S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచి మాట

08/16/2016 - 21:36

‘ఏష ధర్మస్సనాతనః’ అనేది స్మృతివాక్యం. అంటే ఇది సనాతన ధర్మం అని అర్థం. సనాతన ధర్మం అధునాతన ధర్మం అని రెండు వేర్వేరు ధర్మాలున్నాయా అంటే లేవు అని స్పష్టంగా చెప్పవచ్చును. మరి ధర్మాల్ని సనాతన ధర్మం అని పెద్దలెందుకు చెప్పారు? పురాణేతిహాసాలలో ఇది సనాతన ధర్మం అని పలుచోట్ల వచించబడింది. పురాతనంగా కనిపించినా, ధ్వనించినా నిత్యనూతనమైనది సనాతనం.

08/15/2016 - 04:30

గృహస్థాశ్రమమునకు చెందిన మానవులు తమ తమ గృహ ధర్మములను ఆచరించుచుండవలెను. వాటిని భగవంతునికే నివేదన చేయవలెను. పెద్దలను కూడా సేవింపవలెను. పైన ఉదహరించినవి కాక గృహహ్థుడు సమయానుసారము విరాగులతో కూడి ఉండవలెను. పదే పదే భక్తిశ్రద్ధలతో భగవంతుని యొక్క అవతార లీలామృతమును గ్రోలుచుండవలెను.

08/14/2016 - 03:52

మన దైనందిన జీవితంలో మనకు సంబంధించినవి లేదా ఇతరులకు సంబంధించినవి ఎన్నో కార్యములు నిర్వహిస్తూ ఉంటాము. మనం నిర్వహించుచున్న కార్యములలో నిజాయితీ, కార్యదక్షత, దార్శనికత, ప్రయోజకత్వం యుంటే అది మన మనసుకు నిర్మలత్వమును, నైతిక స్థైర్యమును కలిగించుటయేగాక సమాజమునందు సమున్నత స్థానము కలిగించుటయే కాక శాశ్వత కీర్తిని సంపాదించి పెడుతుంది.

08/12/2016 - 21:33

ప్రపంచంలో అజ్ఞానులు మాయకు, ప్రకృతికి లోబడి దృశ్యపదార్థములనే సత్యములని శాశ్వతమని నమ్మి, విషయానందమునే తమ జీవిత లక్ష్యంగా భావించి మ ఉందుకు సాగుతున్నారు. లోతుగా విచారించి పరికించినచో ఆ విషయములందరి సుఖము కేవలం మనఃకల్పితమని తెలియుచున్నది. అందుకే త్రిశతికర్త భర్తృహరి ‘రోగశాంతి కరకృత్యం భోగమనంగ జెల్లునే’ అని నిలదీశాడు. వాస్తవముగా పరిశీలించినట్లైతే భోగము, భోగము కాదు.

08/11/2016 - 21:12

శ్రీమహావిష్ణువు జన్మనక్షత్రం శ్రవణం. అందువలన ఈ మాసానికి శ్రావణమాసం అని పేరు వచ్చింది. పూర్ణిమనాడు చంద్రుడు శ్రవణ నక్షత్రంతో కూడి ఉంటాడు. ఈ నెలలో శివునకు విష్ణువుకు అభిషేకాలు చేస్తే అన్ని అరిష్టాలు తొలుగుతాయనేది శాస్తవ్రచనం. శ్రావణమాసం పునిస్ర్తిలకు ఎంతో ముఖ్యమైనది.

08/11/2016 - 05:11

భగవానుని చేత నుడవబడినగీత భగవద్గీత. ఇది వేదాంత సారము. గీత మానవునికి కర్మ ఎంత ముఖ్యమో ఆ కర్మను ఏవిధంగా చేస్తే ఏవిధమైన జన్మను పొందవచ్చో తెలుపుతుంది. ఒక్కకర్మగురించే కాక మానవుడేవిధంగా జీవించాలో కూడా గీత బోధిస్తుంది.

08/09/2016 - 21:39

ప్రతి మనిషి జీవితమంతా సంతోషంగా, ఆనందం ఉండాలని కోరుకుంటాడు. ఇది మనిషికి ఉన్న సహజ గుణం. సంతోషానికి ఆనందానికి చాలా వ్యత్యాసం వుంది. సంతోషం తాత్కాలికమైంది. ఆనందం శాశ్వతమైంది. సంతోషం ఎక్కువ కాలం ఉండదు. ఆనందం జీవితాంతం వుంటుంది. సంతోషానికి ఆనందానికి మధ్యలో అప్పుడప్పుడు కష్టం వచ్చి చేరుతుంది. కష్టంతో మనిషి కృంగిపోయి సంతోషాన్ని ఆనందాన్ని కోల్పోతాడు. కష్టం తాత్కాలికం కాదు. శాశ్వతం కాదు.

08/07/2016 - 21:34

వేదభారతి ఉద్భవించి జ్ఞాన పరిమళాలు వెదజల్లిన పుణ్యభూమి మన భరతఖండం. ఋషుల మనోరథాలు అనంత విశ్వంలో స్వేచ్ఛాపయనం చేసి గ్రహించిన మహిమాన్విత నిత్యసత్యాల సమాహారమే మన వేదనిధి. మానవునికి నాగరికతను నేర్పిన తొలి విజ్ఞాన శాస్త్రాలు. జిజ్ఞాసువులకు సులభగ్రాహ్యంగా నుండుటకు సాక్షాత్ విష్ణుస్వరూపుడయిన వ్యాస మహర్షిచే నాలుగు భాగాలుగా విభజించబడినవి.

08/06/2016 - 21:09

నాగారాధనవేదకాలం నుంచి వస్తున్నదే. శివుని ఆభరణాలు నాగులు, మహా విష్ణువు పాన్పు నాగులే. వినాయకుడు కూడా నాగులనే యజ్ఞోపవీతంగా ధరిస్తాడు. అసలు ఆదిదంపతులైన పార్వతీ పరమేశ్వరుల కుమారుడు సుబ్రహ్మణేశ్వరుడు. ఈ సుబ్రహ్మణ్యేశ్వరస్వామినీ పూజ కూడా నాగపూజగా సంభావించబడుతుంది.

08/05/2016 - 21:04

ధర్మో రక్షతిః రక్ష అనేది మన వేద వాక్కు. ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది అనే భావం. ధర్మం అంటే ఏమిటి? ధర్మం అనేది మతానికి, ఓ వర్గానికి సంబంధించి కాదు. ఆధ్యాత్మిక చైతన్యాన్ని, మానవతా విలువలు మార్గదర్శనం చేసేది ధర్మం. ధర్మం అంటే ధారణ, ఆచరించి మన జీవితంలో విలువల ద్వారా వ్యక్తియొక్క ఔన్నత్యాన్ని తెలియజేస్తుంది.

Pages