S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భక్తి కథలు

06/02/2016 - 21:52

ప్రద్యుమ్నుణ్ణి దగ్గరకు రప్పించుకొని మణిపర్వత శృంగాన్ని పారిజాత తరువును యధోచితంగా ప్రతిష్ఠించవలసిందని కోరాడు. బంధువులందరూ పారిజాత తరువును చూసిన సంప్రహర్షం చెందగా వాళ్ళందరకీ తమ తమ పూర్వ జన్మల స్మరత్వం సమకూడింది. అది ఈ దివ్య భూరుహం ప్రభావం అనుకున్నారు వారంతా.

06/02/2016 - 05:33

వాళ్ళపై శ్రీకృష్ణుడు విల్లు ఎక్కుపెట్టగానే వాళ్ళు అమిత భయసంత్రస్తులైనారు. పరుగు పరుగున పోయి ఇంద్రుడికి ఈ వార్త చేరవేశారు. ఇంద్రుడికి ఆయన దివ్యమహిమ, త్రైలోక్య రక్షణ తత్పరత్వం బాగా తెలిసి ఉన్నప్పటికీ, ఆ మహాప్రభువు పారిజాత తరువు పెరికి తీసుకొని పోవటానికి మనసు సమాధానపరచుకొన్నప్పటికీ, ఉండబట్టలేక అది తన ఇల్లాలకు అత్యంత ప్రీతిపాత్రమైనది కాబట్టి వదులుకోలేక తన సేనతో వచ్చి ఆయనను అడ్డగించాడు.

05/31/2016 - 22:31

నీసౌందర్యం, నీ సౌభాగ్యం, నీ పతివాల్లభ్యం లోకంలో అసదృశం. మాకీ ఉపకారం చేసినందుకు నీ కోర్కె ఏదైనా తీర్చాలని నా మనసు ఉవ్విళ్ళూరుతున్నది ఏం కోరుకుంటావో కోరుకో అని లాలనగా సత్యభామమనడిగింది శచీదేవి. అపుడా వనజాక్షి ఎంతో వినమ్రతతో ‘నాకేమి లోటుందని నిన్ను అడగను! నాకెటువంటి కొరతా లేదు. నీ నెయ్యం నా పట్ల ఉంటే నాకదే చాలు’ అని చెప్పింది.

05/30/2016 - 07:15

ఇంకా ఏమైనా మీ సేవలో మేము చేయవలసిన పనులు ఆజ్ఞాపించవలసింది అని చెప్పగా నరజనాభుడు ఎంతో సమ్మోద మనస్కుడైనాడు. చంద్రకాంతులతో తేజరిల్లుతున్న వరుణ ఛత్రం తానే చేతిలోకి తీసుకున్నాడు. తక్కిన ధన కనక వస్తు వాహనాలను, గజాశ్వాలను, పశు సంపదను ద్వారకా నగరానికి చేర్చవలసిందిగా నరకుడి అధికార సేవ పరివారానికి ఆజ్ఞాపించాడు.

05/28/2016 - 22:49

ఇట్లా నరకాసురుడు మూర్ఖంగా ఎగతాళి చేయటం సహించక సత్యభామ వెంటనే నరకుడి చేతిలో విల్లు ముక్కలు చేసింది తన తీవ్ర నారాచంతో. రథాన్ని మరో పది బాణాలు వేసి తుత్తునియలు చేసింది. రథటెక్కెం నేలకూల్చింది. దీనితో నరకుడు రెచ్చిపోయినాడు. మరొక ప్రశస్తమైన విల్లు తీసుకొని ఆమెపై శరపరంపర కురిపించాడు. సత్యభామ ఏ మాత్రం చెదరక, బెదరక నరకుణ్ణి నిరాయుధుణ్ణి చేసింది.

05/27/2016 - 22:29

మేరు పర్వతం చరియపై మహామేఘం ఒకటి జడివాన కురిపించినట్లు గరుత్మంతుడిపై అధిరోహించి ఉన్న శ్రీకృష్ణ, సత్యభామలను వాళ్ళు బాణవర్షంతో కప్పివేశారు. అపుడు వైనతేయుడు తన రెక్కలు విదిల్చి ఆ బాణ పరంపరలను తునాతునకలు చేశాడు. శ్రీకృష్ణుడు తన పంచాయుధాలు ప్రయోగించి అశేష రక్కసి సమూహాలను పొలియింపజేశాడు.

05/26/2016 - 21:45

ప్రాగ్జ్యోతిష పురానికిప్పుడే నేను నిన్ను తీసుకొనిపోతాను దేవా! సిద్ధం కావలసింది అని ఇంద్రుడు శ్రీహరికి విన్నవించాడు. శ్రీకృష్ణుడు, వెంటనే సత్యభామా దేవికి వర్తమానం పంపించి ఆమె రాగానే ఇద్దరూ గరుఢారూఢులైనారు. ఇప్పుడే మునులు, ఋషులు కూడా ద్వారకకు వచ్చి నరకుడి దుండగాలు నాకు తెలియజేశారు.

05/25/2016 - 23:01

అ ప్పుడు మునులు ఆయననిట్లా స్తోత్రం చేశారు. ‘జయ జయ జగదీశా, జయ జనార్దన, జయ సర్వ వంద్య, జయ జయగోవింద, జయకృష్ణ, జయ గోపాలబాల, జయ నర మృగ శుభా, కారా, జయ జయ సర్వజ్ఞ, జయ హృషీకేశ, జయ నారాయణ, జయ సరోజాక్ష’ అని స్తుతిస్తూ మా వెతల బాపవలసిందని వేడుకున్నారు. ‘నీవు విషణ్ణుడవు అయితే లోకాలు బెగడొందుతాయి. సకల చరాచర జగద్రక్షకుడివి నీవు. లోక స్థితికర్తవు, గుణత్రయ విభాగ శాసకుడవు. ఆదిదేవుడవు, అచ్యుతడవు.

05/24/2016 - 21:53

ఆ సభలో అప్పుడు శ్రీకృష్ణ, బలరాముల కుమారులు, వృద్ధమంత్రులు, మహారాజ్య హిత చింతకులైన బ్రాహ్మణోత్తములు ఉన్నారు. దివ్య కిరీట విరాజితుడు, కౌస్త్భు వక్షాలంకృతుడు, పయోదకాంతి కలిత నీలాంబరుడు, కనకాంబరుడు, స్ఫారేంద్రధను వనమాలావిభూషితుడు, జలజాక్షుడు, జగదీశుడు, మందహాస సుందరుడు అయిన కృష్ణప్రభువును మునీశ్వరులు దర్శించి మనఃప్రీతి పొందారు.

05/22/2016 - 21:50

లెక్కలేనంతమంది బ్రాహ్మణులను చంపివేశాడు. తపస్వులనూ పెట్టిన బాధలు ఇన్నీ అన్నీ కావు. వివిధోపాయాలు పన్ని క్షత్రియులను నురుమాడాడు. ప్రజలను ఘోష పెట్టాడు. తన ముఖ్య కర్తవ్యం ఏమిటంటే ధర్మ వినాశనమే అన్నట్లు ప్రవర్తించాడు.

Pages