S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

02/13/2018 - 21:11

ప్రతి సంవత్సరం ప్రేమికుల దినోత్సవంగా జరుపుకునే పద్ధతి రోమన్లది. ఫిబ్రవరి 14ను రోమన్లు శుద్ధీకరణ పండుగగా జరుపుకునేవారు. అలా కొంతకాలానికి ప్రణయోత్సవంగా మారిపోయింది. ఆ రోజున యువతీ యువకులు ఇష్టాగోష్ఠులు జరుపుకొని, అమ్మాయిల పేర్లను చీటీలమీద వ్రాసి ఒక డబ్బాలో వేసి డ్రా తీసిన తర్వాత ఒక అబ్బాయికి ఏ అమ్మాయి పేరు వస్తుందో ఆ రోజు అంతా కూడా కలిసి విచ్చలవిడిగా తిరిగే పద్ధతి ఉండేది.

02/12/2018 - 21:27

సరోజినీ నాయుడుగారు 1879లో ఫిబ్రవరి 13న జన్మించారు.శ్రీ అఘోరనాథ్ చటోపాధ్యాయ, శ్రీమతి వరద సుందరి సరోజిని దేవి తల్లిదండ్రులు. స్వాతంత్ర సమరయోధురాలుగాను, కవియిత్రిగాను ప్రసిద్ధికెక్కిన ఈ సరోజినిని భారత కోకిల అన్న బిరుదుతో సత్కరించారు. 1925 డిసెంబర్‌లో కాన్పూర్ లో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ మహాసభలకు తొలి మహిళా అధ్యక్షురాలుగా పనిచేశారు.

02/12/2018 - 21:22

దోసెడు జలంబు దీర్చు దప్పిక
ఘటము నిండేనుండు క్షీరము దీర్చదు గదా
జనయిత్రి మీదనేని భక్తి దేవునుండు వ్యర్థముగదా

జనని గర్భాశయమిచ్చు శాంతము గర్భగుడి నివ్వునా?
జన్మనిచ్చిన జననిసేయు సేవ జగన్మాత సేయునా?
లోగిలుండు అంబను విస్మరించు దైవంబు స్మరించుట

02/12/2018 - 21:18

కాలం కాళ్ళకు కట్టిన
చక్రం!
ప్రమేయం లేని పెత్తనాలకు
బలిపశువు!
పొగడ్తల గాలానికి చిక్కిన
చేపపిల్ల!
దోచుకోబడిన స్వప్నాలకు
తీపిగుర్తు!
బాధ్యతల బందిఖానాలో
జీవితఖైదీ!
త్యాగాల కొమ్మపై
తనవారికై పండిన ఫలం!
పట్ట్భద్రురాలైనా
వంటింటి రాజ్యానికి పట్టమహిషి!
ఎన్నో కన్నీటి నదులు దిగమ్రింగినా!
ఎండిపోని సంకల్ప సముద్రం.

02/12/2018 - 21:17

స్ర్తిశక్తి.. దైవీ శక్తిగా భావించడం అనాదిగా వస్తున్నదే. సృష్టి ఆరంభమే స్ర్తిశక్తితో జరిగింది అనేది మన హైదవం చెబుతుంది. అసలు ఆడదే అన్నింటి ఆధారం అనే నిత్యసత్యాన్ని అందరూ అంగీకరిస్తారు. ప్రాచీనకాలంనుంచి భారత దేశ వ్యవస్థలో స్ర్తిలది గౌరవప్రదమైన స్థానమే. భారతదేశంలో స్ర్తి మూర్తులను ‘లక్ష్మి, సరస్వతి పార్వతి ..’ ముగ్గురమ్మలుగా ఆరాధిస్తారు.

02/12/2018 - 21:15

‘‘నాన్నా పులి నాన్నా! .. పులి’’ అన్న కథ మన అందరికీ తెలుసు కానీ అది ఈమధ్య నిజంగా జరిగింది- ఎక్కడ? స్కాట్లాండ్‌లోని అంబర్డీషేర్ అనే వూరులో హట్టన్ పేటలో పోయిన శనివారం సాయంకాలం వేళా- పోలీసు స్టేషన్‌కి ఆర్తనాదం వచ్చింది. ఫోను టోపారం లేచేలాగా మ్రోగింది. ‘సారూ! సారూ! మీరు అర్జంటుగా రావాలి కాపాడాలి’ అంటూ ఒక రైతు యువకుడు హెల్ప్ లైను వాయించేస్తున్నాడు.

02/12/2018 - 21:13

బెంగుళూరు విశ్వవిద్యాలయం- యాభై మూడవ స్నాతకోత్సవాల్లో గోల్డ్ మెడల్స్ సాధించిన విద్యార్థులు - ఫీజుతో పాటు మరో ఐదు వందలు చలాన్ ద్వారా కడితేనే పతకములు.. లేదంటే కాగితం ముక్కలే ఇస్తాము అని ప్రకటించి పైసలు వసూలు చేసింది. విద్యార్థులు షాక్ తిన్నారు. అహర్నిశలు కష్టపడి మేము మెడల్స్ తెచ్చుకున్నది వాటిని కొనుక్కోడానికా? అని ఆందోళనకి దిగారు.

02/11/2018 - 19:44

సృష్టిలో ఏది వ్యర్థ కాదు. ఆయుర్వేదం ప్రతి మొక్కా ఔషధమే నంటుంది. అందులో పెరటి తోట పెరిగే కరివేపాకు, పుదీనా, కొత్తిమీర ఇలాంటివేవైనా సరే అటు ఆరోగ్యాన్నిస్తాయ. ఇటు వంటను రుచులతో నింపేస్తాయ. కనుక ఇంతులంతా పెరటి తోటకు ప్రీతిని చూపిస్తారు.

02/09/2018 - 20:56

మనం మంచి పనులు చేసినపుడు మన జీవితంలోగానీ ,
మరొకరి జీవితంలోగానీ ఏ అద్భుతం
జరుగుతుందో ఊహించలేం.
-హెలెన్ కెల్లర్

02/09/2018 - 20:55

ఇచ్చట పిచ్చుకలు కూడా విచ్చుకత్తుల తళతళలతో
విజృంభించి విప్లవ కవాతులు చేస్తాయి
ముచ్చటైన సాహితీ సమర్హణతో నిలువెత్తు నిలిచిన
మల్లెల పొదలు ప్రసూనమాలలై వర్షిస్తాయి
పారాణితో అందగించిన అడుగులు ‘తకతె్తై’ యంటూ
భరతనాట్యంతో మారాణిగా నర్తిస్తాయి
రచనా పాటవంలో, వచన కవితా దీటుదనంలో
వాక్చాతుర్యపు అమృతాలు చిలుకరిస్తాయి
సేవా, చేవా మా రెండు కరమలూ మా తలుపు తట్టే

Pages