S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

03/22/2018 - 20:32

ఒకే సమయంలో ఒకేసారి మహిళ అనేక పనులను చేయగలదు అనేందుకు నిదర్శనం ఈ ఫొటో. తల్లిగా, భార్యగా, కోడలిగా బంధాలను, బాధ్యతలను కొనసాగిస్తూనే ఎంచుకున్న రంగంలో కూడా ఆకాశమే హద్దుగా క్షిపణిలా దూసుకుపోతోంది. ఆఫనిస్తాన్‌కు చెందిన జహాన్ తాబ్ ఒకవైపు తన బిడ్డను లాలిస్తూనే, విశ్వవిద్యాలయానికి చెందిన ప్రవేశపరీక్షలో పాల్గొంది. మాతృత్వపు లాలిత్యాన్ని, బాధ్యతను ఒకేసారి కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్న

03/22/2018 - 20:31

వెన్నవంటి మనసు
సన్నజాజి రూపు
ఎన్నదగిన వనె్న
ఎనె్నన్ని ఉన్నా..
కనె్నపిల్లల బతుకు
కన్నీటి పాలగును
అందమే శాపమా?
అది ఆమె పాపమా?

కలువ రేకుల కళ్లు
అద్దాల చెక్కిళ్లు
నండూరి ఎంకిలా
నాజూకు నడుము
కలబోసి చెక్కినది
కనె్నపిల్ల సొగసు
సొగసు సొంతమైనా
శోకమైన బతుకు!
అందమే శాపమా?
అది ఆమె పాపమా!?

03/21/2018 - 20:43

ఆధునిక యుగంలో పురుషులకు దీటుగా మహిళలు అన్ని రంగాల్లోనూ పోటీ పడుతున్నప్పటికీ కొన్ని చోట్ల ఇంకా వివక్ష కొనసాగుతూనే ఉంది. అన్ని అర్హతలున్నప్పటికీ ఐటి (ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ) ఉద్యోగాల్లో పురుషుల కంటే మహిళలకు 20 శాతం మేరకు తక్కువ వేతనాలు చెల్లిస్తున్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. సూపర్‌వైజరీ, నాన్ సూపర్‌వైజరీ ఉద్యోగాల్లో మహిళలకు చెల్లిస్తున్న వేతనాల్లో ఈ వ్యత్యాసం కనిపిస్తోంది.

03/21/2018 - 20:41

ఆస్తి చారెడు వున్నవారు శ్రమించి బారెడు వీలైతే అంతకుమించి ఎదగాలని ఆశించే తీరుని అందుకు అనుసరించే సరైన విధానాలను సహృదయులు అభినందించడమే కాదు మరెందరికో అనుసరణీయమని సగర్వంగా చెబుతుంటారు. చారెడైనా లేని ఆస్తితో స్వర్గానికి నిచ్చెనలు వేయజూసే తీరు పలు అనర్థాలకే దారితీస్తుంది.

03/21/2018 - 20:40

మారుతున్న కాలంతో పాటే చెవులకు ధరించే ఆభరణాల్లోనూ కొత్త పోకడలు చోటు చేసుకుంటున్నాయి. మగువల ఆసక్తి, అభిరుచులకు తగ్గట్టుగా విభిన్న డిజైన్లలో కాంతులీనే ఆభరణాలకు మార్కెట్‌లో నేడు కొదవలేదు. చెవులపై ఒకప్పుడు బంగారు లోలాకులే కనిపించి కనువిందు చేసేవి. ఇపుడు పలురకాల మెటల్, కృత్రిమరాళ్లు, డైమండ్స్, పూసలు, అద్దాలు అద్దిన వినూత్న నగిషీలతో నగలు అందుబాటులో ఉన్నాయి.

03/20/2018 - 21:26

నేడు మహిళల్లో కూర్చుని కంప్యూటర్ల ముందు గంటల తరబడి పని చేసే వారు ఎక్కువ అయపోతున్నారు. లేకుంటే నిలబడి గంటల తరబడి ఉంటున్నారు. దేనినైనా అతిగా చేసే వృత్తి ఉద్యోగాలు మహిళలు చేస్తున్నారు. దీనివల్ల వారి ఆరోగ్యంపై దెబ్బ పడుతోంది. ఎక్కువ సేపు కూర్చుని పనిచేసుకొనే వారిలో పెద్ద పెద్ద పొట్టలు తయారు అవుతున్నాయ. శారీరిక శ్రమ లేనందున కూడా వారిలో కొవ్వు శాతం ఎక్కువ అవుతోంది.

03/20/2018 - 21:22

యోగనారాయణుని
నాభిస్థానము నుండి
ఉద్ధానమైన చతుర్ముఖ బ్రహ్మ,
తన జన్మకు కారణాలు
అనే్వషిస్తున్నప్పుడే!!
ఆ దామోదరుడు
క్షమాస్వరూపిణి అయిన
మాతృమూర్తి మాత్రమే
ఈ మాతృత్వభారము
భరించగలదని తన
పేగుబంధాన్ని
బొడ్డుతాడును నీకు
దత్తం చేశాడు కదా?
అవును నిజమే! కాకపోతే
ఈ చలనరహిత పదార్థం

03/19/2018 - 21:34

ఎంత చదువు చదివినా
ఎన్ని పదవులు లేలినా
ఎదలోపలి మమకారం
ఎగిరిపోదు.. ఇగిరిపోదు
వనితా నీ జీవితమే
మమతకు ఓ ఆలయం
మగువా నీ మనుగడయే
మానవతకు మందిరం!
మదిలో నీ హృదిలో
ప్రేమ పూలు పూయిస్తే
మంచులాగా కరుగుతావు
మంచితనం పంచుతావు
అవనిలోన దేవతవని
అనురాగం అందిస్తే
సహనశీలి వవుతావు
స్నేహం రుచి చూపుతావు

03/19/2018 - 21:42

పుట్టిన శిశువు దినదినాభివృద్ధి చెందినట్లుగానే 40 ఏళ్ళ తర్వాత ఒకొక్క అవయవము పనిచేయడం నెమ్మదిస్తాయి. పళ్ళు, కళ్ళు, చెవులు, దంతాలు మరమ్మతు చేయించుకోవలసిన దశకు చేరుకుంటాయి. చూడటానికి బాగా లేకపోయినా ఏ మాత్రం బాధించనవి తెల్ల వెంట్రుకలే. వీటి తోడు చాపకింద నీరులా చేరి మనకే కాక ఇతరులకూ ఇబ్బంది కలిగించేది మతిమరుపు. ఇది పైవాటిలాగే అతి సహజంగా వయస్సు రీత్యా వచ్చే ఒక రకం మార్పే.

03/19/2018 - 21:17

కం॥ శ్రీకరవౌ బ్రతుకిలశో
భాకరవౌ తరగనట్టి భాగ్యపు వరవౌ
లోకము నందనవనవౌ
చీకాకులు పారిపోవు శ్రీమతి ప్రేమన్

ఆ॥ ఆలుమగలు కలసి యురాగ హృదయాల
కాపురంబు చేయకలత లేక
పిల్ల పాప పాట ప్రియమార తిరుగాడ
అదియె స్వర్గమగును అవని యందు

కం॥ సగమై పతితో తానే
జగమై సల్లాపమందు సరసపు జాణై
నగవై పెదవులపైఏ
వగపును దరిచేరనీదు వాంఛలు తీరన్

Pages