S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భక్తి కథలు

02/10/2016 - 21:15

నీవు లోకం పట్ల కృపతో లోకానుగ్రహంతో అవతరిస్తూ ఉంటావు. హిరణ్యాక్షుడనే క్రూర రక్కసుడు భూమిని సముద్రంలో ముంచగా యజ్ఞ వరాహమూర్తివై ఉద్ధరించావు. నీ ప్రియ భక్తుణ్ణి రక్షించటానికి నరసింహమూర్తిగా నీ వాడి చేతి గోళ్ళతో హిరణ్యకశిపుణ్ణి చీల్చి వేశావు. త్రివిక్రమావతారంలో బ్రహ్మాండాన్ని మూడడుగులతో ఆక్రమించావు. పరశురాముడివై సహస్ర బాహుడి గర్వోద్ధతి నణచివేశావు. క్షత్రియుల దర్పం నిర్మూలించావు.

02/08/2016 - 00:51

తక్కిన గోపకులు తమ ఆట పాటలలో నిమ్నమై ఉండగా వామదేవుడు, భరద్వాజుడు అనే మునిశ్రేష్ఠులు తీర్థయాత్రలు చేస్తూ అక్కడకు వచ్చారు. ఆ వట వృక్షానికి నమస్కరించి ప్రదక్షిణలు చేశారు. సమీపంలో ఆవులను కాస్తున్న గోప బాలకుల దగ్గరకు వెళ్లి ‘నాయనలారా! ఇక్కడ స్నానం చేయటానికి అనువైన రేవు ఏదో మాకు చెప్పండి.

02/07/2016 - 01:21

ఆయురాగోగ్య సుఖ సంపదలతో, ఇష్టకామ్యసిద్ధితో మేమంతా పరమ సంతుష్టులంగా ఉన్నాము. నీవిచ్చినవన్నీ నాకు ముట్టినట్లే అనుకో అని సాదర ప్రియ వచనాలతో నంద యశోదలు కోడలును తమ వెంట బెట్టుకొని ప్రయాణమైనారు. ‘శ్రీ్ధముడు కూడా నా వెంట రావాలి, నేను నా ప్రియసఖుణ్ణి విడిచి ఉండలేను’ అని అత్తమామలకు నచ్చచెప్పి తన మేనమరిదిని కూడా వెంట తీసుకొని నీలతో, నీలవర్ణుడు బృందావనం చేరుకున్నాడు.

02/05/2016 - 20:31

పాపాత్ములారా! మిమ్మల్ని అంతమొందిస్తాను అని హేలగా వాటిమీదికి ఉరికాడు కృష్ణుడు. ఇంత కాలానికి మా కోరిక తీరబోతున్నదని పూర్వ వైరం తలపుకు వచ్చి మహా రోషంతో అని కృష్ణుణ్ణి చుట్టుముట్టాయి. రంకెలు వేస్తూ గిట్టలు నేలమీద ధట్టిస్తూ అవి ఆయనను పొడవటానికి వచ్చాయి.

02/05/2016 - 06:52

తన భుజ పరాక్రమమూ, బాహుబలాటోపమూ గొప్పగా పొగడుకున్నాడు. వజ్రాహతి వంటి నా చేతి చరుపులకు కొండలు కూలిపోయినట్లు ఈ దుండగపు ఆబోతులను చెండాడుతాను అని భుజాలు చరచుకున్నాడు. అక్కడి మైదానంలో కృష్ణుడు ఎట్లానైనా తమ మీదికి వస్తాడని కళ్ళ నిప్పులు రాలుస్తూ ఘోరంగా రొప్పుతూ రోజుతూ ఎదురు చూస్తున్నాయి ఆంబోతులు.

02/04/2016 - 04:58

ఇంతలో రాత్రి అయింది. మెల్ల మెల్లగా చీకట్లు ఆవరించాయి.

02/03/2016 - 21:28

ఎటువైపూ పోనీయకుండా చుట్టుముట్టి పట్టుకునే ప్రయత్నాలు చేశారు. కాని ఎటువంటి ప్రయత్నాలకు అవి లొంగలేదు. అంతేకాక పట్టవచ్చినవారిని, బంధించటానికి సమీపించినవారిని ఎన్నో చిక్కులపాలు జేస్తూ వచ్చాయి. కొందరిని గాయపరిచాయి. కొందరిని హతమార్చాయి. పొగరుబోతుతనంతో అవి మరింత విజృంభించాయి. రంకెలువేస్తూ చెలరేగాయి. ఎవరూ వాటి జోలికి వెళ్ళళేకపోయినారు. వాటి దర్పోద్ధతిని అణచలేకపోయినారు.

01/31/2016 - 22:54

బంధువులూ, వివిధ దేశాల శ్రీమంతులైన సాటివారూ, ఆమెను తమ కోడలిగా చేసుకుందామని ఉవ్విళ్ళూరుతున్నారు. పడుచు గోపాలురు తమ అదృష్టాన్ని నిరీక్షించుకుంటున్నారు. పరీక్షించుకుంటూ ఉన్నారు. కాని వాళ్ళ ఆశలు నెనరవేరలేదు.

01/30/2016 - 22:16

వర్షఋతువు రాకతో సూర్యుడూ చంద్రుడూ కూడా తమ పరువు పోగొట్టుకొని మరుగుపడిపోతున్నారు. మేఘాలు దట్టంగా ఆకసాన్ని ఆక్రమించుకోవటం వల్ల పగలూ రాత్రీ కూడా ఒక విధంగా ఉంటూ వచ్చాయి.

01/29/2016 - 23:05

అప్పుడందరూ వెళ్లి యమునలో తనివితీరా జల్లులాడారు. ఈతలు సాగించారు. వినోదంగా ఈత పందాలు నిర్వహించుకున్నారు. నీటి ప్రవాహం మీద సంగీత వాద్యాలు సృష్టించారు.

Pages