S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డైలీ సీరియల్

12/18/2019 - 22:31

టాలమీ మనస్సులోని పరిణామాలు ఎలా వుంటాయో కూడా ఆమె ఆలోచించక పోలేదు. తన ఆశలన్నీ రోమ్‌మీదనే కేంద్రీకరించబడినట్లు, టాలమీ ఆశాసౌధాలకు తనే పునాదిరాయిగా వున్నది. తాను జగదేక సుందరిగా ప్రసిద్ధికెక్కింది. తనను వశపరచుకోవాలని టాలమీ ఎంత హాస్యాస్పదంగా ప్రవర్తిస్తున్నాడో కూడా తనకు తెలుసు. తన నుంచి ఒక్క అనురాగపూరితమైన వీక్షణానికి అతను తహతహలాడుతున్నాడు.

12/17/2019 - 23:16

ఈ విధంగా గోటితో సాధించేదానికి గొడ్డలివరకూ పోనవసరం లేకుండా ఉంటుంది. తీవ్రంగా యోచించి చూడు’’.
‘‘మీరు లక్ష చెప్పండిగాక! నేను సర్వనాశమయ్యేందుకు సిద్ధపడగలను కానీ, టాలమీకి భార్యగా మాత్రం ఉండలేను’’ అన్నదామె- నిశ్చయాన్ని వ్యక్తం చేసే కంఠస్వరంతో.
ఇరాస్‌కు రుూ జవాబు ఆశాభంగాన్ని కలిగించింది. ఐనప్పటికీ చివరిసారి ప్రయత్నించి చూద్దామనుకున్నాడు.

12/16/2019 - 22:30

‘‘నా జీవితాశయమే అది! దానికొరకై నేను ఎన్ని బాధలనన్నా పడేందుకు సిద్ధంగా ఉన్నాను’’ అని క్లియోపాత్రా హామీ ఇచ్చింది.
‘‘టాలమీతో మనం ఎందుకు రాజీపడరాదు?’’
‘‘అంటే?’’ అని ఆమె కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యాన్ని వెలిబుచ్చింది.

12/15/2019 - 22:47

ప్రస్తుతానికి ఇదే తన నివాసం. చుట్టూ కొండలు, అల్లంత దూరంలో సముద్రం. ఈ రెండూ తనకు ప్రకృతి ఏర్పరచిన రక్షలు. మిగతా జాగ్రత్తలమీద ఆమె మనస్సు లగ్నం చేసింది.

12/14/2019 - 22:07

ఈ ఏకఛత్రాధిపత్యాన్ని సంపాయించేందుకు ఆమె తీవ్రంగా ఆలోచించింది.

12/13/2019 - 02:41

యథాప్రకారం రోమ్‌కు సరుకుల రవాణాలు సాగుతూనే వున్నది. రోమన్ సైన్యాలు అలెగ్జాండ్రియాలో రాజవంశ రక్షణ అనే మిషమీద పోషించబడుతూనే వున్నవి. అక్కడ రోమ్‌లో, ప్రభుత్వంలో చీలికలు ఏర్పడినవనే వార్తలు వస్తూన్నవి. ఐతే పాంపే అజేయుడిగా ఉండి ప్రభుత్వాన్ని జాగ్రత్తగా నడుపుతూనే ఉన్నాడు.

12/12/2019 - 04:36

ఈ రోమన్ యువకుడు 28 సంవత్సరాల వయస్సువాడు. యవ్వనశోభకు తోడు ఠీవితోకూడిన ఆ సుందరాకారుణ్ణి చూచిన మరుక్షణంలోనే క్లియోపాత్రా- తానూ, తన దేశమూ రోమ్ ఆధీనంలో ఉండటాన్ని ద్వేషించిన యువతి, ఆ క్షణంలో మాత్రం రోమన్ సైన్యాధిపతికి తన ప్రణయాన్ని ధారపోసింది. తన స్ర్తి జన్మ సాఫల్యతకు ఇలాటి యువకుణ్నిగూర్చే ఆమె కలలు కన్నది. ఆ కలలు సముద్రపుటలలవలె కరిగిపోకుండా, నిజమై జీవితంలోకి వొస్తవని ఆమె ఎన్నడూ అనుకోలేదు.

12/11/2019 - 22:05

ఏవో పాడు కలల కోసం మనస్సు చెడగొట్టుకుంటున్నావు కాని, నిజంగా నీవు రుూ ప్రపంచానే్న పాలిస్తావు. ఇక లేచి రామ్మా! భోంచేద్దువుగాని!’’
క్లియోపాత్రా ఆకాశపుటంచుల్లో విహరిస్తూ, తనకు తెలియకుండానే ఆయా వెంట నడిచింది.
ఆ రోజంతా ఆమె వినోదాలలో గడుపుతూ, ఊహల్లో ప్రపంచానే్న పాలించింది.
3

12/10/2019 - 22:10

‘‘ఒకవేళ రోమన్‌ల సహాయంతో తిరిగి నాయనగారు ఈజిప్టు వొస్తే, రుూ ప్రజలు ఆయన్ను రాజుగా అంగీకరిస్తారా? ఈజిప్టును రోమన్‌లకు అమ్మాడనీ, వొట్టి బుద్ధిహీనుడనీ మా నాయనకు పేరున్నది. ఇలాటి రాజు వొదిలిపోయినందుకు ప్రజలు ఆనందిస్తారు గానీ, తిరిగివస్తే తిరుగుబాటు చేయరా?’’

12/10/2019 - 22:07

‘‘మన దేశానికి పాలకుల్ని నిర్ణయించేందుకు రోమన్ అధికారాలేమిటి?’’ అందామె కోపంతో వణికిపోతూ.
‘‘ఉద్రేకాలవల్ల ఏవౌతుంది యువరాణీ! రోమన్ దాస్యం మనతో ఆరంభం కాలేదు’’
‘‘కాని మనతో ఎందుకు అంతమవరాదు?’’ అంది అధికార పూర్వకంగా క్లియోపాత్రా.
‘‘నీలాంటి రాణి పరిపాలనలో చూడాలి!’’
ఆచార్యులు ఎగతాళిగా రుూ మాట అన్నారో లేక నిజంగానే ఆయన నమ్ముతున్నారో క్లియోపాత్రకు అర్థం కాలేదు.

Pages