S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

07/16/2018 - 19:21

నిజాన్ని నిలువునా చీల్చి
అబద్దాలతో అడ్డంగా
అతికే నికృష్టులకు
నీరాజనమా ...
మంత్రాలకు మాయలకు తాయెత్తులకు
బురిడీ బాబాల ఎత్తులకు
ఇంకా బలమా?
నాగరికత పెరిగిందని
అందరికీ విద్య అందుతోందని
సంబరమా అది ఎక్కడ?
స్ర్తిలపై అరాచకాలకు
అడ్డుకట్ట వేసేదెవరు?
వృద్ధులపై, బాలలపై కూడా అఘాయిత్యాలకు
ఒడికట్టే వారిని కట్టడి చేసేవారెవరు?

07/13/2018 - 19:52

నేటి కాలంలో విద్య ఒక వ్యాపారంగా మారింది అనేవారు ఎక్కువ. ఇది నిజమే కావచ్చు. కాని, ఈ విద్యారంగంలో చదువుకున్న నేటి యువత చదువుకునేటపుడే ఏ చదువు చదివితే ఏ ఉద్యోగం చేయవచ్చో ముందుగానే తెలుసుకుని మరీ చదువుకుంటున్నారు. కాని ఇది జీవితం. అనుకొన్నట్టుగా అన్నీ జరగవు.

07/12/2018 - 20:05

నవ్వు...
మన అంతరంగంలో ఉరకలు వేసే
ఆనందానికి ప్రతిబింబం!
పెదాలనే వేదికగా మలుచుకుని
అందంగా నర్తిస్తూ
అందరినీ అలరించేందుకు
తళుక్కున మెరిసే ఓ కాంతి పుంజం !
హృదయంలోని
మధురానుభూతులను కలబోసుకుని
కనువిందు చేయ..
వదనమనే పూదోటలో విరబూసే
ఓ సుందర సుమం !
వెనె్నల వోలె
వెలుగులు విరజిమ్ముతూ..
ముఖానికి నిండు శోభను కూర్చే

07/12/2018 - 20:08

ఇంటిని, ఇంట్లో వారిని నేకాదు వీధిని, కాలనీని, అంతేకాదు అసలు ప్రపంచాన్నంతా కాలుష్యరహితం చేయాలంటే ముందుగా మహిళలే పూనుకోవాలి. వారు పూనుకొంటే చాలు ఫలితాలు అద్భుతంగా ఉంటాయి.
ఇంట్లో కావాల్సిన వస్తువులన్నీ కూడా మహిళలే ఎక్కువగా కొంటుంటారు. ఆహారానికి సంబంధించినవో లేక ఇంటి అలంకరణకు సంబంధించినవో లేక ఇంట్లో పనికి వచ్చే ఎలక్ట్రానిక్స్ ఏవో ఒకటి మహిళల ఆధ్వర్యంలోనే కొనడం సాధారణంగా జరుగుతుంటుంది.

07/12/2018 - 20:13

ఆకాశం చిల్లులు పడ్డట్లుగా వర్షం కుండపోతగా కురుస్తూంది
ఈ భూతలమంతా వరదై పొంగిపారుతూ ఉంది
అసలే పాతమిద్దె .. పగుళ్లతో రంథ్రాలుపడి
కారీ కారీ , నాలాగే వృద్ధాప్యంతో కునారిల్లుతోంది
ఏమాటకామాటే చెప్పుకోవాలి
ఈ ఇల్లంటే నాకు ప్రాణం, ఇది మా అమ్మ ప్రేమ కానుక
ఈ ఇల్లే అమ్మ తర్వాత నాకు అమ్మ అయ్యింది
ఇక్కడే తారతమ్యాల విలువలు తెలుసుకున్నాను

07/11/2018 - 20:36

ఎవరో వస్తారని ఏదో చేస్తారని
ఎదురుచూసి మోసపోకుమా
...
అవును మరి.. ఆ ఎవరో ఎవరు?
నువ్వే ఎందుకు కాకూడదు?
ఆ గురజాడ అంశ నీదే
ఆ కందుకూరి ప్రశంస నీదే
ఆ రాజారామమోహన్‌రాయ్ పొగడ్త నీకే
ఈ సమాజంలోని రుగ్మతలను
రూపుమాపేందుకు
జన్మించిన అపర మానవతామూర్తి వి నీవే
కదులు కదంతొక్కు పదం పాడు
ఉరకలెత్తు పరుగులు తీయ్

07/10/2018 - 20:48

కన్నవారని వీ డదోరుూ
మాతృమూర్తి మనతానుబంధం!
ఎక్కడికి పోదోరుూ
ఎదలోని అమ్మదనం!

శ్వాసవిడిచి మేను వదిలి
స్వర్గం చేరినా కన్న బిడ్డల
ఆలనాపాలనా
అదృశ్యరూపంలో
పరిరక్షించునోరుూ

సబ్యత సంస్కారం
సంస్కృతి సంప్రదాయాలని
విస్మరించి నివ్వదోరుూ

పదిమందికి తన సంతానం
మార్గదర్శిని
గావిస్తోందోరుూ

07/09/2018 - 22:27

* మనం తినే ఆహారంలో ముఖ్యంగా కూరగాయలు, పండ్లు, పొట్టుతియ్యని ధాన్యాలు, బీన్స్, ఆకుకూరలు లాంటి వాటిని ఎక్కువగా తీసుకొంటే జీర్ణవ్యవస్థ బాగా ఉంటుంది. మలబద్ధక సమస్యలు రాకుండా నివారించుకోవచ్చు. జలుబు, దగ్గు లాంటి చిన్న చిన్న అనారోగ్యాలు కూడా దరిచేరవు.

07/08/2018 - 22:10

అమ్మే ఒక బాసైనప్పుడు తన కంటి సైగే ఒక
భావమైనప్పుడు ఆమె చిరునవ్వే ఒక అందమైనప్పుడు
తన పెంపకమే ఒక జీవితమైనప్పుడు ... అన్నింటికీ
అమ్మే ఒక పోలికైనప్పుడు.. అమ్మకి వేరే పోలికలెందుకు?
కనిపించని దైవానికి వేరే రూపమెందుకు?

07/06/2018 - 21:09

వినాయకచవితి రోజు అనయ కుటుంబ సభ్యులంతా వినాయకుడికి పత్రితో పూజ చేశారు. మధ్యాహ్నం కుటుంబ సభ్యులంతా భోజనం అయ్యాక టీవీ చూస్తున్నపుడు అనయ అడిగింది.
‘‘అతను ఎవరు? అంతా ఎందుకు ఏడుస్తున్నారు?’’
‘‘అది ఏడుపు కాదు, సంతోషం. అతను సంవత్సరం క్రితం తీర్థయాత్రకు వెళ్లినపుడు తప్పిపోయాడు’’ అనయ తండ్రి చెప్పాడు.

Pages