S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచి మాట

03/27/2016 - 22:52

సృష్ట్యాది నుంచి ప్రకృతికి మనిషికి అవినాభావ సంబంధం ఉంది. ప్రకృతి మనిషికి జీవనాధారమైనది. మనకు ఊపిరినిచ్చే గాలి పచ్చని చెట్లనుండే లభిస్తుంది. మన ఆకలి బాధను తీర్చేది కూడా ప్రకృతిమాతే. అటువంటి ప్రకృతిని మనం అలసత్వంతో చూడకూడదు. ప్రకృతిలో నివసించే జీవరాశులన్నిటిలో సమతుల్యత ఉన్నప్పుడు మానవ జాతి ఆరోగ్యదాయకంగా ఉండగలుగుతుంది. ప్రకృతి ఏ ఒక్కరి సొత్తో అనుకోవడం చాలా పొరపాటు.

03/27/2016 - 07:56

ఈ విశ్వంలో ఎన్ని దిక్కులకు ఎంత దూరం ప్రయాణం చేసినా మళ్లీ అనంత దూరం మన ఎదుట ప్రత్యక్షమవుతుంది. కోట్లకి కోట్ల నక్షత్రాలు, గెలాక్సీలు (పాలపుంతలు), కృష్ణబిలాలు, ఇలా తలలు పండిన శాస్తవ్రేత్తలకే తలలు తిరిగేలా చేస్తున్న వాటి నియమాలు. అలాగే భూమి మీద ఎన్నో కోట్ల జీవరాశులు ఇవన్నీ తమ బతుకుబండిని నడపడానికి అహర్నిశలు పాటుపడుతున్నాయి.

03/25/2016 - 22:24

అందరూ మనుషులే! మనిషి మనిషికి ఆకారంలో రంగు, రూపం బాహ్యంగా కనిపించేవన్నీ తేడాగా వుంటాయి. ఇవే కాకుండా సామాజిక స్థితి, ఆర్థిక స్థితి- ఇవన్నీ కూడా తేడాయే. కేవలం మనుష్యులలోనే కాకుండా పరిశీలించితే జంతువులలోను, వృక్షాలలోను కనబడతాయి.

03/24/2016 - 21:28

భారతదేశాన్ని కర్మభూమి, హిందూ మతానికి పుట్టు భూమిగా పూర్వీకులు, ఋషులు వర్ణించారు. అటువంటి భారతంలో హిందూ మతోద్ధారకునిగా చివరగా పరిశీలనా దృక్పథంతోనూ వ్యవహరించి హిందూ మతాన్ని ప్రపంచ దేశాల్లో నిలబెట్టిన ఘనత వివేకానందునిది. దేశమంతా అనేక రాజ్యాలతో చిన్నాభిన్నవౌతుంటే మహాభారత యుద్ధం పేరిట భారతదేశాన్ని ఒక త్రాటికి తెచ్చి ధర్మరాజుకి అభిషేకం చేసిన ఘనత శ్రీకృష్ణునిదే.

03/24/2016 - 02:33

మార్పు ప్రకృతి ధర్మం, ప్రపంచ నియమం. మానవుడెప్పుడూ మార్పును కోరతాడు. ఆనందాన్ని ఆశిస్తాడు. విలాసాలలో మునిగి తేలాలనుకుంటాడు. అందుకే పండుగల పేరుతో విలాసాలకు ప్రాణం పోసాడు. ప్రతి పండుగకు ఒక విశిష్టత, నిర్దిష్టత, క్రమపద్ధతి ఉన్నది. ఆ విశిష్ఠతలో విశేషమైన శక్తి వుంది. కావున పెద్దలు వీటిని సాంప్రదాయాల పేరుతో జాగ్రత్తగా కాపాడుతు వస్తున్నారు. గతాన్ని మరిచిపోకుండా నెమరు వేసుకుంటున్నారు.

03/22/2016 - 21:32

భారతీయంలోని ప్రతిపండుగ ఒక పరమార్థాన్ని తెలుపుతుంది. ఒకవైపు ఆనందోత్సవాలను జరుపుకుంటూనే మరోవైపు ఉత్కృష్టమైన మానవజన్మనుసార్థకం ఎలా చేసుకోవాలలో భారతీయులను చూచే నేర్చుకోవాలంటారు. ఈ ఫాల్గున మాసంలోని పౌర్ణమి తిథినాడు జరుపుకునే హోలీ ఉత్సవమూ ఇటువంటిదే. ఈ హోలీ పండుగ మానవులకు ఇంద్రియలౌల్యురు కాకూడదే నీతిని ప్రబోధిస్తుంది.

03/20/2016 - 22:16

ప్రతి మనిషిలోనూ శక్తి సామర్థ్యాలుంటాయ. వాటిని ఏవిధంగా ఉపయోగిం చుకుంటారన్న దాన్ని బట్టే వారు సత్వగుణులా లేక తామస, రాజసగుణులో అర్థమవుతుంది. మనిషిలోని రాగద్వేషాలను బట్టే గుణాలు వృద్ధి పొందడం లేక అణగబడి ఉండడంజరుగుతుంది. అందుకే రాగద్వేషాలను మన మననియంత్రణలో ఉంచుకుంటే చాలు సత్వగుణసంపన్నులుగా ఉండవచ్చు. ఎందుకంటే సృష్టి మొత్తం పరమాత్మలీలా విశేషమే. అందులో భగవంతుడు కానిది అంటూ ఏదీ లేదు.

03/19/2016 - 22:01

ఆదికవిగా వాల్మీకి, మహర్షిగా వేదవ్యాసుడు సుప్రసిద్ధులు. ఇరువురు మహాకవులేకాక రుషీశ్వరులు కూడా. అన్నిటికన్నా చిత్రమైన విషయం తాము రాసిన కథలలో వాళ్లే పాత్రలుగా మనకు దర్శనం ఇవ్వడం. వేదవ్యాసులవారు బలిచక్రవర్తి, అశ్వత్థామ మొదలైన వారితోపాటు చిరంజీవి అయినందున మహాభారతకర్తగా ముఖ్యపాత్రగా కూడా మనం గుర్తుంచుకుంటాము.

03/18/2016 - 23:22

ధర్మసాధనలో మానవులకు శరీరమే ప్రధాన సాధక యంత్రం. సుప్రసిద్ధ సంస్కృత మహాకవి కాళిదాసు ‘శరీర మాద్యం ఖలు ధర్మసాధనం’ అని ధృవీకరించాడు. సమత్వ బుద్ధితో మానవుడు జ్ఞాన సముపార్జన చేయాలన్నా, నిశ్చల చిత్తంతో, నిర్మల భక్తితో భగవంతునిపై మనస్సు నిలిపి ధ్యానమగ్నుడు కావాలన్నా, సంపూర్ణ ఆరోగ్యంతో వున్న శరీరంతోనే సాధ్యమవుతుంది.

03/18/2016 - 01:43

నశించు స్వభావము కలది శరీరము అని వ్యుత్పత్తి కనుక నిజంగా శరీరమనగా సూక్ష్మ శరీరమని అనాలి. దహించబడునది దేహమని వ్యుత్పత్తి. కనుక దేహమనగా స్థూల దేహమే అనాలి. వాడుకలో శరీరమను శబ్దము కూడ స్థూల దేహమునకే వర్తింపబడుతున్నది. కనుక శరీరము, దేహము, కాయము ఇత్యాది శబ్దములు పర్యాయ పదములుగానే వాడుకలో వున్నవి. మనోవాక్శరీరులని, మనో వాక్కాయములని అనబడు త్రికరణములలో ఒకదానికంటె నొకటి స్థూలరూపంగా ఉన్నవి.

Pages