S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

05/10/2018 - 00:05

కళ్లు చెదిరే కాంతుల్ని వెదజల్లే నవరత్నాలు భారతీయులందరికీ సుపరిచితమే.. వాటికున్న క్రేజ్ కూడా అందఠికీ తెలిసిందే.. వాటితో సమానంగా పోటీపడే సహజాతి రత్నమే ఈ టూర్‌మలీన్. ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోతగినది వాటర్‌మెలన్ టూర్‌మలీన్. చుట్టూ ఆకుపచ్చగా, మధ్యలో ఎర్రగా.. డబుల్ కలర్‌లో అందంగా ముచ్చటగొలుపుతుంది. ఇది టూమరిలీన్ రాళ్లలో ఒకరంగు మాత్రమే.. ఇందులో బోలెడు రంగులు ఉన్నాయి.

05/08/2018 - 23:02

ఆలుగడ్డలను ఉడికించి అందులో కీర, ఉల్లి, పచ్చి మిరప ముక్కలు చేర్చి మెత్తగా చేసి వాటిని బంతుల్లా చేసి వాటిని నాన్ స్టిక్ గుంటపొంగలి మూకుడులో అతి తక్కువ నూనెతో కాలిస్తే మధ్యాహ్నపు స్నాక్ గా పిల్లలు ఇష్టంగా తింటారు. ఈ ఆలు బంతులకు ఎండిపోయన బ్రెడ్‌ని పొడిచేసి, లేకుంటే బిస్కెట్ల పొడిని అద్దితే మరింత రుచిగా ఉంటాయ.

05/07/2018 - 22:47

రోజా హడావుడిగా ఇంట్లోకి బయటకు తిరుగుతోంది.
ఆఫీసు నుంచి ప్రభాకర్ వడివడిగా వచ్చేశాడు.
‘ఏదైనా సంగతి తెలిసిందా’ ఆత్రుతగా అడిగాడు.
‘లేదు. వాడి ఫ్రెండ్స్ అందరినీ అడిగాను. వాడు నాకు చాలా కోపం వచ్చింది. మనమే బుద్ధి చెప్పాల్సిందే ’అని పొంతన లేని మాటలు మాట్లాడాడని కిరణ్ చెప్పాడు.
‘ఎపుడు మాట్లాడాడట. ఎందుకు కోపం వచ్చింది.’ అడిగావా అన్నాడు ప్రభాకర్

05/04/2018 - 22:50

కాలం కొత్తదేం కాదు
కాలానికిమనమే కొత్త !
నీకు నేను నాకు నువ్వూ కొత్తేం కాదు
ఇపుడు కొత్తగా
వింతగా విస్తుపోయేదేం ఉంది
కొత్తగా పలకరింపులకేం ఉంది
గుంపులు గుంపులుగా
పిట్టల్లా వాలిన జ్ఞాపకాలు మోసుకుంటూ
కన్నీటి చారికల దారుల నీడల్లో
మెదలిన క్షణాలు నెమరేసుకుంటూ
సాగిపోయే బాటసారులం మనం
ఎక్కడో మనం కలిసే ఉంటాం

05/01/2018 - 22:21

నిత్య విద్యార్థులు మీరైతే జీవితంలో ఏ అడ్డంకి వచ్చినా మీరే విజేతలుగానే ఉంటారు. జీవితంలో అతి ముఖ్యమైన దశల్లో ఉద్యోగ జీవితం ఒకటి. ఇక్కడ మనం ఎంత అద్భుతంగా రాణిస్తే మన మిగతా జీవితం అంత అద్భుతంగా గడిచిపోతుంది. ఉద్యోగం మనకి సంపాదన ఇచ్చే వనరు మాత్రమే కాదు మనలో వున్న కార్యసాధకునికి పదునుపెట్టి మనకి మాటల్లో చెప్పలేని ఉద్యోగ సంతృప్తిని ఇచ్చేది కూడా.

04/30/2018 - 21:54

* రాత్రి పడుకొనేముందుగా అరచేతులకు, పాదాలకు కొబ్బరినూనెను రాసుకోవడం వల్ల మృదుగా ఉంటాయి.
* కమలాపండు తొక్కలను ఎండబెట్టి వాటిని పొడి చేసి సున్నిపిండిలో కలుపుకొంటే మంచి వాసనతో పాటు సౌందర్యాన్ని పెంచుకోవచ్చు.
* ముఖానికి, చేతులకు పాలమీగడ రాసుకొని బాగా మర్థనా చేస్తే శరీరంపే ఉన్న మలినాలు తొలిగిపోతాయి.

04/29/2018 - 21:15

అమ్మా అమ్మా
విద్యావంతం, యశోవంతం,
లక్ష్మీవంతం భవతు!
అని ఆ ఆదిదేవుని బీజమంత్రాలను
నాచే దిద్దించి,-
‘‘ఓం నమశ్శివాయ-సిద్ధం నమః’ అని
అక్షర చైతన్యాన్ని
నా లక్ష్య సాధనగా చేసి సిద్ధిప్రదం చేసిన
వాగ్దేవతవు!
శూన్య గగనంలో లయమైన అక్షరపర బ్రహ్మాను,
ఆత్మసాక్షాత్కరం పొంది, భూమిపైకి రప్పించి,
భూమండల మంతా అక్షర బీజావాపనం
చేయాలని,

04/26/2018 - 22:53

గోర్లకు రంగు వేసుకోవడం ఒకప్పటి ట్రెండ్. ఈ ఫ్యాషన్ ఠకరకాలుగా మారుతూ గోర్లపై రకరకాల బొమ్మలు, కుందన్లు, రాళ్లు అద్దడం వరకు చేరింది. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి పెదవులకు వేసుకునే రంగులనే గోర్లకు వేయడం అంటే రెండూ మ్యాచ్ అయ్యేలా ఉండటం మొదలయ్యింది. ఇదే నేటి నయా ట్రెండ్. గోర్లపై వేసే రంగులతో పాటు డిజైన్లను కూడా అచ్చుగుద్దినట్లు అలాగే పెదవులపై కూడా వేసేస్తున్నారు బ్యూటీషియన్లు.

04/23/2018 - 21:53

నేను పుట్టిన ఊరు నా మాతృభూమి
చిన్ననాడు వదిలి వచ్చేశాను
మనసు భారం అనిపించలేదు
కన్నీరు రాలేదు
పైగా ఆనందం వేసింది
కొత్తప్రదేశానికి వెళ్లానని
అపుడు మనసు ఎదగలేదు

ఇపుడు
వయసు పెరిగింది
మనసూ ఎదిగింది
సంసారమూ మొదలైంది
ఆకస్మాత్తుగా నా మాతృభూమిని
చూడాలనిపించింది

04/23/2018 - 21:52

దేవుడు నిజంగా బతికుంటే
అక్కడ లేత ఆర్తనాదం సాక్షిగా
గర్భగుడి దూలానికి విగతగా వేలాడేవాడే
మమతల కభేళాలో
మానవతను వెతుక్కుంటూ
కొత్త పిచ్చోడై సంచరించేవాడే

ఒకప్పుడూ .. ఈ దేశం
మృతుల దిబ్బపై మొలచిన అనాగరిక పుష్పం
ఏళ్ళకు ఏళ్లుగా
అదే సన్నివేశం మోసుకుంటూ
పాకుతుందో.. దేకుతుందో...

Pages