S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచి మాట

05/25/2017 - 08:50

గురుదేవులు దక్షిణామూర్తి సృష్టిలోని ప్రతిదానినుంచి పాఠం నేర్చుకోవచ్చు అని చెప్పారు. దక్షిణామూర్తి 24మంది గురువుల నుంచి పాఠాలను నేర్చుకున్నట్లు , బోధతీసుకొన్నట్టు చెప్తారు. సద్గురువుగా భాసిస్తున్న శిరిడీ సాయిబాబా తాను ఏ గురువు దగ్గర ఉపదేశం తీసుకోలేదనే విషయాన్ని చెప్తూ అసలు జీవిత అనుభవాలే ఉపదేశాలు అందులో నుంచి పాఠాలను గ్రహించాలని పరోక్షంగా చెప్పారు.

05/23/2017 - 23:03

భగవంతునిపైన నమ్మకం, విశ్వాసం ఉండడం అవసరమే అని భక్తులు అంటారు. హేతువాదులు, భగవంతునిపైన నమ్మకం లేనివారు నమ్మకం అక్కర్లేదు, చేసేపనిని జాగ్రత్తగా పరిశీలించి నలుగురి ఉపయోగపడేటట్టుగా చేయమని చెబుతుంటారు. ‘నీవు చేసే పనే ఈశ్వరుడని భావించు పని యే పరమాత్మ’అనే వారు ఉంటారు. కేవలం భగవంతునిపైన భక్తి ఉండగానే సరిపోదు.

05/22/2017 - 21:17

రోజువారి పనుల్లో నేను, నాది అనడం పరిపాటి. కాని ఆ పదాల అర్థాల గురించి అంతగా పట్టించుకున్నట్టుగా అందరూ కనిపించరు. సాధారణంగా మనం అంటే శరీరమనే అనుకొంటాం. శరీర సంబంధం కలవాటిని నాది, నావి అనడం కూడా సహజం.

05/22/2017 - 01:06

అతులిత బలధామం హేమ శైలాభ దేహం
దను జవన కృశాం జ్ఞానినామగ్ర గణ్యం
సకల గుణ నిధానం వానరాణా మధీశం
రఘుపతి ప్రియభక్తం వాతజాతం నమామి
శ్రీరామ భక్తాగ్రేసరుడు, అతులిత బలధాముడు, ఆపద్బాంధవుడు, సకలభీష్ట వరదుడు అయిన హనుమంతుడు వైశాఖ బహుళ దశమి దినమున జన్మించాడని హనుమంతుని జయంతిని పురస్కరించుకుని ప్రతిఇంట్లోను, ప్రతిదేవాలయంలోను వేడుకలు చేస్తారు.

05/19/2017 - 23:07

చూచిన తోడనే సుశబ్దశోభితుడుగా కనబడ్డ సుందరుడు అంజనీసుతుడు ఆంజనేయుడు. ‘కంటిని సీతమ్మ’ను అని దుఃఖార్తిలో మునిగిపోయిన రామునికే సంతోషం కలుగజేసినవాడు. ‘ రాఘవుడున్నాడమ్మా నీ మనోభిరాముడు నీకోసమే ఎదురుచూస్తున్నాడమ్మా!’ అంటూ శోకసముద్రంలో కొట్టుకొని పోయే సీతమ్మకు ఆసరాగా కనిపించినవాడు.

05/19/2017 - 05:16

భారతీయ పంచాంగ గణకులు పూర్ణిమ తిథికి ఎంతో ప్రాముఖ్యం ఇచ్చారు. సంవత్సరంలో వచ్చే ప్రతి పూర్ణిమకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఋతువులలో మొదటిదైన వసంతం ఋతురాజు. చైత్ర,వైశాఖ మాసాలు గలది. చైత్రం మధుమాసంగా, వైశాఖం మాధవ మాసంగా పేర్కొంటారు. వైశాఖ మాసం దైవీశక్తి కలదని ధార్మిక గ్రంథాలు చెప్పాయి.

05/17/2017 - 22:46

మరణ బాధను మించిన బాధ ఈ లోకంలో ఏదైనా ఉందా అంటే అది ఋణబాధనే చెప్పాలి. మృత్యువన్నది ఎప్పుడో ఒకప్పుడు వచ్చి తన పని పూర్తి చేసుకుని పోతుంది. ఋణబాధ అలా కాదు. దినదినగండంగా మారి చచ్చేదాకా పీడిస్తునే ఉంటుంది. మనిషన్న వాడికి ఆర్థిక ఇబ్బందులు రావడం సహజం.

05/16/2017 - 21:32

గద్దరియోగిహృత్కమలగంధరసానుభవంబుజెందు పె
న్నిద్దపుగండుదేటి, ధరణీసుతకౌగిలిపంజరంబునన్
ముద్దులుగుల్కు రాచిలుక, ముక్తి నిధానమ, రామ, రాగదే,
తద్దయు నేడు నాకడకు, దాశరథీ కరుణాపయోనిధీ

05/16/2017 - 21:30

కృత, ద్వాపర యుగాలల్లో యజ్ఞయాగాదులు నిర్వహించడం పవిత్ర నదీ స్నానాలు చేయడం, వివిధ పుణ్యక్షేత్రాల దర్శనం లాంటివి చేస్తే కాని ముక్తి మోక్షం లభించేవి కావు. కాని కలియుగంలో కేవలం నామస్మరణ చేస్తేచాలు ముక్తినిస్తానని భగవానాడు అన్నాడు. భగవంతుని సాయుజ్యం దొరుకుతుందని పెద్దలంటారు. భాగవతం లోని అజామిళుడు తన జీవితంలో ఎన్నో పాపాలు చేస్తుండేవాడు. రేపటి గురించి ఆలోచన ఆయనకు ఉండేది కాదు . తన ధర్మం మరి చాడు.

05/14/2017 - 21:04

కుక్షిన జాండ పంక్తులొనగూర్చి చరాచర జంతుకోటి సం
రక్షణ చేయు తండ్రివి, పరంపర నీ తనయుండనైన నా
పక్షము నీవుగావలదె? పాపము లెన్ని యొనర్చినన్ జగ
ద్రక్షక కర్తనీవె కద దాశరథీ కరుణాపయోనిధీ

Pages