S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డైలీ సీరియల్

12/07/2017 - 18:34

కొన్ని ద్వారాలకు రంగు రంగుల చక్కని ఆకృతులుగల పట్టు తెరలు, కొన్ని ద్వారాలకు పూసల మాలలు వేలాడగట్టారు. వాటిలోంచి లోపలకు వెళుతున్నా బైటకు వస్తున్న అవి కదిలి సున్నితమైన గలగల ధ్వనులు వినబడతాయి.
నడవల్లో, వసారాల్లో గోడలకు దివిటీలు పెట్టేందుకు కంచు దీస్తంభాలు ఎతె్తైన పీఠాలపై ఉంచారు. నేలపై సెమ్మెలుంచారు. రాత్రివేళ ఈ దీపాల్లో, దివిటీల్లో నూనె పోసి వెలిగిస్తే భవంతి దేదీప్యమానంగా వెలుగొందుతుంది.

12/06/2017 - 18:19

మోరీ మిరుమిట్లుగొలిపే సౌందర్యాన్ని, గుణాలనీ చూశాక, హృదయాన్ని చిందులు వేయించే మధుర కంఠాన్ని విన్నాక, ముగ్ధ మనోహరమైన ఆమె నృత్యాన్ని తిలకించాక అక్క ప్రభావితం అవక తప్పదు.

12/05/2017 - 18:33

‘‘ఆమెకు మన భవంతి శుభ్రంగా ఉంటేనే సరిపోదు. అలంకరణలతో కళాఖండంగా వెలుగొందాలి. ఎంత డబ్బైనా ఖర్చుచేద్దాం. కొత్త శిల్పాలు, తెరలు, ఆసనాలు, శయ్యలు కొందాం’’.
‘‘చిత్రం అలాగే కానీ నాదో మనవి. ఓ చోట సంగీత నాట్య ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నాను. మీ ఆదేశం ఉంటే ఇక్కడ పని ముగించుకుని మధ్యాహ్నం అక్కడ కొద్దిసేపు శిక్షణ ఇస్తూంటా’’.

12/03/2017 - 21:13

‘‘ఆమెకు పెళ్లి కాబోతోందా? ఎప్పుడు? అడిగాడు అజోడా ఏం తెలియనట్టు.
‘‘ముహూర్తం నిశ్చయం కాలేదనుకుంటా’’ అంది మాజా.
‘‘ఇంకేం! పిలిపించవచ్చు కదా! ముహూర్తం నిశ్చయం అయ్యేలోగా ఆమె మన భవంతి అలంకరణ పూర్తిచేయగలుగుతుంది’’.
తల్లిదండ్రులు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. అతడి మాటల వలన అతడు తమ దారిలోకి వస్తున్నాడనే ఆశ కలిగింది.

12/02/2017 - 18:45

‘‘నీకు లేదనా! నాకు కాబోయే భార్యకు ఇవ్వాలని ఇస్తున్నా, వొద్దనకు’’. ‘‘ఈ విలువైన కానుకలు ఇచ్చారుగా..’’
‘‘ఆ కానుకలు నీకు సామాన్య అవసరాలు తీరుస్తాయా? తీసుకో, లేకపోతే నాకు చాలా నిరాశ కలుగుతుంది.. నా సంతోషం కోసం..’’ ఆమె డబ్బు తీసుకోక తప్పలేదు.

12/01/2017 - 18:25

వాటిలో ఆహార ధాన్యాలు నిల్వ చేసినట్లు ఉన్నాయి. గదిలో ఓ మూల నీళ్ళకుండ, నీళ్ళు తాగే పాత్రలు ఉన్నాయి. ఆ పక్కనే ఓ కొయ్య బల్ల మీద పళ్ళు, మిఠాయిలు, ఇసుకలో వేయించిన ధాన్యాలు ఉన్నాయి. వీటన్నిటినీ మాగీర్ తనకూ, మోరీకి ఏర్పాటుచేశాడు కాబోలు. మాళిగ కప్పులో రంధ్రాల గుండా గాలి వెలుతురు వస్తున్నాయి. మాళిగ ద్వారానికి వెళ్ళడానికి మెట్లు ఉన్నాయి. ఆ మెట్లమీంచే మాగీర్, తనూ మాళిగలోకి వచ్చారు.

11/30/2017 - 23:46

-పులిగడ్డ విశ్వనాథరావు
సరస్వతి నదీ మధ్య దీవిమీదున్న అమ్మవారి కోవెలను దర్శించాననీ, జోగార్‌లో జలపాతం చూశానని చెప్పి ‘‘ఆ జోగార్‌లో ప్రకృతి సౌందర్యం చూసి నాకు చాలా ఆనందం కలిగింది. అక్కడ ఒక ఇల్లు కొనాలని అనుకుంటున్నా’’ నాన్నగారు అన్నాడు.
‘‘తప్పకుండా కొనరా. ఈ సంపత్తి అంతా నీదే కదా’’ అన్నాడు తండ్రి.

11/29/2017 - 19:44

‘‘నేను కొంతకాలం అమ్మాయిలకి నృత్యం, గానం నేర్పాను. నాతో నృత్యం చేసే అమ్మాయిలకి నేను శిక్షణ ఇచ్చా’’.
‘‘ఐతే బాగుంది. నువ్వక్కడ చేరు. అతడికి నిన్ను తీసుకోమని సిఫారసు చేస్తా. అతడు నా మాట కాదనలేడు. నా ప్రాణ స్నేహితుడు’’.
‘‘కాని మనం కలుసుకోవడం ఎలా?’’

11/28/2017 - 18:34

‘‘ఔను తల్లీ! మీరిద్దరూ రతీ మన్మథులులాగే ఉన్నారు!’’ అంది పూలమ్మి.
కనకాంబరాల చెండ్లు రెండు ఆమె మెడకు ఇరువైపులా వేలాడేలా ఆమె కొప్పులో తురిమాడు అతడు.
ఆ రంగు రంగుల పూల దండ ఆమె శరీరం వొంపు సొంపులకు, సొగసులకు, మృగలోచనాల మురిపాలకు విలక్షణమైన అందాలు అద్దుతూంటే ఆ సౌందర్య వైభవాన్ని కనురెప్ప వేయకుండా తిలకిస్తూ ఉండిపోయాడు అతడు.
‘‘ఏవండీ నన్ను అలా చూస్తూ ఉండిపోయారు?’’ అడిగింది ఆమె.

11/26/2017 - 21:11

ఉడుకుబోతుతనం పట్టలేక మోరీ అజోడాతో ‘‘అంత తొందరైతే మీరే కనండి’’ అంది. అది విని అవ్వ బిగ్గరగా నవ్వసాగింది. అజోడా కూడా నవ్వాడు.
‘‘అవ్వా, పరాచికాలకేం కానీ నువ్వు ఎప్పుడైనా మా ఊరు మొహంజోదడో వెళ్ళావా?’’ అని అడిగాడు.

Pages