S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచి మాట

01/26/2018 - 20:27

ఈ మానవ జీవితం భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం. అలాంటి జీవితాన్ని తుచ్ఛమైన కోరికలతో జీవితం నాశనం చేసుకొంటున్నాము. కష్టపడకుండా ఏదీ మన చేతికి రాదు. చిన్న చీమైనా నిరతరం శ్రమిస్తూనే వుంటుంది. సంవత్సరానికి సరిపడా ఆహారం నిల్వ చేసుకొంటుంది. దీనిలో నీతి మనకర్థం కావాలంటే.. ఉన్నపుడు దుబారా ఖర్చులు చేసి, లేనపుడు బాధపడకూడదని అర్థం.. ఎంత ఎదిగినా అంతగా ఒదిగి వుండాలన్నది చీమ నేర్పే మంచి పాఠం.

01/25/2018 - 20:12

విద్య విహీనః పశుః’ అని భర్తృహరి ఉవాచ. అంటే విద్యలేనివాడు వింత పశువు అని తెలుగు తాత్పర్యం. దీన్నిబట్టి విద్య ఎంత విలువైనదోనన్న విషయం వివరణ, విశే్లషణ లేకుండానే అందరికీ అర్థమైపోతుంది. అవిద్యయే అన్ని అనర్థాలకు మూలహేతువు. అట్టి అమూల్యమైన విద్య యొక్క విలువను విశదపరుస్తూ భర్తృహరి ఏనాడో చెప్పాడు.

01/24/2018 - 19:52

మన కంటికి కనిపించే దైవం సూర్యుడు. సూర్యుడు వెలుగులేని ప్రపంచం చీకటితో భీతావహంగా ఉంటుంది. పంచాంగ సిద్ధాంత కర్తలు ‘రథసప్తమి’ని ‘సూర్యజయంతి’ అన్నారు. ప్రత్యక్ష భగవానుడైన సూర్యుని ఆరాధించే పర్వదినం రథసప్తమి. మాఘమాస శుద్ధ సప్తమే రథసప్తమి.

01/23/2018 - 19:46

బ్రహ్మస్వరూపముదయే, మధ్యానే్నతు మహేశ్వరం
సాయంధ్యాయే సదా విష్ణుం, త్రరుూమూర్తిర్దివాకరః

01/21/2018 - 20:36

‘శివానుజ’ అనడం చేత విద్యనభ్యసించినవారు తమ విద్యను లోకకళ్యాణార్థం ఉపయోగించాలని భావం.

01/20/2018 - 19:26

నిశ్చల ఏకాగ్ర చిత్తంతో తపమాచరించు సమయంలో శిలలా కదలకుండా వుండి, అడవిలోని మృగాల యొక్క కండుయాన్ని (దురదను) తీర్చినవాడైనందున ‘మృకండు’ మహర్షిగా పిలువబడే మహర్షికి మరియు మహాసాధ్వి అయిన ఆయన భార్య మరుద్వతికి కలిగిన పుత్రుడే మార్కండేయుడు.

01/19/2018 - 19:34

రాముడు దేవునిగా కొలువబడుతున్నాడు. ఆదర్శ పురుషుడుగా కీర్తించబడుతున్నాడు. చారిత్రిక పురుషుడుగా అభినందించబడు తున్నాడు. మంచి కొడుకుగా, మంచి అన్నగా, మంచి భర్తగా, మంచి స్నేహితుడుగా, మంచిరాజుగా, ఇన్ని ఎందుకు గాని మంచికి మారుపేరుగా రాముణ్ణే నూటికితొంబైతొమ్మిది మంది చెబుతారు. ఆ ఒక్కరు కూడా రామునిలో మంచిగుణాలు చెబుతారు కాని వారికి నచ్చని గుణాలను కూడా ఉన్నాయంటారు అది వేరు విషయం.

01/18/2018 - 20:57

వినయం అనేది చదువుతో అబ్బుతుంది అంటారు పెద్దలు. వినయం అంటే ఒదిగి ఉండడమే కాదు అన్ని తెలుసుకొని ఉండడం దానితోపాటు ఏ వ్యవహారాన్ని ఎలా చక్కదిద్దాలో గ్రహించి ఉండడమూ వినయమే నంటారు పెద్దలు.

01/17/2018 - 20:42

శ్వాసలేని మనిషి లేనట్లే ఆశ లేని మనిషి కూడా లేడు. మానవుడు సర్వ సహజంగా ఆశాజీవి. అతని ఆశ అనంతమైన ఆకాశమంత విశాలం- అంతులేని సాగర గర్భమంత అగాధం. అగ్నికి ఆజ్యం తోడైనట్లు ఈ ఆశకు మోహం తోడైతే మానవుని దుశ్చర్యలకు దుర్మార్గాలకూ అంతమే వుండదు.

01/16/2018 - 21:06

భగవంతుని సృష్టిలో పనికిరానదంటూ ఏదీ ఉండదు. సూక్ష్మం నుండి స్థూలం వరకు వున్న ప్రతి ప్రాణి పరమాత్మ సృష్టిలోని భాగమే. చెట్టు చేమ, కొండ కోన, నదులు, సముద్రాలు, సూర్యచంద్రులు, గ్రహ నక్షత్రాలు- ఇలా జగత్తులోని అణువణువు దేవుని సంకల్పమాత్రంతో సృష్టింపబడినవే. సర్వజీవుల జీవనానికి అనుగుణంగా సృష్టికర్త ఏర్పరచిన ఒక ప్రణాళికాబద్ధమైన ప్రసాదమే ఈ ప్రకృతి.

Pages