S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డైలీ సీరియల్

05/25/2017 - 08:47

మొదటి రాత్రికి ఆడపిల్లలే కాదు, మగ పిల్లలు కూడా నెర్వస్ అవుతారన్నమాట. హమ్మయ్య అనుకున్నాను.
నా చేతులు అతని చేతుల్లో ఉండిపోయాయి. మధ్య మధ్య అరచేతుల్లో చందమామను అతని పెదిమలు స్పృశిస్తున్నాయి.

05/23/2017 - 23:00

ఆ రోజు మాత్రం నాకు నిన్న మొన్న జరిగినంత వివరంగా గుర్తు ఉంటుంది. ఇప్పటికీ నాకు నీళ్ళు అంటే భయమే! అని నవ్వాడు. అతని నవ్వును చూస్తూ ఎంతసేపైనా గడపవచ్చు అనుకున్నాను.

05/22/2017 - 21:15

ఆ ఇంట్లో నా ఉనికికి ఓ ప్రత్యేకత ఉంది. అన్నయ్యలంతా ఇంట్లోంచి వెళ్లిపోయారు ఉద్యోగాల రీత్యా. అక్కయ్యలు, బావలు, కలకత్తాలో ఉంటారు. పెద్దన్నయ్య కుటుంబం ఒక్కటే నాన్నతో ఉంది. ఇంట్లో గారాలు సాగించేది అన్నయ్య కొడుకు, నేనే! అన్నయ్య కొడుకు వేరే లెవెల్. వాడు మనుమడు, వాడిదంతా ఓ యువరాజు భోగం.

05/22/2017 - 01:46

‘‘మొదటి షరతే, వాళ్ళ అమ్మాయికి నచ్చితే వారంలో పెళ్లి చేయాల్సి వస్తుందని. నేను ఎవరితోనూ అనలేదు. అంతా కుదిరినపుడు కదా! అని. ఇప్పుడు మనం వెనక్కి వెడితే బాగుండదు’’ అన్నారు.
నాకేం మాట్లాడాలో తోచలేదు.
‘‘ఏం సాకు చెప్పమన్నావు వాళ్ళతో. మా అమ్మాయికి అబ్బాయి నచ్చలేదనా?’’ నవ్వుతూ అడిగాడు నాన్న.

05/19/2017 - 23:09

నిజానికి ఆవిడ నాకు పెద్ద వదిన. అయినా మంచి ఫ్రెండ్. మంచి గైడ్. ఆవిడ మాట ఎప్పుడూ వింటాను. నేనేమిటి మా ఇంట్లో అందరికీ ఇష్టమే ఆవిడ మాట వినడం. అమ్మ వచ్చి వరండాలోకి రమ్మంది. మామూలుగా వెళ్లాను.

05/19/2017 - 23:18

నా జీవితం! నా జీవితం! ఏమిటా జీవితం- ఏమో! దాన్ని గురించి ఆలోచించడం ఏనాడో మానేశాను. ఎప్పుడూ కావలసినంత పని, చేతినిండా పని లేకపోతే ఖాళీ. ఈ రెంటి పోరాటంలో నడిచిపోయింది. నా పని అంటూ ఎప్పుడూ ఉండేది కాదు. అలా అని ఖాళీగా కూర్చునేదాన్ని కాదు! నేనే కాదు నన్ను ఖాళీగా ఉంచటానికి ఇంట్లో ఎవరూ ఇష్టపడేవారు కాదు!

05/17/2017 - 22:44

అది ఎయిర్ ఇండియా ప్రయాణికులు వెయిట్ చేసే లాంజ్, ప్రయాణీకుల్లో చాలాభాగం భారతీయులే! కొద్దిమంది మాత్రం ఫారినర్స్ ఉన్నారు.

05/16/2017 - 21:35

‘‘ఈ ప్రయాణం 30 ఏళ్ళ క్రితం జరగాల్సింది’’ అన్నాడు తనే తిరిగి. వౌనం వహించాను. అన్నయ్య వంక చూచాను. అన్నయ్యకి కూడా కొంచెం బాధగానే ఉంది. కాని, ఎప్పుడూలాగానే బయటపడడు.
నాకు మా అన్నయ్యలతో ఉన్న అనుబంధం అందరి ఆడ పిల్లల లాంటిదీ కాదు. అందరి ఆడపిల్లలలా నా జీవితం సాగలేదు. పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళడం, సొంత కాపురం లాంటి సామాన్యమైన అనుభవాలు నాదాకా రాలేదు.

05/14/2017 - 21:08

కొత్త సీరియల్ ప్రారంభం

**

టాక్సీ ఎయిర్‌పోర్ట్ ముందు ఆగింది. ఇంత దూరంగా ఆపావేమయ్యా అని అన్నయ్య దబాయించాడు.

‘‘ఇంతే సర్! ఇంతకంటే ముందుకు పోనీయరు’’ సమాధానమిచ్చాడు టాక్సీవాల!
‘‘సామాను లోపలకు తీసుకువెళ్ళమన్నారా’’ అంటూ నలుగురు చుట్టుముట్టారు. మరొకడయితే ట్రాలీ తీసుకువచ్చి జబర్దస్తీగా సామాను దానిమీద పెట్టేశాడు.

05/13/2017 - 21:42

అయితే.. అది ఉద్దేశ్యపూర్వకంగా చేసేవి ఎలా కావో ఇదీ అంతే.. నాకు తెలిసీ సాహూ సార్.. ప్రత్యక్షంగానో పరోక్షంగానో చంపినవాళ్ళలో.. ఒక్క అమర్, కమల్ తప్ప అంతా నేరస్థులే.. ఇంకో విషయం.. ఆయన ట్రైనింగ్ సెంటర్‌కి వచ్చినప్పటినుండి.. ట్రైనీస్‌లో ఏ ఒక్కరైనా నేరప్రవృత్తి కలిగి వుంటే.. వాళ్ళు ఏదో రకంగా ఫినిష్ చెయ్యబడ్డారే తప్ప ట్రైనింగ్ పూర్తిచేసుకుని జనంమీదకు వెళ్ళలేదు..

Pages