S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డైలీ సీరియల్

11/18/2018 - 22:29

‘‘చెప్పానుగా.. వాడు ఎవరికీ ఏ రకమైన సహాయం చేయడు.. ఒకవేళ ఎవడైనా తనకి సహయం చేస్తే చేసినందుకు వాడిని సర్వనాశనం చేసేస్తాడు.. ఎందుకంటే వాడు ఎదిగిపోయి తనకి పోటీ అయిపోతాడన్న దుర్మార్గపు ఆలోచన వాడిది..’’
‘‘అంటే..’’ కొండబాబు సగంలో ఆగిపోయాడు, ఆ తర్వాత ఏం మాట్లాడాలో అర్థంకాక.
‘‘వద్దు.. వెళ్లిపోండి.. మీ ఊళ్ళో ఏదైనా చిన్న బడ్డీ హోటల్ పెట్టుకోండి, బాగుపడతారు..’’ చెప్పాడు పరమేశ్వరం.

11/18/2018 - 22:28

‘‘ఏంట్రా రెడీ అయిపోయావా?.. వచ్చేస్తాను పని నిముషాలు..’’ అని చటుక్కున లేచి గబగబా ఫ్రెష్ అయ్యారు. బట్టలు మార్చుకున్నాడు. ‘‘ఇప్పుడు మనం వాడి ఇల్లు చూసి వద్దాం..?’’ అన్నాడు లాడ్జి రూముకు తాళం వేస్తూ. అవునని తలూపాడు అనిరుధ్.

11/15/2018 - 18:46

మనిషి బక్కపల్చగా ఉంటాడు. కళ్లు లోతుకుపోయి ఉంటాయి. కానీ తీక్షణంగా ఉంటాయి. కాస్త ఎర్రగానూ ఉంటాయి. ముఖం ఎప్పుడూ సీరియస్‌గా ఉంటుంది. జుట్టు కొంత నెరిసి ఉంటుంది. దానికి ఎప్పుడూ తైల సంస్కారం లేదు. దువ్వడం అంటూ కూడా లేదు. వాడెప్పుడూ కాన్వాస్ బూట్లే వేస్తాడు. చేతులకి వాచీలు, ఉంగరాలు వగైరా ఏమీ ఉండవు. మనిషి ఎంత బక్కగా వున్నా మోటు పనులు బాగానే చేస్తాడు.

11/14/2018 - 19:00

అలా సిటీలో థామస్ ఓ అనధికార విఐపిగా చెలామణీ అవుతున్నాడు.
థామస్ దంపతులకి పిల్లలు లేరు. ఎందుకులే అదో లంపటం అన్నది అతడి భార్య జ్యోతీ థామస్. ఆమె అతడికి మొదటి భార్యా కాదు, అతడు ఆమెకి మొదటి భర్తాకాదు.
ఒక విధంగా చెప్పాలంటే వాళ్లిద్దరూ వాళ్ల దృష్టిలో మాత్రం సహజీవనం చేస్తున్న ఆదర్శ దంపతులన్నమాట!

11/13/2018 - 18:43

నే వచ్చిన దగ్గర్నుంచీ నువ్వు నాతోనే తిరుగుతున్నావు.. పాపం సావిత్రి అవస్థపడుతోంది షాపు, ఇల్లు చూసుకుంటూ..’’ అన్నాడు అనిరుధ్.
‘‘్ఫర్వాలేదురా.. తనకి అలవాటే.. నేను ఆ పని ఈపనీ అంటూ తిరుగుతుంటాను.. షాపు తనే మేనేజ్ చేస్తుంటుంది..’’ చెప్పాడు కొండబాబు.
‘‘రేపు ఉదయానే్న వైజాగ్ వెళ్లిపోదామా మరి?’’

11/12/2018 - 18:12

చల్లగాలి రివ్వున వీస్తోంది. పక్షులు ఇంకా గూళ్లకి చేరుకునే సమయం కాదు కాబట్టి ప్రశాంతంగా ఉంది వాతావరణం. చెట్ల నీడల్లోంచి ఎండ నేలమీద పడుతూ అక్కడక్కడ తెల్లటి పువ్వులు పరచినట్లుంది. వీళ్లకి కాస్త దూరంగా కాలేజీలు ఎగ్గొట్టి వచ్చిన జంటలు కూర్చున్నారు కబుర్లు చెప్పుకుంటూ. అలాగే ఏకాంతం కోసం వచ్చిన జంటలూ ఉన్నాయి.

11/09/2018 - 19:03

అనిరుధ్‌కి ఆ క్షణం. ఇంటికెళ్లగానే హిమజకి ఫోన్ చెయ్యాలనుకున్నాడు.
***

11/08/2018 - 20:24

‘‘ఆ విషయం మాకు తెలుసు.. అతడు ఏదైనా ఆసుపత్రిలో చేరితే అక్కడే ఆ పని చేయించేవాళ్లం.. అందుకనే ప్రస్తుతం మీ దగ్గరకొచ్చాం.. అతడి ఇంటి దగ్గర ఇలాంటివి కుదరవని మీకూ తెలుసు.. ఈ పని చేసిపెడితే మీకు ఏభై వేలు ఇస్తాం.. అతడు మీ ఇంట్లో పడుకున్నపుడు అతడికి తెలియకుండా బ్లడ్ శాంపిల్స్ లేదా గుజ్జుతో తలవెంట్రుకలు.. లేదా ఇయర్ బడ్స్‌తో శరీరంమీద గట్టిగా రాయడం కానీ చేస్తాం..

11/06/2018 - 19:45

‘‘సర్లే! ఇప్పుడా గోల ఎందుకుగ్గానీ... హిమజ గురించి ఆలోచించుకో..’’ అన్నాడు కొండబాబు బెంచీమీద బాగా వెనక్కివాలి కళ్లు మూసుకుంటూ.
***
బయటికి వెళ్లడానికి తయారై, ముందుగదిలో కూర్నుచ్నాడు అనిరుధ్. కొండబాబు అప్పుడే వచ్చాడు. అమ్మమ్మ ఇద్దరికీ టీ ఇచ్చింది.
‘‘మరో డాక్టర్‌ని చూద్దాం అన్నావ్?’’ అడిగాడు అనిరుధ్

11/05/2018 - 19:17

మరి నారాయణకీ, రాగిణికీ మధ్య వున్న సంబంధం ఎలాంటిదో అన్న డౌటొచ్చింది నాకు. వాళ్లిద్దరిమధ్య ఇల్లీగల్ కాంటాక్ట్ కనుక ఉంటే మన పని ఈజీ అవుతుంది.. లేకపోతే సాధ్యం కాదు.. ఇప్పుడు డ్రైవర్ మాటలతో నాకర్థమయ్యింది వాళ్లిద్దరిమధ్యా కాంటాక్ట్ ఉంది. అది మనకి ఉపయోగపడుతుందని.. ఇపుడు మనం నిస్సందేహంగా ప్రొసీడ్ అవ్వొచ్చు..’’ కొండబాబు వివరించాడు.

Pages