S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

09/25/2018 - 18:53

చాలామంది భోజనప్రియులు తమకు నచ్చిన ఆహారం కనిపిస్తే చాలు లొట్టలేసుకుని లాగించేస్తుంటారు. ముఖ్యంగా కాంబినేషన్ ఆహారం.. అంటే ముద్దపప్పు - ఆవకాయ, పప్పుచారు - వడియాలు, కోడికూర - గారెలు.. ఇలా అన్నమాట. తమకు నచ్చిన కాంబినేషన్ లేకపోతే ముద్ద దిగడం కష్టం చాలామందికి.. అయితే కొన్ని కాంబినేషన్‌లు ఎంత రుచిగా ఉంటాయో.. అంతే ప్రమాదకరం కూడా..

09/23/2018 - 23:29

మారిన జీవనశైలి వల్ల రాత్రిపూట చాలా ఆలస్యంగా తినడం పరిపాటైపోయింది. పోషకాహార నిపుణులు, వైద్యులు చెప్పేదాని ప్రకారం నిద్రపోయే ముందు రెండు గంటల గ్యాప్‌తో ఆహారం తీసుకోవాలి. నిద్రపోయే ముందు ఆహారం తింటే.. అంటే తిన్న వెంటనే నిద్రపోతే.. అదీ ఎక్కువ మోతాదులో ఆహారం తీసుకుంటే రక్తంలో చక్కెర శాతం పెరిగేందుకు ఎక్కువ ఆస్కారం ఉంటుంది. దీనితో పాటు కొవ్వు పదార్థాలు కూడా పెరిగి గుండె సమస్యలు వస్తాయి.

09/21/2018 - 20:16

సముద్ర తీరంలో ఉప్పుగాలి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నా ఆమె డీలా పడలేదు.. ‘లక్ష్యం’పైనే గురిపెట్టి మెరుపు వేగంతో దూసుకుపోయి అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.. ‘స్పీడ్ సైక్లింగ్’లో ఆమె సాధించిన ఘనత అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. గంటకు 183 మైళ్ల వేగంతో సైకిల్‌పై దూసుకుపోయి, 23 ఏళ్ల నాటి రికార్డును ఆమె ‘బ్రేక్’ చేసింది.

09/20/2018 - 18:51

నేటి తరం అమ్మాయిలు రోజూ పంజాబీ డ్రస్, కుర్తీ- లెగ్గిన్, చుడీదార్ వంటి రొటీన్ డ్రస్సులనే వేసుకోవడానికి మొగ్గుచూపరు. అలాగని మధ్యతరగతి అమ్మాయిలు వెస్ట్రన్ డ్రస్సుల జోలికి పోరు. మరి అలాంటి అమ్మాయిలు రోజూ కాలేజీలకు, చిన్న చిన్న పార్టీలకు కుర్తీతోనే స్టైలిష్‌గా, అందంగా కనిపించవచ్చు. మామూలుగా మార్కెట్లో మంచి మంచి కుర్తీలు దొరుకుతున్నాయి. వీటికి మిక్స్ అండ్ మ్యాచింగ్‌గా లెగ్గిన్స్, చుడీ..

09/19/2018 - 19:45

ప్రపంచాన్ని సముద్రయానంతో చుట్టివచ్చిన ధీరవనితల గురించి తెలిసిందే.. ఇప్పుడు ‘ఐఎన్‌ఎస్వీ తరిణి’ని అత్యంత ప్రతిష్ఠాత్మక ‘టెన్సింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డు’ వరించింది. ఆకాశం, భూమి, సముద్రాలలో గొప్ప సాహస కృత్యాలు చేసినవారికి గుర్తింపుగా ఈ అవార్డును ఇస్తారు.

09/19/2018 - 19:43

మనిషితనం చచ్చిపోయింది
కడుపు చించుకు పుట్టిన బిడ్డ
పురిట్లో చచ్చినా బాగుండేది

పాతికేళ్ల వయసుని కత్తికి బలిచ్చి
పరువుదాహం తీర్చుకున్నారు

రంగేది అయినా రక్తం ఒక్కటే
అమ్మ కడుపు నుంచి శ్మశానం దాకా
కులం కావళ్లు మోస్తూ మీకు మీరు
ఆత్మ వంచన చేసుకుంటారు

పసిపిల్లల ప్రేమకి కులం కుంపటి
వందేళ్ల ప్రయాణానికి చరమగీతం పాడింది

09/18/2018 - 19:21

సమయం చాలా విలువైనది. అందరికీ రోజుకు 24 గంటలే. కొంతమంది రోజుకు లక్షలు సంపాదిస్తుంటే మరికొంతమంది ఒక పూట గడవడానికి నానా తిప్పలు పడుతుంటారు. మరికొందరు నిద్రే లోకంగా రాత్రే కాక పగలు కూడా నిద్రపోతుంటారు. మరికొందరు ఇంట్లో పనితోపాటు స్వయం ఉపాధిమార్గాలను కూడా తమవైపుకు తిప్పుకుంటూ ఉంటారు.

09/18/2018 - 19:17

నా జీవిత పుస్తకంలో
ఎన్నో పేజీలు కదిలిపోయాయి
ఆ జ్ఞాపకాల హోరుగాలులలో
ఒక చేదు జ్ఞాపకం మా నాన్న
అతనికేమీ పనీపాట లేక
అమ్మని హింసిస్తూ ఉండేవాడు
తిట్లరూపంలోనో, తన్నుల రూపంలోనో
అమ్మ ఉద్యోగం చేసి
తెచ్చిన డబ్బులను తాగి తగలేసేవాడు నాన్న
అప్పుడప్పుడు
అమ్మ వెక్కివెక్కి ఏడ్చే ఏడుపులు
నాకింకా జ్ఞాపకమే!

09/18/2018 - 19:15

మెరుపు చినుకు తోడైతే
చిగురు పుట్టినట్లు...
చూపు చూపు కలిస్తే
ప్రేమ మొగ్గ తొడుగుతుంది!
మనసు మనసు కలిస్తే
పుష్పమై
ఆనందపు సుగంధాలను వెదజల్లుతుంది
ప్రేమంటే
ఇరుగుండెల యుగళగీతం!
హృదయపు లోతుల్లోంచి
వినిపించే మధుర రాగం!
త్యాగంతో పునాదులు పడితేనేం ?
విశ్వాసం లేనిది
ప్రేమ భవంతి నిలబడదు!
తెలిసీ తెలియని వయసులో

09/17/2018 - 19:47

కులానికి పుట్టిన దురహంకారమా...
మనువు ఇచ్చిన అంతరాన్ని ఇంకించుకుని
మానవత్వానికి మచ్చగా మిగిలావ్

మతమిచ్చిన ఉ‘న్మదం’తో
డబ్బిచ్చిన పరువు కత్తితో
రక్త ప్రవాహాల్లో కొట్టుకుపోతున్నావ్

సమాజమిచ్చిన హోదాకోసం
కన్నబిడ్డ కలల్ని ఒక్క వేటుకి మట్టుబెట్టిన నీవైనా ఆరడుగుల జాగాలోనే అంతమవుతావ్

Pages