S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచి మాట

09/20/2016 - 22:08

ఈ రోజు జరుగుతున్నదంతా నిన్న వూహించింది ఎంతమాత్రం కాదు. రేపు జరుగబోయేదంతా ఈరోజు అంచనా వేస్తున్నదో, జరగాలని బలంగా కోరుకుంటున్నదో ఎంతమాత్రం కాదు. ఎవరికివారు తమలో తామెంత తెలివికలవారమని అనుకుంటున్నా ఎక్కువ సందర్భాల్లో అనుకునేదానికి జరిగేదానికి పొంతన కనిపించదు. అలాగని అనుక్షణం మనిషి ఊహల్లో ఊరేగడం మానడం లేదు. స్వప్నలోకాల్లో తేలిపోవడం ఆపడంలేదు.

09/18/2016 - 23:42

కలియుగం.. కల్లోల యుగంగా తయారయింది. భక్తునికీ కంటినిండా సుఖనిద్ర లేదు. స్వార్థపరునికీ సుఖం లేదు. భగవంతుడు ప్రసాదించిన దానితో సంతృప్తి పడక అంతా నాకే కావాలని ఇంకెవరికీ ఏదీ దక్కకూడదనే స్వార్థంతో కొందరు మనుషులు మసులుతున్నారు. మనిషి అందరికంటే తానే అత్యధికంగా ఉండాలని, తానే గొప్పగా ఉండాలని నిరంతరంగా అనే్వషిస్తున్నాడు. అడ్డొచ్చిన పుల్లలను తగులబెడుతున్నాడు.

09/18/2016 - 23:27

రామాయణం ఒక ఇతిహాసం. రామాయణ భారతాలను ఇతిహాసాలని అంటారు. తొల్లిటి కథలే ఇతిహాసాలు. ఇవి గ్రంథస్థం కాకముందు వౌఖికంగానే ఒకరినుంచి ఒకరికి అందుతుండేవి

09/17/2016 - 01:22

ఈ సకల చరాచర సృష్టికి మూలం భగవంతుడు. సృష్టి స్థితి లయకారుడు అంతా భగవంతుడే. ఈ భూప్రపంచంలో ప్రతి జీవికి ఆకలి దప్పులు అంతా ఒకటే. ఎనభై నాలుగు వేల కోట్ల జీవరాశులలోకెల్లా మానవుడు తెలివైనవాడు. భాషలు వేరైనా ప్రాంతాలు వేరైనా, దేశాలు వేరైనా మనిషి జీవితగమనం అంతా ఒకటే. ఆదిమానవుడిగా జీవితగమనం ప్రారంభమై.. నేటి నాగరికత పేరిట మనిషి ఎంత ఎదిగినా భగవంతుని ముందు అణువంతే.

09/16/2016 - 08:42

ఒకసారి ఋషులలో దైవకృపకు ఏ యుగం సులభైనదనే చర్చ జరిగింది. కొందరు కృతయుగమని, ఇంకొందరు త్రేతాయుగమని, మరికొందరు ద్వాపర యుగమని, మిగిలినవారు కలియుగమని వాదించుకోసాగారు. ఇలా వాదోపవాదాలే తప్ప ఎంతకీ అసలు విషయం తేలలేదు. దాంతో వేదవ్యాస మహర్షిని అడిగి తమ సందేహ నివృత్తి చేసుకోవాలని నిశ్చయించుకొని ఋషులందరూ ఆయన ఆశ్రమానికి బయలుదేరారు.

09/15/2016 - 06:29

పూర్వం కౌండిన్యముని భార్య ‘శీల’ కష్టాలను భరించలేక సర్వాధికారియైన శ్రీమన్నానారయణుణ్ణి ప్రార్థించగా ఆయన అనంతుని అర్చించమని దారి చూపాడట. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుని చేత బోధించబడిన వాడై అనంత పద్మనాభ చతుర్థశి అనే వ్రతాన్ని భాద్రపద శుద్ధ చతర్దశినాడు ధర్మరాజు ఆచరించగా,వారి కష్టాలు దూరం అయ రాజ్యాధిపతులైనారు.

09/13/2016 - 21:10

జీవులలో మానవుడొక్కడే కుశాగ్రబుద్ధి కలిగియున్నాడు. ప్రపంచములోని అన్ని ప్రాణులలో మనుష్యునికి మాత్రమే వాస్తవికతను గుర్తించే శక్తి సామర్థ్యాలున్నాయి. అజ్ఞానులైనవారు దీనిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. కేవలం వివేకులు మాత్రమే సద్వినియోగం చేసుకొని వారి బుద్ధికి వికాసం కలుగజేసికొని జన్మసార్థకత యొనర్చుకొనుచున్నారు. ఇటువంటి వ్యక్తులవల్లనే సమాజ వికాసం కలుగుతుంది.

09/11/2016 - 21:25

పూర్వజన్మల్లో పుణ్యమే చేస్తే వారికి స్వర్గలోకం లభిస్తుంది. కేవలం పాపమే చేస్తే నరకం నుంచి బయటపడడానికి చాలా కాలం పడుతుంది. కాని, అటు కాస్తంత పుణ్యమూ కాస్తంత పాపము చేస్తే ఆరెండింటి తాలూకూ కర్మలఫలితాలను అనుభవించడానికి మానవులుగా పుడతుంటారు. ఒకవేళ పుణ్యము, పాపము లేక అంటే అసలు కర్మల తాలూకూ ఫలితం ఏమీ లేకపోతే ఇక ఏముంది భగవానుని చెంత ఉండిపోతారు.

09/11/2016 - 05:17

అనుకరణ ద్వారానే శిశువుకు భాష అలవడుతుంది. ఇది భాష నేర్చుకోవడానికి ఒక మార్గం. అది బాల్యం వరకే పరిమితం. ఆ తర్వాత అనుకరించకుండా ఆలోచించి మాట్లాడాలి. ఆచి తూచి మాట్లాడాలి. ఒకరి మాటలు విని వెంటనే ఆచరణలో పెట్టకూడదు. దాని ఫలితం ఏమిటో ముందే తెలుసుకోవాలి. రామాయణంలో ఇటువంటి సంఘటనలు ఎటువంటి పరిణామాలు తీసుకొచ్చాయో తెలుసుకుందాం.

09/10/2016 - 00:08

శ్రీరామునికి దూరమైన సీతాదేవి దుఃఖితురాలై అసువులు వీడుటకు నిర్ణయించుకొంటుంది. ఆ నిర్ణయం విని అశోకవనమున ఆమెకు కావలివున్న రాక్షస స్ర్తిలు ఆ విషయం రావణునికి నివేదించి తదనంతరమున సీతనుద్దేశించి ‘‘ఓ సీతా, నీ నిర్ణయం అనుచితమైనది. మేమందరం కలసి నేడే ఇపుడో నిన్ను చంపి నీ మాంసము భుజించగలము’’ అని నుడివారు. అపుడక్కడ వారితో సీతాదేవికి కావలియన్న జ్ఞానవంతురాలైన త్రిజట ఇట్లనెను. ‘‘ఓ దుష్ట స్ర్తిలారా!

Pages