె తడిసి ముద్దయ్యేను

02/03/2020 - 23:15

ఆహార విషయంలో సరైన అవగాహన, శ్రద్ధ లేకపోవడం వల్ల, ప్రకృతి వైపరిత్యాల వల్ల అనారోగ్యానికి గురికావడం జరుగుతుంది. అనారోగ్యానికి ప్రధానమైన కారణం మలబద్ధకం. జీర్ణక్రియ సరిగ్గా జరగకపోవడం వల్ల రకరకాల వ్యాధులు వస్తాయి. కాబట్టి సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకుంటే మలబద్ధకం నుండి తప్పించుకోవచ్చు.

02/02/2020 - 23:35

ఎముకలు బలంగా ఉండాలంటే వాటికి విటమిన్ డి, క్యాల్షియం అందాలి. ఎముకల ఆరోగ్యం కోసం గ్లాసుడు పాలు రోజూ తీసుకుంటే తగిన క్యాల్షియం లభిస్తుంది. అలాగే తాజా పండ్ల రసాలను తీసుకోవటం ద్వారా విటమిన్ ‘డి’ లభిస్తుంది.
*కూరగాయలు, రోజువారీగా తాజా కూరగాయలు తీసుకోవడం ద్వారా ఎముకలకు చాలా మంచిది. బీట్‌రూట్, క్యారెట్, బీన్స్, స్వీట్ పొటాటోస్, దోసకాయ వంటివి తీసుకుంటే ఎముకలకు కావల్సిన ‘ఎ’విటమిన్ లభిస్తుంది.

01/29/2020 - 23:07

అవును.. తరం మారుతోంది. తరాలు మారుతున్నకొద్దీ వారి ఆలోచనా ధోరణులు మారుతున్నాయి. విపరీత బుద్ధులు పొడసూపుతున్నాయి.
ఎంతసేపు వాళ్ళవైపు గురించి ఆలోచిస్తున్నారు తప్ప, ఎదుటివారి బాగోగుల గురించి ఆలోచించటంలేదు. కనీసం వారి కుటుంబ సభ్యులతో కూడా సఖ్యతగా మెలగడంలేదు.
చిన్నప్పట్నుంచీ ఏదో ద్వేషభావాన్ని అలవర్చకుంటున్నారు. ఇతరులకు పెడితే తాము నష్టపోతామనే భావనను పెంపొందించుకుంటున్నారు.

01/29/2020 - 23:01

* చుండ్రు నివారణకు తరచూ షాంపుతో తలస్నానం చేయాలి. షాంపూ పూర్తిగా వదిలేవరకూ మంచినీటితో శిరోజాలను శుభ్రపరచుకోవాలి. షాంపూ పూర్తిగా వదలకపోతే చుండ్రు సమస్య కొనసాగుతుంది.
* కోడిగుడ్డులోని తెల్లటి సొనలో కాసిన్ని నీళ్లుపోసి జుట్టు కుదుళ్లకు బాగా పట్టించి, కాసేపయ్యాక మంచినీళ్లతో స్నానం చేయాలి.
* జుట్టు తడిగా ఉంటే చుండ్రు సమస్య అధికంగా ఉంటుంది. జుట్టు పూర్తిగా ఆరాక నూనె రాస్తే మంచిది.

01/29/2020 - 23:10

అరటిపండ్లను, అరటికాయ, దూటలతో చేసే కూరలను ఇష్టపడనివారు అరుదుగా ఉంటారు. అరటిపండు అజీర్ణానికే కాదు చర్మం సొగసును పెంచటానికి దోహదం చేస్తుంది. వయసును కనబడనీయకుండా, వన శోభతో చర్మాన్ని వెరిపింపజేసే గుణం అరటికి సొంతం అని వేరే చెప్పనవసరం లేదు.

01/28/2020 - 23:00

అరటి పండు తింటే కమ్మగా ఉంటుంది. ఆ పండు వచ్చే పువ్వులో కూడా ఎన్నో ఔషధగుణాలు ఉన్నాయి. అరటి పువ్వులో అరోగ్యకర ప్రయోజనాలు ఎన్నో దాగివున్నాయి. అరటి పంట దక్షణ-తూర్పు ఆసియాలో అధికంగా పండిస్తారు. ఉదా రంగులో కనిపించే అరటి పువ్వుతో ఉత్తర అమెరికావాసులు కమ్మనైనా వంటలే చేసుకుంటారు. దీనిలో ఫైబర్, ప్రోటీన్లు, పొటాషియం, విటమిన్స్ ఎ,సి,ఇ,కె పుష్కలంగా ఉన్నాయి.

01/28/2020 - 22:58

ఆధునిక జీవనంలో కుంకుడు కాయలతో తలస్నానం చేసేవారిని వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. యాంత్రిక జీవనంలో అన్నీ యంత్రాలతో తయారుచేసిన వస్తువులనే వాడుతున్నాం. ప్రకృతి సిద్ధంగా లభించే కుంకుడు కాయలు వాడేవారు గంటలు సేపు చేయలేమని వాటి జోలికి వెళ్లటం లేదు. కుంకుడు కాయలు నానాబెట్టి, వాటి రసంతో రుద్దుకోవటం అంటే కనీసం గంటసేపు వెచ్చించాల్సిన పరిస్థితి.

01/27/2020 - 22:59

అమ్మతనం అనేది ఆడవారికి దేవుడిచ్చిన వరంగానే చెప్పాలి. అమ్మనవ్వాలని ప్రతి స్ర్తి తహతహలాడుతోంది. గర్భవతి అయినప్పటి నుంచి కంటికి రెప్పలా కాపాడుకోవటానికి ప్రయత్నించినపుడే కాలచక్ర భ్రమణం సజావుగా సాగుతోంది.

01/23/2020 - 23:11

విటమిన్లు, ఐరన్, ఇతర ఖనిజ లవణాలు అధికంగా ఉండే కొత్తిమీరను ఆహార పదార్థాల్లో నిత్యం ఉపయోగించడం మంచిది. వంటలపై అలంకరణ కోసమని భావించకుండా కొత్తిమీరను తరచూ వాడితే రక్తహీనత, కొవ్వు వంటివి శరీరంలో తగ్గుతాయి. రక్తనాళాల్లో సమస్యలను తొలగించడంలో సాయపడుతుంది.

Pages