S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచి మాట

02/04/2018 - 21:31

‘రామా! నీవు సర్వప్రాణికోటి ఉత్పత్తికి కారకుడవు. జ్ఞానులలో అగ్రేసరునివి. సర్వశ్రేష్ఠునివైన నీవు సీతాదేవి అగ్నిప్రవేశం చేస్తుంటే ఉపేక్షించావు ఏమి? శ్రీరామా! నీవు బ్రహ్మాది దేవతలకు అధికునివైన శ్రీమన్నారాయణునివి. నీవా విషయం ఎందుకు తెలుసుకోలేకుండా ఉన్నావు. నీవు ఋతుధాముడను ప్రజాపతివి, ఆది సృష్టికర్తవు, స్వయంభువుడవు. రుద్రులలో ఎనిమిదవ వానిని మహాదేవునవు.

02/04/2018 - 21:29

ఈ మధ్య ఒకసారి ఓ విచిత్రం జరిగింది. ప్రఖ్యాత నటనాసౌర్వభౌముడు ఎన్‌టిఆర్‌ను స్వర్గంలో ఎ ఎన్‌ఆర్ కలుసుకొన్నారట. వారిద్దరూ అలా పిచ్చాపాటి మాట్లాడుకుంటుండగా అక్కడికి చాట్ల శ్రీరాములు గారు వచ్చారు. దాంతో వీరి సినీ ప్రయాణం హటాత్తుగా నాటకాల మీద సాగింది. శ్రీరాములుగారు

02/04/2018 - 21:26

‘‘ఇదేం మనిషి? ఎప్పుడూ యిలా వుంటాడేం? తన పెళ్లిలోనూ ఇంతే. ఆ ఈడువాళ్లు అందరూ ఉన్నట్టు సరదాగా వుండడు. పెళ్లిలో జరిగిన సరస వినోద కార్యక్రమాలలో ఏ ఒక్కటీ అతన్ని ఆనందపరచలేదు. అతని వాలకం సుమతి కనిపెడుతూనే వుంది. అతని ముఖం ఎప్పుడూ తల్లిని పోగొట్టుకున్న పిల్లవాడిలా ఆత్మేశ్వరిని పోగొట్టుకున్న ప్రియుడిలా వుంటుంది. ఏమిటి ఈయన బాధ? మనిషి స్వభావమే యిలా అయి వుంటుందా - ఇదే కొత్త పెళ్లికూతురు సుమతి అంతర్మథనం.

02/02/2018 - 23:46

‘ధర్మం’ అన్నది ఉత్కృష్టమైనది, చతుర్విధ పురుషార్థాలలో మొదటిదైన ధర్మం నీతికి, నిజాయితీకి, నిబద్ధతకు, నియమపాలనకు నిలువుటద్దం. అహింసకు అండగా నిలిచే ధర్మం పరోపకారానికి పట్టుకొమ్మ. జీవితంలో ధర్మాన్ని విస్మరించేవారిని అనవరతం అసంతృప్తి, అశాంతి వెంటాడుతుంటాయి. అలాగే ధర్మాచరణకు వింజామర పట్టేవారికి సహనశక్తి, సాహసం సదా సహాయపడుతుంటాయి. ధర్మపరుడు పుణ్యాన్ని ఆర్జిస్తే, అధర్మపరుడు పాపాన్ని మూటకట్టుకుంటాడు.

02/01/2018 - 20:23

సీ. నరసింహ నాకు దుర్ణయములే మెండాయె
సుగుణమొక్కటి లేదు చూడఁజనిన
అన్యకాంతల మీఁద నాశమానఁగలేను
బరుల క్షేమము జూచి బ్రతుక లేను
ఇటువంటి దుర్బుద్ధులిన్ని నాకున్నని
నేనుఁ జేసెడి వన్ని నీచ కృతులు
నావంటి పాపిష్ఠి నరుని భూలోకాన
బుట్టఁ జేసితివేల భోగిశయన

02/01/2018 - 20:17

నారదుడు పూర్వజన్మలో ఒక దాసీ పుత్రుడు. తల్లి వేదవేత్తలైన మునుల ఇళ్లలో పనిచేసేది. నారదుడు కూడా వినయ విధేయతలతో వారికి పరిచర్యలు చేసేవాడు. తోటి పిల్లలతో ఆటలకు పోకుండా వారి సేవలో నిమగ్నమయ్యేవాడు. ఆ మునులు శ్రీకృష్ణ గాధలు చదవడం, హరినామ సంకీర్తనం చేయడం అతనికెంతో ఆహ్లాదాన్ని కల్గించేవి. అతని సేవకు భగవంతునిపట్ల భక్తికి మునులు మెచ్చి అతనికి ఈశ్వర జ్ఞానాన్ని ఉపదేశించారు.

01/31/2018 - 19:13

మానవ జీవితంలో గురువు పాత్ర చాలా ముఖ్యమైనది. ఆదిగురువు తండ్రి. తదనంతరం మన పూర్వ జన్మలో సంపాదించుకున్న పాప పుణ్యాల ఫలితంగా, మన అనే్వషణను అనుసరించి మనకు గురువు లభించడం జరుగుతుంది. గురోపదేశమ్ లేని విద్య నిష్ఫలం అంటారు పెద్దలు. అయితే గురువు అంటే ఎవరు? ఎలా వుండాలి? అనే సందేహం మానవ సహజం. సామాన్యులమైన మనం ఎంచుకునే గురువుకి ఇలాంటి భౌతిక, మానసిక లక్షణాలు ఉండాలనుకోవడం అంతే సహజం అని చెప్పుకోవచ్చు.

01/30/2018 - 19:45

మానవ జీవితం కర్మతో ముడిపడి వుంది. ప్రతీ మానవుడు ఏదో ఒక కర్మను చేపట్టి కొనసాగించక తప్పదు. చివరికి సోమరి కూడా ఏ పనీ చెయ్యకుండా తప్పించుకునే కర్మాచరణ గురించి అనే్వషిస్తూ ఉంటాడు. కర్మనుండి కార్యము మొదలవుతుంది. కార్యము ఫలితాన్ని అందిస్తుంది. తిరిగి ఆ ఫలాభిరుచితో కర్మను చేపట్టడం జరుగుతుంది. ఈ సందర్భంలో మంచి చెడుల ప్రస్తావన అనివార్యం.

01/28/2018 - 23:25

ఏమహానుభావుడైనా మనిషికి- తన కోపమె తనకు శత్రువు అని చెప్తారు. కోపం గురించి మానవులే మహానుభావులే కాదు భగవంతుడు కూడా తన గీతాబోధలో కూడా చెప్పాడు. సామాన్యులైనా అసామాన్యు లైనా ఏదో ఒక కోరిక కోరుకుంటారు. ఆ కోరిక తీరకపోతే కోపం తెచ్చుకుంటారు. కోపం వస్తే బుద్ధి పనిచేయదు. వివేకం నశిస్తుంది.. ఎందుకు అనుకొన్న పని కాలేదు అని ఆలోచన ఉండదు. నేను ఇంత చేస్తే పని సఫలం కాలేదా అనే అహంకారం తొంగిచూస్తుంది.

01/27/2018 - 19:32

‘్ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మం మనలను రక్షిస్తుంది’ అని నానుడి. వేదం కూడా ఇదేచెబుతుంది. ధర్మసూక్ష్మం చాలా కష్టతరమైంది. చాలా సూక్ష్మమైంది. ఒకరికి ధర్మమైనది మరొకరి అధర్మం అవుతుంది. కనుకనే కాలాన్ని బట్టి పరిస్థితిని బట్టి ధర్మం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇట్లా కష్టతరమైంది కనుకనే పరులను పీడించడం అధర్మం అని, పరులకు తోడ్పాటు నివ్వడంలేక పరులకు సాయం చేయడం అనేది ధర్మం అని వేద వ్యాసుడు చెప్పారు.

Pages