S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచి మాట

11/25/2017 - 18:46

ఆలోచనలు రెండు రకాలు. ఒకటి సదాలోచన. రెండు దూరాలోచన. సదాలోచన అంటే సరిగ్గా ఆలోచించడం, సమయానికి సరిపడే నిర్ణయాన్ని తీసుకునేందుకు ఉపయోగపడే సముచితమైన ఆలోచన చేయడమన్నమాట. ఇది సదురు వ్యక్తికే కాదు సమాజం మొత్తానికి ఉపయుక్తమైన విచిత్రాలు సృష్టిస్తుంది. ఇక, దురాలోచన అంటే నిరుపయోగమైన యోచన. దీనివలన అలా ఆలోచించే వ్యక్తికే కాదు యావత్సమాజానికే కీడు జరుగుతుంది.

11/24/2017 - 18:50

శ్రీకాలభైరవస్వామి ఆవిర్భవించిన మార్గశిర శుద్ధ అష్టమిని కాలభైరవాష్టమి గా సంభావిస్తారు. ఈ కాలభైరవ స్వామి పుట్టుకకు సంబంధించిన ఆసక్తికరమైన కథ శివపురాణం చెబుతుంది.
ఒకసారి శివబ్రహ్మలు మాట్లాడుకుంటున్నారు. ఆ మాటలు కాస్తా వాదోపవాదాలుగా మారాయి. బ్రహ్మదేవుడు ‘నేను సృష్టికర్తను... పరబ్రహ్మ స్వరూపుడను... నేను చెప్పినట్లుగానే మీరంతా నడుచుకోవాలి’అన్నాడు. దానికి శివుడు సమ్మతించలేదు.

11/23/2017 - 17:53

అన్నదమ్ముల సఖ్యతకు రామలక్ష్మణులు నిదర్శనం! రావణవిభీషణులు ఒకరు మంచి తనానికి మారుపేరు అయతే మరొకరు చెడుతనానికి మారుపేరు. రావణుడు రాముని చేతిలో ప్రాణాలు వదిలితే విభీషణుడు రాముని వల్లనే బతికి బట్టగట్టాడు. వాలి సుగ్రీవులు కూడా అంతే వాలి రాముని చేతిలో మరణం పొందినా రాముని అనుగ్రహాన్ని పొందాడు.

11/22/2017 - 19:23

నీలో భక్తి వుంటే నీవు నాకు ప్రియుడవవుతావుఅని భగవానుడు ఓసారి అర్జునుడితో అన్నాడు. భక్తిఅంటే పూజలు చేయడం, వ్రతాలు, భజనలు చేయడమే కాదు.రకరకాలైన భక్తులుంటుంటారు. వారిలో ముఖ్యంగా ఆర్త, అర్ధార్ధి, జిజ్ఞాసువు, జ్ఞాని అని భక్తులు నాలుగురకాలు. ఆర్తులంటే కష్టములు, దుఃఖములు, విచారములు సంభవించిన సమయాల్లో భగవంతుని ప్రార్థించేవారు.

11/21/2017 - 18:41

భరతభూమి పుణ్యభూమి- కర్మభూమి- యోగభూమి. ఈ కలియుగంలో భారతభూమిలో సనాతన ధర్మ సంస్థాపనకు ఎందరో మహనీయులు- యోగులు- తపోధనులు- మునులు- ఋషులు- అవధూతలు జన్మించి కలిమానవులలో దైవభక్తిని పరమార్థ చింతనను ఆధ్యాత్మిక భావ సంపదను అందించి తరింపజేయుటకు నడుం కట్టారు. వారి కృషి భావితరాలకు మార్గమై నిలిచినది. దేశంలో సుస్థిర శాంతి స్థాపనకు వారు చేసిన సేవలకు ప్రతిగా వారిని అవతార పురుషులుగా భావించడం జరుగుతున్నది.

11/19/2017 - 22:20

హిరణ్యకశిపునికి నలుగురు కుమారులు. వారిలో ప్రహ్లాదుడు పరమభక్తాగ్రేసరుడు. చక్కని రూపం, విద్యాగంధం, కావలసినంత సంపద వున్నాయి. దానికి తోడు రాచబిడ్డ అయినా ఈషణ్మాత్రం గర్వం లేదు. దేవేంద్రుడు సైతం ప్రహ్లాదుని గుణగణాలను కీర్తించేవాడంటే ఆ బాలుడు ఎంత సంపన్నుడో తెలుసుకోగలము. హాస్యానికి కూడా అబద్ధమాడని సత్యవ్రత పరాయణుడు.

11/18/2017 - 17:49

కష్టపడినవారికి ఇష్టమైన ఫలితాలు వస్తాయ. కష్టే ఫలే అన్నారు కదా. అనుకొన్న ఫలితాలు రావాలంటే కష్టపడాల్సిందే. దేనికైనా కష్టపడితే తప్పక ఫలితం వస్తుంది. కేవలం విశ్రాంతి తీసుకొంటూ ఉంటే అనుకొన్న ఫలితాలను రాబట్టలేము. ఏ ఫలితానికి ఏ కృషి చేయాలో తెలుసుకొని ఆవిధంగా చేస్తేనే ఆ ఫలితం వస్తుంది.

11/17/2017 - 18:54

శరణనన్న వారిని కాపాడటంలో శ్రీరాముడు ముందుంటాడు. భక్తుల రక్షణ ఆయనకు మొట్టమొదటి పని. శరణు వేడితే రావణుడినైనా వదిలిపెట్టేస్తానన్న వాడు రాముడు. ఆపన్నులైన భక్తులను ఆదుకోవటమే భగవంతుని పని. అందుకే రాముడు దేవుడు అయ్యాడు. పరమ భక్తాగ్రేసరులైనవారు భగవంతుని కోసం పరితపిస్తూ ఆయననే స్మరిస్తూ, జపిస్తూ ఉంటారు. భగవంతుడికీ భక్తునికి తేడా నే ఉండదు.

11/16/2017 - 18:10

శుకుడు వ్యాసుని కుమారుడు. వేదవ్యాసునికి ఘృతాచి అనే అప్సరస కారణంగా శుకుడు జన్మించాడు. ఒకప్పుడు వ్యాసుడు పుత్రునికోసం శివునిగురించి తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై ఆయన కోరిక ప్రకారం పంచభూతాలతో సమానమైన పుత్రుణ్ణి ప్రసాదించాడు. ఒకనాడు వ్యాసుడు హోమం కోసం అరణిని మధిస్తుంటే ఘృతాచి అనే అప్సరస ఆయనకు కనపడింది. ఆయన కామవశుడైనాడు. ఆమెనే తలచుకుంటూ అరణి మధిస్తున్నపుడే వీర్యస్ఖలమై అరణిలో పడింది.

11/15/2017 - 17:42

ప్రతియుగంలోను జీవులు అనగా ప్రాణులు పాపకర్మల ను ఆచరిస్తూనే ఉంటారు. పాపాచరణం అధర్మం. అది నరకానికి దారితీస్తుందని అందరికీ తెలుసు. కానీ పాలు చేయడం మానుకోలేరు. ఈ కలియుగంలోని మానవులు విపరీతంగా పాపపుపనులు చేస్తూ పలుబాధలకూ, కష్టాలకూ గురి అయి దుఃఖాన్ని అశాంతినీ పొందుతూనే ఉంటారు. ఇది కలిప్రభావం అని పలు పురాణాలు తెలుపుతున్నాయి.

Pages