S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భక్తి కథలు

12/23/2017 - 18:37

‘బాబా మీరు స్వయంగా భగవానులే. కాని మిమ్ము పోల్చుకునే శక్తి నాకెక్కడిది. అందుకే మీరీ శరీరంతోనే నా దగ్గరే ఉండండి. అంతేకాని నాకు దూరంగా కనిపించకుండా ఉంటే నేను బతకలేను’అన్నాడు.
బాబా చిరునవ్వుతో చూశారు.

12/22/2017 - 18:53

‘తాత్య నీకోసమని, నాకోసమని రెండు ఊయలలు తెప్పించాను. కాని చూస్తూ చూస్తూ నిన్ను ఊయలలో కూర్చోబెట్టలేక పోతున్నాను. అందుకే నీవు ఇక్కడే ఉండు. నేనొక్కడినే ఊయలనెక్కుతాను ’అన్నారు.
తాత్యకు బాబా మాటలేమీ అర్థం కాలేదు. కాని బాబా ‘నేనే ముందు వెళ్తాను. నీవు నా తర్వాత రా’అని అన్నాడు.

12/21/2017 - 19:21

రామవిజయం అనే గ్రంథాన్ని తీసుకొని వచ్చి చదివి నాకూ వినిపించు’అని చెప్పారు. వెంటనే వాఝే రామవిజయం తీసుకొని వచ్చి ప్రతిరోజు కాసేపు బాబా దగ్గర చదువుతుండేవారు.

12/20/2017 - 19:39

అంతలో రామదాసు వచ్చాడు. సోనాముఖి ని బాబాకు ఇచ్చాడు.
‘రామదాసు చూసుకొన్నావు. నీ విష్ణు సహస్రనామావళి పుస్తకాన్ని ఈ శ్యామా దొంగతనం చేసి తీసుకొన్నాడు.’అన్నాడు.
శ్యామా అయోమయంగా చూశాడు. రామదాసు ఎక్కడలేని కోపం తెచ్చుకున్నాడు.

12/19/2017 - 18:51

తరతరాలు కూర్చుని తినేంత ధనం నాకు భగవంతుడు ఇచ్చాడు. చదువు, సంధ్య కూడా నాకు అబ్బాయి. కాని, నాకు ఆత్మ జ్ఞానం ఒక్కటి రావడంలేదు. దాన్ని మీరు దగ్గర తీసుకొందామని చాలా దూరం నుంచి ప్రయాస పడి వచ్చాను. మీరు నాకు ఆ ఆత్మజ్ఞానాన్ని బోధించండి ’అని అడిగాడు.
బాబా విననట్లే ఉన్నారు.
అంతలో బాబా ‘మహీ! నాకు ఓ ఐదు రూపాయలు కావాలి. నీవు వెళ్లి లక్ష్మీబాయిని అడిగి తీసుకొనిరా’అన్నారు.

12/17/2017 - 23:10

నీవు నమ్మక పోతే ఇదిగో నీ కోర్టు ఉత్తరువు’అని ఇచ్చాడు. దాన్ని చూడగానే అన్నాచించనీకర్ కు చాలా బాధవేసింది. ఏమిటి మనమిన్నాళ్లు ఈ బాబా నే నమ్ముకొని ఉంటే చివరకు మనం ఓడిపోయేట్లు చేస్తాడా అని ఆక్రోసించాడు. వెంటనే మసీదు కు బయల్దేరి వెళ్లి బాబాను కోపంగా చూస్తూ ‘‘బాబా నీవేమీ చేయలేవా.. ఇదేనా నీవుచేసింది’’ అని గట్టిగా అడిగాడు.

12/16/2017 - 18:39

దొంగలు సర్వం దోచుకుపోతారు. ధనము, శరీరము ఏవీ శాశ్వతం కాదు. ఇది గుర్తుంచుకో. సుఖాపేక్ష వదులు. నీ సన్యాసధర్మాన్ని నీవు పాటించు’అని గట్టిగా చెప్పారు.
విజయానందుడు కూడా ఇక మారు మాట్లాడలేదు. వౌనంగా తన బసకు వెళ్లాడు.

12/13/2017 - 19:24

బడేబాబా ఊరుకొండిపోయాడు. ఇదేంటి ఇంత ముసలి మేక ను చంపమని చెప్తున్నారు. పాపం రక్షణ కోరి ఈ మేక బాబా దగ్గరకు వచ్చి ఉంటుంది. ఇపుడు ఈ మేకను బాబానే చంపమంటే ఇక దానికి దిక్కు ఎవరు అని మనసులో అనుకొంటూ దూరంగా జరిగిపోయాడు. అంతలో ఆచారవంతుడైన కేల్కర్ వచ్చాడు. వెంటనే బాబా‘కేల్కర్ ఇలా రా లక్ష్మీబాయి దగ్గరకు వెళ్లి కత్తి తీసుకొని వచ్చి ఈ మేకను ఒక్కదెబ్బతో చంపేసేయి’అని చెప్పారు.

12/12/2017 - 18:16

పిల్లలంతా కలసి మెలసి ఉండచ్చు అని ఎంతో కేరింతలు కొట్టి ఆడుకుంటున్నారు. కాశీ ఇదంతా బాబా మహత్వం. నేను నన్ను కాపాడమని బాబాను వేడుకున్నాను. కాని మనలందరినీ బాబా నే కాపాడాడు అని చెప్పాడు. ఇపుడు బాబా దర్శనం చేసుకొని వస్తాను అని బయలు దేరాడు కాశీ. మేము వస్తామని ముగ్గురు అన్నదమ్ములు కాశీ వెంట వెళ్లారు. వారిని చూసీ చూడగానే ‘ఆహా! రామలక్ష్మణ భరత శత్రుఘు్నలు నలుగురూ వస్తున్నట్టు ఉన్నారే.. మీ సమస్య తీరిందా.

12/10/2017 - 20:24

ఈ వారం రోజులు కూడా రామాయణం గురించి చెప్పాలని అనుకున్నట్టు చెప్పారు. వారికి దాసగణు నేనే వారంరోజుల పాటు రామాయణం చెప్తానని మాటిచ్చాడు.
***
శివకాశీ దాసగణు చెప్పే పాదుకాపట్ట్భాషేకానికి వెళ్లాడు.
దాసగణు అనర్గళంగా చెప్తున్నారు. అందరూ తలలూపుతూ వింటున్నారు. దాసగణు..

Pages