S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డైలీ సీరియల్

10/09/2018 - 19:18

ఇద్దరూ బైక్‌మీద బయల్దేరారు. ఇద్దరి మనస్సులలో తలా తోకాలేని ప్రశ్నలు, అస్పష్టంగా సమాధానాలు, ఆందోళనలు గజిబిజిగా ఉన్నాయి.
‘‘డిన్నర్ చేసి వెళదాం’’ అన్నాడు నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ, నిదానంగా బైక్ పోనిస్తూ.
‘‘అన్నం మిగిలితే పొద్దునే్న మా పిన్ని పులిహోర చెయ్యనా అంటుంది..’’ అంటూ కిసుక్కున నవ్వింది హిమజ.
‘‘్ఫర్వాలేదు. మార్నింగ్ పులిహోర టిఫిన్ చేసెయ్..’’

10/08/2018 - 19:05

‘‘నిజం హిమా!.. అది అక్షరాలా నిజం.. ఆయనే నా గురించి పట్టించుకోకపోతే ఈ అనిరుధ్ ఏ చిల్లకొట్లోనో, ఏ మెకానిక్ షెడ్‌లోనో పనిచేస్తూండేవాడు..’’
అవునన్నట్లు తలూపిందామె. అనిరుధ్ వౌనంగా ఉండిపోయాడు ఆ జ్ఞాపకాలు తలచుకుంటూ.
‘‘సరే! ఇప్పుడేం చెయ్యాలనుకుంటున్నావ్?’’ కొద్ది క్షణాలు పోయాక అడిగిందామె.
‘‘అనే్వషణ’’
‘‘అనే్వషణ?!’’

10/08/2018 - 01:40

గురుమూర్తిగారూ..’ అని బజ్జీలు తిన్నాక పిలిచాడు అనిరుధ్.
తనను అంత గౌరవంగా పిలవడంతో ఆశ్చర్యంగా చూశాడు గురుమూర్తి. అనిరుధ్‌ని అప్పుడప్పుడు చూసిన గుర్తేగానీ అంతగా తెలీదతడికి.
‘దాదాపు ముప్ఫైఏళ్ళ క్రిందట ఇక్కడ ఓ పిచ్చి అమ్మాయిపై రేప్.. అంటే అత్యాచారం జరిగింది గుర్తుందిగా..’ అన్నాడు అనిరుధ్.

10/05/2018 - 19:39

ఆ మాటకి ఆమెలో మళ్లీ ఇందాకటి ఆలోచనలు సుడులు తిరిగాయి.. ఒకవేళ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి వచ్చాడా అని. ఆమాట అడిగింది. ‘‘మీ వాళ్లకోవసం మన ప్రేమను త్యాగం చేయాల్సి వచ్చిందా?.. ఫర్వాలేదు అనిర్! చెప్పు.. నువ్వు ఏం చెప్పినా నేను రిసీవ్ చేసుకుంటాను.. ఏమీ అనుకోను..’’ అని.

10/04/2018 - 19:11

తమ ఇద్దరిమధ్యా ఎంతగా ప్రేమ ఉన్నా, తన చరిత్ర ఇది అని తెలిసిన తర్వాత కూడా హిమజ తనను గౌరవిస్తుందా? మునుపటిలా ప్రేమించగలుగుతుందా?- మరో భూతంలాంటి అనుమానం అనిరుధ్‌ముందు నిలబడింది.
ఆ ప్రశ్నకి అతడి మనస్సు కకావికలమైపోయింది. మళ్లీ అంతలోనే హిమజ అలాంటిది కాదనుకున్నాడు. అతడి మనస్సు అలా సమాధానపడడానికి ప్రయత్నించింది.

10/03/2018 - 19:47

ఇంక అక్కడ ఉండడం నాకెంత మాత్రం ఇష్టంలేదు. వాళ్లు నినే్నమైనా చెయ్యొచ్చు!... క్షేమంకాదని అనుకున్నాను. ఏ కూలి పనైనా చేసి నిన్ను పెంచాలనుకున్నాను. నా కూతురు... అంటే మీ అమ్మ పేరు పద్మ... మీ తాత ఇష్టంగా పెట్టుకున్న పేర్లు. వెంకటేశ్వరుని ఇల్లాలు పద్మావతీ అమ్మవారి పేరు... దాని గుర్తుగా నిన్ను పెంచి పెద్ద చెయ్యాలనుకున్నాను. నీ తండ్రి ఎవరన్నది తర్వాత విషయం!... అలా నిన్ను తీసుకుని ఇల్లువదిలి వచ్చేశాను.

10/02/2018 - 22:13

అప్పటికి ఐదోనెల గర్భిణి! గుండెలమీద పిడుగు పడ్డట్టయ్యింది...’
ఆమె చెప్పడం ఆపింది. ఆనాటి జ్ఞాపకాలు ఒక్కసారిగా ఆమెను ఉద్వేగానికి గురిచేశాయి. చేత్తో గుండెమీద రాసుకుంది నాలుగైదుసార్లు. అనిరుధ్ అచేతనంగా కూర్చుండిపోయాడు ఆమెనే చూస్తూ.

10/01/2018 - 19:27

గతంలో ఎన్నిసార్లు అడిగినా అమ్మమ్మ చెప్పలేదు. ‘ఆ ముదనష్టపోడు గురించి ఇప్పుడెందుకు?’అంటూ కసిరేది. అదే విషయం భయపడుతూ మేనమామని అడిగాడు. మేనత్తనీ అడిగాడు. ‘ఆ యెదవ గురించెందుకు... చచ్చాడు...’అనేవారే తప్ప అసలు విషయం ఎవరూ చెప్పలేదు.
తండ్రికి అన్నలో, తమ్ముళ్లో, అక్కలో, చెల్లెళ్లో ఉండాలికదా? వాళ్లెప్పుడూ ఎవరూ తమ ఇంటికి రాలేదు. వాళ్లెవరూ తనకి తెలీదు. అసలు ఎవరూ లేరా? సమాధానం లేని ప్రశ్న.

09/30/2018 - 22:29

జూనియర్ కాలేజీలో కొంతమేర, కాలేజీ జీవితంలో మరి కొంతమేర ఆ ధోరణి నుంచి బయటపడినా, ఇంకా అతడు బిడియస్థుడిలానే ఉండేవాడు.
హిమజ సాహచర్యంలో కొద్దిగా అంటిపెట్టుకున్న ఆ జడత్వం నుంచి దాదాపుగా ఇప్పుడు బయటపడ్డాడు.
ఇప్పుడు ఆమెతో సమంగా అనిరుధ్ గెంతులేస్తున్నాడు. జలపాతం నీళ్లలో ఇద్దరూ అలిసిపోయేలా కేరింతలు కొట్టారు.

09/28/2018 - 19:21

ఆడపిల్లలతో తనకి పరిచయాలు లేవు. టెన్త్ వరకూ సరే! ఆపైన ఇంటర్‌లోనూ తనకి ఆడపిల్లలతో పరిచయాలు లేవు. వాళ్లతో జల్సాలు చేయడానికి తనదగ్గర డబ్బులేదు. మంచి బట్టలూ ఉండేవి కావు.
ఇంజనీరింగ్‌లో ఆడా మగా బాగా కలివిడిగా ఉండేవారు. కేరింతలు, పిక్నిక్‌లు, పార్టీలు... కావలసినంత ఎంజాయ్‌మెంట్! కానీ అనిరుధ్ వీటన్నింటికీ దూరంగా ఉండేవాడు. అందరూ తనను ‘బుక్‌హాలిక్’ అని గేలిచేసేవారు. అదే నిక్‌నేమ్‌తో పిలిచేవారు.

Pages