S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డైలీ సీరియల్

12/11/2018 - 21:54

తండ్రికి అన్యాయం జరిగిందన్నకోపంలో వళ్లుమరచి, ఆవేశంలో ఏదో ఆలోచించాడు కానీ, కొండదేవర-దేవరకు మహత్మ్యం లేకపోతే విశ్వసృష్టి ఎలా జరిగేది?’’ ఎలా మనుగడ సాగించేది?
దేవుడ్ని శంకించినందుకు తనను తానే నిందించుకున్నాడు. అంతలోనే భయం వేసింది. తలెత్తి, నల్లకొండ వైపు చూశాడు నాయక్!
కోపంగా వున్న కొండదేవర ఊహలో కనిపించాడు!
సందేహం లేదు!
తననలా, తప్పని వారించింది కొండదేవరే!

12/11/2018 - 18:46

ఆత్మను చంపుకొని దళారీలతో రాజీపడుతూ శ్రమశక్తిని కారుచవుకగా దోపిడి వర్గాలకు ధారపోస్తూ క్షణమొక యుగంగా బ్రతుకులీడస్తున్నదా-
సంకటి ముద్దలకోసమే!
అలాంటి సంకటిభాండానే్న బ్రద్ధలు చేశాడు వాల్యా.
లక్ష్మీబాయికోపం కట్టలు తెంచుకుంది.
ఆవేశం అవధులు దాటింది.
ఉత్తుంగ తరంగాలుగా ఎగసిపడ్డ ఆగ్రహం ‘నిగ్రహం’ అనే చెలియలికట్టలు దాటి, పుత్ర వాత్సల్యాన్ని కూడా ముంచెత్తి-

12/09/2018 - 22:46

బైనెట్లతో పొడుస్తున్నారు.
నిస్సహాయంగా బాధను భరిస్తూ, బాధ ఆవేదనై, ఆవేదన కోపమై కోపం క్రోధంగా మారి, అంతకన్నా చేసేదేమీలేక వాళ్ళమీద కాండ్రించి ఉమ్మేశాడు రెడ్డియానాయక్.
అతని కళ్ళు జ్వలిత జ్వాలలయ్యాయి. ఎర్ర మందారాలయ్యాయి.
ఒక్క అవకాశం చిక్కితే ఎంత బావుంటుందో!

12/07/2018 - 23:03

మీరీబాయి విసురుగా భర్త దగ్గరికి వెళ్ళింది.
‘‘రొండుబార్ల పొద్దెక్కింది. గూడెం నిదర లెగిసింది. తోటోళ్ళు అడివికెళ్ళినా దొరోరికింకా నిదరేనా... లెగు...లెగు వింక! లెగిసి, తొందరగా తానంజేసి అడివికెళ్ళు’’అన్నది చేత్తో భర్తను తట్టి పిలుస్తూ.
రెడ్డియా పూర్తిగా కళ్ళుతెరిచాడు. భార్యను చూస్తూ మురిపెంగా నవ్వాడు. లేచి కూర్చొని చుట్టూ చూసాడు!

12/06/2018 - 19:23

ఓ టేకు చెట్టుదగ్గర బాణావతు నిలబడి ఉన్నాడు.
వినమ్రంగా తల వొంగి టేకుచెట్టుకు నమస్కరిస్తూ, కొద్ది క్షణాలు వౌనం పాటించాడు.
నెమ్మదిగా కళ్ళుతెరచి ఆర్తిగా చూశాడు!
టేకు చెట్టు కాండం నిండా బెరడు పొడలు నెత్తుటి గాయాల్లా ఉన్నాయి.
విషాదంగా నవ్వాడు బాణావతు.
అతని చిత్తడి కళ్ళనుంచి అశ్రుకణాలు బొట్లుబొట్లుగా జారి చెక్కిళ్ళగుండా నేల తల్లిని స్పృశిస్తున్నాయి.

12/05/2018 - 19:43

కీ.శే.పెద్దిరెడ్డి కొడుకు పెంటారెడ్డి ఎవ్వరో అడవి పుత్రులకు తెలుసుకానీ, ‘మహాత్మాగాంధీ’ అంటే ఎవ్వరో తెలియదు.
‘‘సంతగౌరారమ్ ఊరి మద్దెగాల ఎత్తాంటి బొమ్మ లేదూ...!
‘గాంధీ’అంటే ఆయనే.. సాతంతరఁవ్ దెచ్చిండు. ఇయ్యాళ మనఁవిట్టా ఓట్లేత్తాన్నావంటే అదంతా ఆయన సలవే’’అని. తండావాళ్ళ సందేహం తీర్చాడు తండా పెద్ద!
తెల్లవారింది. గౌరారం వెళ్ళి, ఓట్లెయ్యటమే తరువాయి!

12/04/2018 - 19:07

ఎమ్మెల్యే పెద్దిరెడ్డితో కనీసం ఒక్క ప్రజాహితం కార్యక్రమాన్నైనా జరిపించాలన్న సంకల్పం దేవుడికి కలిగిందేమో, అమావాస్య అర్ధరాత్రి వేళ హఠాత్తుగా గుండెపోటుతో మృతి చెందాడు పెద్దిరెడ్డి.
‘‘ఒక ధృవతార రాలిపోయింది’’ అన్నాడు పార్టీ అధ్యక్షుడు.
‘‘రెడ్డిగారు చనిపోయారంటే నమ్మలేకపోతున్నాను’’ అన్నాడు ముఖ్యమంత్రి.
ఏది ఏమైతేనేం,

12/03/2018 - 19:05

వాళ్లు ఇంటి గుమ్మం ఎక్కుతుండగా బైక్‌మీద కొండబాబు, ప్రకాశం వచ్చేసరికి అతడికి పరిస్థితి అర్థం కాలేదు. ఏదో జరిగిందని మాత్రం అతడి మనస్సు కీడు శంకించింది.
భార్యని పిలిచాడు. భూదేవి గబగబా వచ్చి చూసింది. అప్పటికే ముందు గదిలోకి వచ్చారు తల్లి మాణిక్యమ్మ, మేనల్లుడు అనిరుధ్, హిమజ, సావిత్రి, ఆమె అత్తగారు. వాళ్ల వెనకనే ముఖం వేళాడేసుకుని ప్రకాశం వచ్చాడు కొండబాబుతో.

12/02/2018 - 21:56

‘‘ఇతను..’’ అని అనిరుధ్ అంటూండగానే..’’ కొండబాబుగారు.. అని నవ్వుతూ పూర్తిచేసింది హిమజ. కొండబాబు భార్య సావిత్రిని పరిచయం చేశాడు.
‘‘ఏదో సినిమాలో పాటలా వసంతకాలం రాకుండానే తొందరపడి ఒక కోయిల ముందే కూసినట్లు పెళ్లికాకుండానే అత్తారింటికి వచ్చేశాను..’’ అన్నది నవ్వుతూ హిమజ.
‘‘్ఛఛ! అదేం లేదు. కోయిల ఎప్పుడూ కూస్తుంటేనే ఏటెల్లకాలం వసంతకాలంలా ఉంటుంది..’’ అన్నది సావిత్రి.

11/30/2018 - 18:46

‘‘ఒరేయ్ కొండబాబూ.. పద్మని నేను అనుభవించిన మాట నిజమే.. ఒకసారే.. కానీ..’’ ప్రకాశం బెరుకుగా కొండబాబుకే వినిపించేటట్లు చెప్పాడు.
‘‘అయితే ఇపుడు నువ్వు కామ్‌గా ఎవరికీ తెలీకుండా డిఎన్‌ఎ టెస్టుకి ఒప్పుకో.. జస్ట్ అవునా కాదా అని నిర్థారించుకోవడానికే.. ఆ తర్వాత సమస్యేం ఉండదు.. ఆ గ్యారంటీ నేనిస్తాను.. ఒకవేళ నీ డిఎన్‌ఎతో అనిరుధ్ డిఎన్‌ఎ మ్యాచ్ కాలేదనుకో.. అసలు సమస్యే లేదు..’’ చెప్పాడు కొండబాబు.

Pages