S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భక్తి కథలు

11/28/2017 - 18:32

నన్ను క్షమించుబాబా. నీవే కాపాడాలి. బాబా నన్ను క్షమించు’’అని మనసులో కిరణ్ బాయి పదే పదే అనుకొంటూ ఉంది. ఆమె కళ్లు నీళ్లతో నిండి పోయింది. అవే ధారాపాతంగా కారిపోతున్నాయి. నేను తప్పు చేసాను. తీసుకోకుండా ఉండాల్సింది అని అనుకొంటూ ఉంది. అంతలో
‘‘కిరణ్ బాయి ఇలా రా!’’ అని బాబా పిలిచారు.

11/26/2017 - 21:09

ఇక ఏమీ మాట్లాడలేదు. అక్కడి వారు గుసగుసలాడారు. ఎవరికో ఏదో కష్టం వచ్చి ఉంటుంది. బాబా వారిని కాపాడిఉంటారు అనుకొన్నారు.
అంతలో బాబాకు టెలిగ్రామ్ వచ్చింది. మహిల్సాపతి తీసుకొని దానిలో ఉన్నది ఇలా చదివాడు

11/25/2017 - 18:48

ఆ చెక్కపలకకు నాలుగు వైపులా పాత గుడ్డలుకట్టి దూలానికి కట్టి ఉంది. బాగా పైకి కట్టివున్నారు. పైగా ఆ చెక్క నలుమూలలా నాలుగు ప్రమిదల్లో దీపాలు వెలుగుతున్నాయి. వాటి మధ్యలో బాబా పడుకుని వున్నారు. ఆ దృశ్యాన్ని చూడగానే వారికి నోట మాట రాలేదు. బాబా పొడవుగా ఉండేవారు. కాని ఈ నాలుగు మూరలు లేని చెక్క బల్లపై ఎలా సరిపోయారు. పైగా అది పైకి కట్టి ఉంది. దానిపైకి ఎలా ఎక్కారు నాలుగు దీపాలు ఎందుకు పెట్టుకున్నారు.

11/24/2017 - 18:52

పరమాత్మ అంటే ఒక్క దగ్గర ఉండేవాడు కాదు. సర్వాంతర్యామి. అతడు అన్ని చోట్ల అన్ని వేళలా అన్నింటిలోనూ ఉంటాడు.
భగవంతుడు నీలో నాలో కూడా ఉన్నాడు. ఆ పశువుల్లోను, చీమల్లోను దోమల్లోను కూడా ఉంటాడు. భగవంతుడు లేనిది ఏదీ లేదు.ఇపుడు నన్ను అవధూత అన్నవారు కూడా భగవంతుని స్వరూపాలే. నీవు అన్నింటికీ కారణాకారుడు భగవంతుడు అని అనుకోండి అపుడు అన్నీ నీకే తెలుస్తాయి అన్నాడు.

11/23/2017 - 17:55

ఎవరైనా సరే ఉదారంగా బతకటం నేర్చుకోవాలి. ఇవ్వడంలోని ఆనందాన్ని రుచి చూడాలి. ఒకవేళ దాని రుచిచూస్తే చాలు అందరూ ఇవ్వడం నేర్చుకుంటారు. నీవు కూడా కావాల్సిన తీసుకొని మిగతా ఎవరికైనా ఇవ్వు ’ అని చెప్పాడు.

11/22/2017 - 19:26

కళ్లు అన్నింటినీ చూస్తాయి. కాని మనసు బుద్ధితో ఆలోచించి ఏది మంచిదో ఏది చెడ్డదో తెలుసుకొంటుంది. ఆ విచక్షణ మనిషికి ఉంటేచాలు. భగవంతుడు మనిషి కిచ్చిన నైపుణ్యంతో ఎంత మంచి శిల్పకళను, చిత్రకళను చిత్రించాడో అని భగవంతుని చాతుర్యాన్ని చూచి అబ్బురపడవచ్చు. ఇలా ఇంకా ఏదో బాబా చెబుతున్నారు.

11/21/2017 - 18:43

కోపతాపాలన్నింటికీ కారణం ఒక్క మమకారమే. మనుష్యులు ఇది నాది అది నీది అని తారతమ్యభేదాలు కల్పించుకుంటుంటారు. దానివల్ల వారికి కోపం వస్తుంది. కోపం వల్ల బాధ కలుగుతుంది. ఆ బాధతో అనేక వ్యసనాలు దరిచేరుతాయి అన్నారు బాబా.
బాబా ఎపుడు ఎందుకు ఏమి చెబుతారో అప్పటికప్పుడు తెలీక పోవచ్చు. కాని రాబోయే కాలంలో వారికి బాబా చెప్పిన విషయం స్పష్టంగా కనిపిస్తుంది.

11/19/2017 - 22:22

మహిల్సాపతి‘‘అట్లా ఏమీ బాధపడకు నానా! బాబా భూత వర్తమాన భవిష్యత్తులు తెలిసున్నవారు కదా. ఎపుడు ఏమీ జరుగుతుందో నని నీకు ముందు జాగ్రత్తగా చెప్పారేమో. అదీకాక ఒక్కోసారి బాబా ఇంకెవరికైనా చెప్పాలని అనుకొన్నా ఆ విషయానే్న ఎదుటి వాళ్లకు చెబుతూ ఉంటారు. దీని గురించి అంతగా ఆలోచించకు ’అని అన్నాడు.
ఆ తర్వాత నానా బొంబాయి వెళ్లిపోయాడు. రోజులు సాఫీగా జరిగిపోతున్నాయి.

11/18/2017 - 17:51

ఇలా బాబా చెప్పగానే అక్కడున్న ముగ్గురు ఎవరికి వారు నిజమే కదా. నేను ఇంతగా ఆలోచించలేదు. సేవ చేస్తున్నానని అనుకొన్నాను కాని నిజమైన గురుసేవ ఇంకా చేయలేదు అని నుకొన్నారు.

11/17/2017 - 18:57

నిజమైన గురువు ఎవరో తెలుసుకోగలగాలి. గురువును ఆశ్రయించిన వారికి ఎట్టి కష్టాలుండవు. గురువును ఆశ్రయించడం అంటే గురువు ఏది చెప్పితే దానే్న సందేహం లేకుండా ఆచరించగలగాలి. నీకు తెలుసు కదా పద్మపాదుని సంగతి. ఆదిశంకరాచార్యులు నదికి ఆవలి ఒడ్డున ఉండి తన శిష్యుడిని ఇలా త్వరగా రా అని పిలవగానే అతడు అది నది అని గాని ఎల వెళ్లడం అని కాని ఆలోచించలేదు. అలాగే నడుచుకుంటూ వెళ్లిపోయాడు.

Pages