S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భక్తి కథలు

01/21/2018 - 20:38

తన బంధువులు, కొంతమంది ప్రజాప్రతినిధులు, బ్రాహ్మణులు, తన పాంచాల రాజ్య పురోహితుడు కూడా వారి వారి ఆసనాలపై కూర్చుని ఉన్నారు.

01/20/2018 - 19:29

ఆ మాటలు విన్న ద్రౌపది ఒక్కసారి ఆసాంతం పైకి క్రిందికి చూసింది. పెదవులు వణికాయి. పెద్ద నిట్టూర్పు విడిచింది. మెల్లగా అన్నది.
అయితే వాసుదేవా! మా తండ్రి కోరిన విధంగా మీరు సహాయం చెయ్యనంటారు!’’
ఆమె కళ్ళ వెంట అశ్రువులు ధారగా కారటం మొదలుపెట్టాయి. కానీ పెద్దగా విలపించలేకపోయింది. ఆమె దీనావస్థను గమనించాడు కృష్ణుడు. ఆమెకు ధైర్యం కలిగేటట్లుగా అన్నాడు.

01/19/2018 - 19:36

యదువృష్ణిలో భోజకుకురాంధక వీరులందరూ, నేనూ బలరాముడూ కూడా స్వయంవరానికి వస్తాము. మా శక్తివంచన లేకుండా మీకు సహాయపడగలవారము. మీరు నిశ్చింతగా ఉండండి అని అన్నాడు.
ద్రుపదుడు అమితానందాన్ని పొందాడు. వాసుదేవుని ఆలింగనం చేసికొన్నాడు. మనసు కుదుటపడింది.
10
అది రాజభవనము
ద్రౌపది అభ్యంతర మందిరము

01/18/2018 - 20:59

తదుపరి శ్రీకృష్ణ వాసుదేవుని మంత్రాంగం నిర్వహించే తన సమాలోచన మందిరానికి కొనిపోతాడు. శ్రీకృష్ణుని రెండు చేతులను తన చేతులలో గ్రహించి..
శ్రీకృష్ణవాసుదేవా! నా కోర్కెను మన్నించి వచ్చినందులకు ఎంతో సంతోషిస్తున్నాను. నీకు ఎంతో ఋణపడి వున్నాను.

01/17/2018 - 20:44

మగధ సామ్రాజ్యానికి సార్వభౌముడు ‘జరాసంధుడు’.
జరాసంధుడు వృద్ధక్షత్రుడి కుమారుడు.

01/16/2018 - 21:10

స్వయంవరాన్ని తప్పక ప్రకటించి పాండవులు బయల్వెడలేటట్లు చేయాలి అని అన్నాడు.

01/14/2018 - 18:22

‘‘పాంచాల రాజకుమారి!’’ అని మళ్లీ పిలిచింది. అయినా సమాధానం లేదు.
‘‘రాజకుమారి ద్రౌపదీదేవి! ద్రౌపదీదేవి!’’ అని రెట్టించింది.
ఉలిక్కిపడిన యాజ్ఞసేని పైకి చూచింది ఏమిటన్నట్లు.
ఏమి ఆలోచిస్తున్నావు? అంది చిలుక.
నీకెందుకు? అన్నది ద్రౌపది.
అర్జునా! అర్జునా! పార్దా! పార్దా! అని పిలిచింది చిలుక.
‘‘ఏం? పరిహాసంగా ఉన్నదా!’’ చిరునవ్వుతో అన్నది ద్రౌపది.

01/13/2018 - 18:36

నా విషయంలో ద్రుపదుడు రాజైన తర్వాత గర్వంతో ప్రవర్తించాడు. దానికి తగిన ఫలితాన్ని పొందాడు గదా? పాంచాల రాజ్యం రెండు ముక్కలయింది గదా? గర్వం అణిగిపోయింది ద్రుపదునికి. కానీ ఒక క్షత్రియుడిగా నాపై శత్రుత్వాన్ని విడువలేకపోయాడు. నన్ను జయించటానికి అతడికి వీలుగా యజ్ఞయాగాదుల ద్వారా నన్ను జయించగల ఒక కుమారుడిని పొందాడు. అది దైవనిర్ణయం.

01/12/2018 - 18:50

నా మిత్రుడైన ద్రోణాచార్యుడి వద్ద అస్త్ర విద్య నభ్యసించుము. అతడు గొప్ప ధనుర్విద్యా పారంగతుడు. బ్రాహ్మణ క్షత్రియ తేజస్సు కలవాడు. వెంటనే బయలుదేరి వెళ్ళుము’’ అని అన్నాడు.
‘‘తండ్రీ! మీరు నన్ను ఆ ద్రోణుణ్ణి చంపగిలిగినవాడిగా పొందారు. ఆ ద్రోణాచార్యులవారు నన్ను శిష్యునిగా స్వీకరించి అస్త్ర విద్యను ప్రసాదిస్తాడా’’ అని సందేహాన్ని వ్యక్తపరిచాడు.

01/11/2018 - 19:26

ద్రోణుని సంహరించగల కుమారుని పొందాలని కోరుచున్నాను. నా మనోరథాన్ని సఫలం చేయండి! పది కోట్ల ఆవులనయినా ఇస్తాను’’ అని చేతులు జోడించి వేడుకొన్నాడు.
ద్రుపదుడి దీనాలాపనలను విన్న యాజుడు ప్రసన్నుడైనాడు. ద్రుపదునితో-
‘‘ద్రుపద మహారాజా!

Pages