S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచి మాట

05/13/2016 - 23:50

స హనం వహించడం అంటే భయపడ్డంకాదు. క్లిష్టపరిస్థితులకు దూరంగా వెళ్ళడం అసలు కాదు. విరక్తి చెందడం కానే కాదు. చేతకానితనం అంతకన్నా కాదు. ఎట్టి క్లిష్ట పరిస్థితులనైనా భరించగలిగే స్థితి సహనం. సహనం అనేది మనికి ఒక తపస్సులాంటిది. కొంతమంది ఒక కార్యాన్ని తలపెట్టి సరియైన శ్రమలేని కారణం చేతనో లేదా ఏ ఇతర కారణం చేతనో విఫలం అయితే విపరీతమైన అసహనాన్ని ప్రదర్శిస్తారు.

05/12/2016 - 21:33

శ్రీకృష్ణుని బాల్య స్నేహితులలో ఉదంకుడు ఒకడు (పౌష్య మహాదేవి కుండలాల కథలోని ఉదంకుడు కాదు). మహాభారత యుద్ధం పూర్తిఅయ్యేనాటికి ఉదంకుడు ఒక ఎడారిలో పర్ణశాల ఒకటి నిర్మించుకొని జీవిస్తూ ఉండేవాడు. ధర్మపుత్రుని పట్ట్భాషేకం తర్వాత శ్రీకృష్ణుడు సాత్యకి, సుభద్రలతో కలిసి ద్వారకకు బయలుదేరాడు. దారిలో చిన్ననాటి స్నేహితుడు ఉదంకుని కలుసుకొనడానికి అక్కడ ఆగాడు. ఉదంకుడు సకల మర్యాదలతో కృష్ణుణ్ణి ఆహ్వానించాడు.

05/12/2016 - 06:28

వైశాఖపురాణం ప్రకారం ఈ మాసం విష్ణుమూర్తికి ఎంతో ప్రియమైంది. విష్ణునామం స్మరించినా వినరో భాగ్యం విష్ణుకథా అంటూ హరికథలనువిన్నా చాలు ఆయన ఎంతో సంతోషించి మనలను సంతోషింపచేస్తాడు. భక్తవత్సలుడైన విష్ణు భగవానుడు వరాహాఅవతారమెత్తి భూదేవిని ఈ మాసంలోనే రక్షించి కాపాడాడు. అట్లాంటి వైకుంఠనాథుని స్మరిస్తూ నదీస్తాన్నాలు కూడా ఈ మాసంలో ప్రత్యేకతను సంతరించుకొన్నాయ.

05/10/2016 - 21:18

‘ఏకమేవ అద్వితీయ బ్రహ్మ’- సృష్టిలో బ్రహ్మం తప్ప అన్యమైనదేదీ లేదనీ సర్వం ఈశావాస్యం- సకల చరాచర సృష్టి అంతా ఒకే దివ్య చైతన్యంతో నిండి నిబిడీకృతమై ఉన్నదనీ భారతీయ వేదాంత విజ్ఞానాన్ని దేశం నలుమూలలా ప్రచారం చేసి బ్రహ్మ విద్యా సంప్రదాయాన్ని పునఃప్రతిష్ఠించిన వివేకరత్నం శ్రీ ఆదిశంకరాచార్య.

05/08/2016 - 21:43

శ్రీ మహావిష్ణువుకు చందనం అంటే బహుప్రీతి. శ్రీకృష్ణావతారంలో కుబ్జ కంసుడికి చందనసేవ చేయడానికి తీసుకొవెళ్తుంటే కుబ్జను ఆపి మరీ తనకు చందనసేవ చేయమని అడిగి చేయించుకొన్న శ్రీకృష్ణుడు కుబ్జ చుబుకాన్ని తన వ్రేలుతో తాకితాకగానే వెంటనే అష్టవంకరులున్న కుబ్జ కాస్తా బహు సుందరంగా సౌందర్యవతి అయిందని అంటారు.

05/08/2016 - 02:50

వాత్సల్యం ఒక అనుభూతి. ప్రేమ కంటే మధురమయినది. వాత్సల్యాన్ని ప్రత్యక్షంగా పరిశీలించాలంటే.. అప్పుడే ఈనిన గోమాత వద్దకు వెళ్లి చూడండి. తన బిడ్డ (లేగదూడ)ని అది సాకే విధానం గమనించండి. దూడ శరీరాన్ని నాకుతూన్నప్పుడు, ఆ గోమాత కళ్ళలో కనపడేదే వాత్సల్యం. వత్స అంటే శిశువు. తన శిశువు మీద గోమాత చూపించేదే వాత్సల్యం.

05/07/2016 - 02:41

దక్షుని యజ్ఞం ధ్వంసమైన పిదప బ్రహ్మదేవుడు దేవతల నిడుకొని కైలాసమేగి పరమశివుని సమీపించెను. దక్షయజ్ఞం ధ్వంసమైన చోట శిరస్సు భస్మమై దక్షుని మొండెము మిగిలినది. శివుని అపహసించిన భృగుడు గడ్డము, మీసములను కోల్పోయెను. భగునకు కళ్ళు పోయెను. పూషదేవత పళ్ళు కోల్పోయెను. ధ్వంస రచనను కొనసాగించక ధ్వంసమైన యజ్ఞం పరిసమాప్తి కొరకై బ్రహ్మ శివుని ఈ విధంగా ప్రార్థించెను.

05/05/2016 - 21:54

దానములన్నింటికన్నా అన్నదానం గొప్పది అంటారు. మన పెద్దలు పూర్వికులు దానధర్మాలు చేయడంవలన ఉత్తమ ఫలం లభిస్తుందంటారు. మానవుడు తన విధి విధానంలో ధర్మప్రవర్తనతో మసలుకోగలగాలి. ధర్మార్థ కామ మోక్షములలో ప్రధానమైనవి దానగుణం. పూర్వం శిబి చక్రవర్తి, దాన వీర శూర కర్ణగా కర్ణుడు అత్యంత దానశీలురుగా పేరుగాంచారు.

05/05/2016 - 07:37

ధర్మాచరణ చేస్తూనే మనుష్యులు ప్రపంచంలో నివసించాలి. ఎప్పుడైతే ధర్మాన్ని తప్పి ప్రవర్తిస్తారో వారు మానవులుగా పరిగణింపబడరు. పశువుల్లో కూడా కొన్ని నీతినియమాలు ఉన్నాయ. వాటిని అనుసరించి అవి బతుకుతాయ. కాని అవి ఎపుడూ కూడా వాటి నియమాన్ని అతిక్రమించవు.నదులు, చెట్లు, ప్రకృతి కూడా నియమాలను అనుసరించే వాటి పనిని అవి చేస్తూనే ఉన్నాయ.

05/03/2016 - 21:21

ఆలస్యం, శ్రమ, మందకొడితనం, భేదభ్రాంతి, మిధ్యాత్మత, నర్మోక్తి, ద్రోహం, పరదూషణ, గర్వం, భయం అనేవి మనిషిని పట్టి పీడించే చెడుగుణాలు.

Pages