S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచి మాట

07/10/2016 - 21:57

రామాయణం రసరమ్యం. అందులో అవసరం లేందేదీ లేదు. ప్రతిదీ తెలుసుకోవాల్సిన విషయమే. అయోధ్యకాండలో అలాంటిదే ఒక సంఘటన శ్రీరాముడిని వనవాసానికి వెళ్లమని కైక కోరడం.

07/09/2016 - 22:29

చండామార్కుల ఆశ్రమంలో దేవర్షి నారదుని వలన తను హరియే సర్వస్వమని తెలుసుకొంటిని అని ప్రహ్లాదుడు నుడవ ఆశ్చర్య చకితులైన దైత్యబాలురు ‘‘ప్రహ్లాదా! ఈ ఇద్దరుగురువులను తప్ప నీవుగానీ,మేం గాని ఎరుగము. నీవు ఇంకను చిన్నవయసు వాడివి. నీవు మహాత్ముడైన నారదుని కలుయుట అసంభవమని తోచుచున్నది. హరి గూర్చి ఏవిధంగా వచిస్తున్నావు ’’ అని వారు అడిగారు.

07/08/2016 - 21:15

భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం ఈ మానవ జన్మ. ఈ భూమికి చేరిన ప్రతిక్షణం ఎంతో విలవైనదని గ్రహించాలి. ప్రతి మనిషి భవబంధాలు ఇక్కడే మొదలవుతాయి. ముందుగా ఈ జన్మనిచ్చిన భగవంతునిది భక్తిబంధం. ఆ తర్వాత అమ్మా నాన్నలది. అన్న అక్క చెల్లి తమ్ముళ్ల బంధం. అలా మన జీవితం ఎన్నో అనుబంధాల అపురూప జన్మ జన్మల బంధాలమయం.

07/07/2016 - 21:10

మానవ దేహము ఒక మనోకల్పన. మనస్సు ఒక పదార్థము. శరీరము శైశవదశ నుండి వృద్ధినొంది చివరకు క్షీణించు దశలో కూడా మనస్సు మాత్రము కల్పనలు చేయుట అత్యంత ఆశ్చర్యకరమైన విషయము. దేహమును శిక్షించినా మనోభావనలు మాత్రం సమసిపోవు. చింత చచ్చినా పులుపు చావలేదని, మనోవికారములు కలుగుచునేయుండును. మనకు కనబడే ప్రకృతి మరియు అనంత విశ్వము సమస్తమూ మనోరూపముగానే భావింపవలెను. మనసును భరించుచున్న శరీరము కూడా పాంచభౌతిక పదార్థము.

07/07/2016 - 04:51

ఆంధ్ర మహాభారతంలో ఆదిపర్వంలో దుష్యంతోపాఖ్యానం సత్యం యొక్క మహిమను చక్కగా వివరించారు ఆది కవి నన్నయ్య. సత్యప్రభావం అన్ని యుగాల్లోనూ- అన్ని కాలాల్లోనూ ఆచరించదగినది. ఇతిహాసాల్లో పురాణాల్లో వేదాల్లో సత్యప్రాభవం సందేశాత్మకంగా వర్ణించబడినది. సత్యం అంటే నిజము. అది వాక్కుకు సంబంధించినది. ఎందరో కవులు రచయితలు పద్య గద్యములలో సత్యమహిమను సూక్తుల ద్వారా చక్కని తేట తెనుగులో లోకానికి అందించారు. అభినందించబడినారు.

07/05/2016 - 21:41

అనంతుడు, అనంతనామధారుడు, వ్యాప్తుడు, సర్వరక్షాకరుడు, దుర్లభుడు, సులభుడు, సంగతుడు, నిస్సంగతుడు, నిరాకారుడు, ఆకారుడు, ఇట్లా ఎనె్నన్ని విశేషణాలకు ఆధారభూతుడైన సర్వసాక్షి పరదైవం తన్ను తాను తన భక్తులకోసం అనేకవిధాలుగా, అనేక రూపాలుగా సృజియించుకుంటూ ఉంటాడు.

07/03/2016 - 21:15

జీవకోటిలో మానవ జన్మ సుకృతమైనది. దీన్ని మరిచిన కొందరు స్వార్థానికి ఇచ్ఛ వచ్చినట్లు మాట్లాడుతూ తాము కోరిన పనులు చేస్తుంటారు. దానివల్ల ఇతరులు కష్టపడతారనో లేక ఇతరులకు నష్టం వాటిల్లుతుందనో విషయాన్ని గ్రహించరు. దీనివల్ల ఆ పని చేసేవారికి పాపమొస్తుందని తలంపే ఉండదు. పాపాభీతి ఉండడం దైవం పట్ల నమ్మకం ఉంటే వారు తప్పక పుణ్యకర్మలు మాత్రమే చేస్తారు.

07/03/2016 - 01:16

జ్ఞానం, యోగం, సిద్ధి మానవ జీవితంలో పరిపూర్ణతను సాధించడానికి కావలసిన సాధనాలు. లౌకిక జీవనాన్ని సాగించే క్రమంలో మనస్సు, బుద్ధి చాంచల్యంతో ఐహిక, సుఖ భోగాదులు వాంఛించి ప్రాపంచిక సుఖాలపై మోజుతో తాత్కాలిక తృప్తినిచ్చే వాంఛల్ని తీర్చుకోవాలనే ఆరాటాన్ని పెంచుతాయి. ఈ అశాశ్వత భోగాలను అనుభవించిన తర్వాత మనిషి తనకు నిజమైన ఆత్మతృప్తి, మానసిక శాంతి లభ్యం కాలేదు అని పరితపిస్తాడు.

07/01/2016 - 21:42

జీవితం అందరూ ఆనందంగా జీవితం ఉండాలని భావించడం సహజం. కాని కుంతీ దేవి మాత్రం తనకు నిత్యం కష్టాలు కావాలిన కృష్ణుడ్ని కోరుకుందట. ఎందుకత్తా ఎవరూ కోరని కష్టాలను నీవు కోరుకుంటున్నావు అని అడిగితే ఆమె చెప్పిందట. కృష్ణా కష్టాలుంటే నిరంతరమూ మేమందరూ మమ్ము రక్షించుమని నిన్ను కోరుకుంటూ నిత్యం నీ నామస్మరణ చేస్తుంటాము. నీ కృపాదృష్టి మా మీద ఎల్లపుడు ఉంటుంది. అదే నాకు ఆనందాన్ని ఇస్తుంది అన్నదట. నిజమే కదా.

06/30/2016 - 21:18

భగవద్గీతలో సాంఖ్యయోగములో అర్జునుడు అడుగగా శ్రీకృష్ణ పరమాత్మ ఇలా ప్రబోధిస్తున్నాడు. అర్జునా! నీవు యోగమునందుంటూ, సంగత్వమును విడిచిపెట్టి, కార్యము సిద్ధించినా, సిద్ధించకపోయినా సమముగా ఉంటూ కర్మలను ఆచరింపుము. సమబుద్ధియే యోగమనబడుతుంది. బుద్ధి యోగముకంటే కామ్య కర్మ నికృష్ణమైనది. కాబట్టి నిష్కామ కర్మనే ఆశ్రయించి ఆచరింపుము. ఫలుమును గోరువారు అధములు.

Pages