S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భక్తి కథలు

01/05/2018 - 20:11

నాకిప్పుడు నీ సహాయం అవసరమైంది. నాకు ధన సహాయం చేయుము’’ అని అన్నాడు.
ఆ మాటలు విన్న ద్రుపదుడు రాజ్యమదంతో, గతాన్ని మరిచి, మిత్రుడని కూడా గౌరవించక ‘‘నేను రాజును. నీవు ఒక బీద బ్రాహ్మణుడవు. నాకూ, నీకూ స్నేహం ఎక్కడ? సరితూగే రాజులతో మాత్రమే స్నేహము ఉంటుంది. నీవు వెంటనే ఇక్కడనుండి మరలిపొమ్ము’’ అని అవమానపరచి వెడలగొట్టిస్తాడు.

01/04/2018 - 19:17

‘అగ్నివేశ్యుడు’ అనే మహాముని శ్రేష్ఠునివద్ద ద్రోణుడు వేదాధ్యయనం చేసి, ధనుర్వేదం నేర్చుకొంటున్న కాలంలో పాంచాల రాజైన పృషతుని కుమారుడు ద్రుపదుడు కూడా వచ్చి ద్రోణునికి మిత్రుడై అతడితోపాటు గురువు వద్ద అన్ని విద్యలు నేరుస్తాడు. విద్యాభ్యాసం ముగిసిన తరువాత ద్రుపదుడు తన రాజ్యానికి వెళుతూ తనకు ద్రోణునితోకల మిత్రబృందాన్ననుసరించి అతడితో ‘‘నేను పాంచాల దేశానికి రాజైనప్పుడు నీవు నా దగ్గరికి రావాలి సుమా!

01/03/2018 - 20:27

ఆయా వేదికలపై గట్టి కప్పులను నిర్మించారు. వాటిపై మణికవర్యులు రత్నాలను, ముత్యాలను, అలంకరణ వస్తువులను విక్రయిస్తున్నారు.
కొన్ని వేదికలపై వృత్తిపనివారు హస్తకళాప్రావీణ్యం ఉట్టిపడేటట్లుగా మగ్గాలపై నేసిన స్ర్తి పురుషులు ధరించే చేనేత వస్త్రాలను మరి రాజభటులు, రాజప్రముఖులు, వారి వారి అర్హతకు తగినట్లుగా ధరించే వివిధాలంకృతమైన కుట్టిన వస్త్రాలను ప్రదర్శిస్తున్నారు.

01/02/2018 - 19:20

కాం పిల్యము కురు సామ్రాజ్యానికి చుట్టూ వున్న జనపదాలలో పేరెన్నికగన్న ఒక జనపదము. భారతావనికి ఉత్తరాన పవిత్ర గంగానదికి ఇరుప్రక్కల వ్యాపించియున్న రాజ్యము. పృషతుడు పాలించిన అవిభక్త పాంచాల రాజ్యము.
కౌరవ పాండవులకు అస్తవ్రిద్యా గురువైన ద్రోణాచార్యుడి కోపానికి విడదీయబడి దక్షిణ పాంచాలానికి రాజధాని అయింది.
‘అహిచ్ఛత్రము’ ఉత్తర పాంచాలానికి ముఖ్యపట్టణమిది.

12/31/2017 - 20:34

నన్ను నమ్ము’అని చెప్పాడు మహిల్సాపతి.

12/30/2017 - 19:35

అంతే ఆ ముసలాయన ఆమా ట ఈ మాట చెబుతూ ముందుకు నడుచుకుంటూ వెళ్లారు. కొద్ది సేపట్లోనే అయ్యప్ప క్షేత్రానికి చేరారు. నేను ఇపుడే వస్తాను అంటూ ఆ ముసలాయన ముందుకు వెళ్లాడు. అంతే మరలా ఆ ముసలాయన ముకుంద్‌కు కనిపించలేదు. ముకుంద్ పదినెనుమిది మెట్లు ఎక్కి కొబ్బరికాయను సమర్పించి నమస్కరించుకొని ‘స్వామి అయ్యప్పా నాకు దారిలో కనిపించిన ముసలాయన మరలా కనిపించేట్లు చేయి. నాకు ఎంతో సాయం చేసాడు.

12/28/2017 - 18:39

దాసగణు చెప్పేవాటిని వినడానికి ఒక్కరిగా వస్తూ వస్తూ చాలామంది గుమిగూడిపోయారు అక్కడ. అంతలో అక్కడి సాయిరూపం కనిపించిది.

12/27/2017 - 18:31

ఆయన తన భార్యతోటి
‘నేను ఈ కనిగిరికి వెళ్లి వచ్చాక డాక్టర్లు చెప్పినట్లు ఆలోచిద్దాం’అని చెప్పారు. ఆమె దానికి ‘ముందుగా ఆరోగ్యం చూసుకోవాలి కదా’అంది.
కాని ఉమామహేశ్వర రావు మరేంభయంలేదు. నాకు భగవంతుడు మంచి చేస్తాడు లే. ఫర్వాలేదు అని చెప్పారు.
ఆరోజు రాత్రి ఆయనకు కలలో ఓ ఫకీరు కనిపించి మరి నామీద నీకింత నమ్మకం ఉందికదా. మరి నా సమాధిని ఒక్కసారైనా దర్శించలేదేమి అని అడిగారు.

12/26/2017 - 18:34

ఆ రాత్రి అక్కడే బసలో నిద్రపోయాడు దూబే. మరలా బాబా ఆయన కలలో కనిపించి నేను ఏమన్నా మామూలు మనిషినా చనిపోవడానికి నేనే నీ గురువును.. నీవు శిరిడీ రా అని పిలిచారు. ఈ మాటలకు దూబేకు మెలుకువ వచ్చింది. అతడు ఎలాగైనా శిరిడీ చేరాలని పనిని వదిలేసి శిరిడీ బయలుదేరి వచ్చాడు.

12/24/2017 - 23:24

వెంటనే మంచినీరును తీసుకొచ్చి బాబాకు ఇచ్చారు. మంచినీరు తాగుతుంటే వాటిని మింగలేకపోయారు.
అక్కడే కన్నీరు కారుస్తూ చూస్తున్న లక్ష్మీబాయిని దగ్గరకు రమ్మని సైగ చేశాడు. ఆమె బాబా దగ్గర దాకా వచ్చింది. ఆమె తలపై చేయిపెట్టి ఆశీర్వదించినట్లు చేశారు. అంతేకాదు 5 రూపాయలు ఇచ్చారు. మళ్లీ 4 రూపాయలు తీసి ఇచ్చారు. ‘అమ్మా! లక్ష్మీభాయి ఇవి నీదగ్గర ఉంచుకో నీకు మేలు జరుగుతుంది’అన్నారు.

Pages