S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచి మాట

01/03/2017 - 21:10

మనిషిని కర్తవ్యోన్ముఖునిగా తీర్చిదిద్దేదే భగవద్గీత. మనిషిని ఋజుమార్గంలో నడిపించి మనిషిని గమ్యం చేర్చడంలో భగవానుడు ఇచ్చిన కరదీపిక భగవద్గీతే. పండితులు భగవద్గీతను సకల వేదాంత సారమని దీనివల్లనే విశ్వమానవ కళ్యాణం జరుగుతుందని అంటారు. ఈ పుణ్యభూమిలోజన్మించిన మానవులందరూ భగవంతుని అంశను కలిగి ఉన్నారు. అందుకే సాటి మానవుణ్ణి భగవంతుని రూపుగానే చూస్తారు. తానెవరు అన్న ప్రశ్నలను నిరంతరం అనే్వషిస్తారు.

01/01/2017 - 21:19

కోరికలు అనేవి మానవునిలో సహజం. కాని కోరికలను నియంత్రించుకుంటే ఎంతో ఉన్నతిని పొందవచ్చు. దీనికి మనిషిలో ధర్మాచరణ పట్ల ఇచ్ఛ కలగాలి. కోరికను మునులు, రుషులు కూడా కోరికలను పూర్తిగా త్యజించలేకపోయారనే మన పురాణాలు చెబుతాయ. విశ్వామిత్రుడు కూడా తన కోరికలను అదుపు చేసుకోలేక ఎన్నో ఏళ్ల తపస్సును వ్యర్థపరుచుకుని తిరిగి జ్ఞానవంతుడై తపస్సు ఆచరించాడు. తాను అనుకొన్నదాన్ని సాధించాడు.

12/31/2016 - 21:26

మానవుణ్ణి ఉద్దరించేది, మానవ జీవితాన్ని సార్థక్యం చేసేది రామనామమే. రామ అన్న రెండు అక్షరాలే మానవుణ్ణి కీర్తిమంతుణ్ణి చేస్తాయ. చెడు దారిలో నడిచేవారిని మంచిదారిలోకి తెస్తాయ. రామనామము కల్పవృక్షము. అది ధర్మార్థ కామ మోక్షములనిచ్చునది. రాక్షసుడైన మారీచుడు రాముని దెబ్బతిని రామనామాన్ని విని తన రాక్షస కృత్యాలు మాని రామనామంతో జీవితాన్ని సార్థకం చేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చాడు.

12/30/2016 - 21:26

దానం చేయడంవల్లే గౌరవం లభిస్తుంది కాని కూడబెట్టడంవల్ల కాదు. మేఘాలు నీటిని దానం చేస్తున్నాయి కనుక వాటి స్థానం పైన ఉంది. సముద్రం నీటిని కూడబెడుతోంది కాబట్టి దాని స్థానం కిందనే ఉంది. దానధర్మాలు అనేది సాధారణంగా వాడే పదం. దానం ధర్మం ఈ రెండు వేర్వేరు శబ్దాలు అయినా దానం అనేది ధర్మాలలో నొకటి. దానం అనేది అతి సులువైన ధర్మం. దానం ద్వారా అన్నింటిని పొందవచ్చును. దానమే పరమ ధర్మమని గరుడ పురాణంలోవుంది.

12/29/2016 - 21:36

గాయత్రీ మంత్రము విశిష్టతను ఉపనిషత్తులు, బ్రాహ్మణాలు ఎంతగానో చాటుతున్నాయి. గాయత్రీ మంత్రము మనకు ఋగ్యజుస్సామ వేదాలలో లభ్యమగుచున్నది. సృష్టిలో అన్నింటికంటే మహోన్నతమైనది జ్ఞానం. జ్ఞానం చేతనే మనకు ముక్తి లభిస్తుంది. జ్ఞానాన్ముక్తిః కావున స్తుతి ప్రార్థనోపాసన మాత్రంగా గాయత్రీ ప్రాముఖ్యతను సంతరించుకున్నది.

12/29/2016 - 09:11

ఒక వ్యక్తి, తాను ఆచరించవలసిన విద్యుక్త ధర్మాన్ని కర్తవ్యం అంటారు. భాగవత / భగవంతుని సేవ, భక్తుని కర్తవ్యం, న్యాయం, ధర్మం, చట్టాలను గౌరవిస్తూ సమాజ సేవ చేయటం అతని కర్తవ్యం. శాంతిభద్రతలను కాపాడుతూ, చట్టాలను రక్షిస్తూ, పాటిస్తూ, ప్రజలకు ధైర్యాన్ని అందించడం రక్షక భటుల కర్తవ్యం. న్యాయాన్ని నిలబెట్టి కాపాడటం న్యాయాధీశుల, న్యాయమూర్తుల కర్తవ్యం.

12/27/2016 - 21:32

మనకు జ్ఞానాన్ని బ్రహ్మజ్ఞానాన్ని అందించేవి వేదాలు. ఇవి జ్ఞానానికి పుట్టిళ్లు! బ్రహ్మతత్త్వాన్ని బోధిస్తాయి గనక వేదాంతం!
‘వేద’ అంటే తెలుసుకోవడం.. వేద జ్ఞానాన్ని తెలుసుకున్న వాడు బ్రహ్మదేవుడు! ఆయన తెలుసుకుని ఇతరులకు బోధించాడు గనుకనే వేదాలను ‘బ్రహ్మవిద్య’ అంటారు!

12/25/2016 - 21:17

భగవద్గీతలో తెలుపబడినట్లు సుఖదుఃఖాలు, భయ విభ్రమాలు, రాగద్వేషాలు, కోపతాపాలు, ఈర్ష్యాసూయలు మొదలగు ద్వంద్వ ప్రకృతుల ప్రభావం తన మీద పడకుండా చూసుకొని, మంచి ప్రవర్తన, నడవడికగల వ్యక్తిని, స్థితప్రజ్ఞుడిగా చెప్పుకోవచ్చును.

12/25/2016 - 05:32

శ్రమకు తగిన ఫలితం ఎపుడూ ఉంటుంది. శ్రమ వలన ఏ మనిషికైనా విజయం లభిస్తుంది. ఆయువు, ఆరోగ్యము కూడా శ్రమ వల్లే లభిస్తాయి. మంచి ఆలోచనలతో కూడిన శ్రమ ఎన్నో నూతన ఆవిష్కారములకు పునాది అవుతుంది. సామాన్య మానవుడు తన జీవితంలో కష్టపడకుండా సుఖపడడానికి సులభమార్గాలను అనే్వషిస్తుంటాడు.

12/23/2016 - 21:42

కాలగమనంలో ఎన్నో సంవత్సరాలువస్తూ పోతూ ఉంటాయి. ఆ భగవంతుడు మనల్ని సదా కంటికి రెప్ప వలె కాపాడుతూనే ఉంటాడు. కాని మనమే గతి తప్పి మతి పోగొట్టు కుంటుంటాము. కాని భగవంతుడు మనకు ఏమి ఇవ్వాలో ఏది ఇవ్వకూడదో ముందే నిర్ణయిస్తాడు. అందుకే మనం భగవంతుని యందు సదా భక్తి భావంతో ఉండాలి. మన భారతదేశం వేదాలకు పుట్టినిల్లు. ఈ వేదభూమిలో ఎందరో మహాత్ములు జన్మించి తరించారు. వారు చూపిన మార్గం మనకు సదా ఆచరణీయం.

Pages