S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డైలీ సీరియల్

07/16/2017 - 23:13

అవునన్నట్లు తల ఊగించాను.
‘‘మీరు వస్తున్నారు కదా’’ అన్నాడు. పెళ్లికి అటెండ్ అవుతున్నవారి ఆర్‌ఎస్‌విపి లిస్టులో వాళ్ళ పేర్లు కూడా చదివినట్లు అనిపించింది.
‘‘తప్పకుండా’’ అంది.
‘‘మీకు తెలుసా ఆంటీ- వాళ్ళు మా హోటల్‌లో ఆగినపుడు వీరిద్దరూ హస్పెండ్ అండ్ వైఫ్ అనుకున్నాను. అందుకే లోపలకు రమ్మన్నాను.’’

07/15/2017 - 21:45

‘‘్థంక్ యు, థాంక్ యు’’ అంది చాలా కృతజ్ఞతాపూర్వకంగా.
‘‘మా అమ్మ చాలా వర్రీ అయిపోతుంది. కారు ఆగిపోగానే చెప్పాను. అప్పుడే చాలా భయపడిపోయింది. అప్పటినుంచి నన్ను ఎలా కాంటాక్ట్ చెయ్యాలా అన్న టెన్షన్‌లో ఉన్నారు’’ అంది.

07/14/2017 - 22:45

ఆ అమ్మాయి అందుకే సందేహిస్తోందనిపించింది. చివరకు నేనే కారు ఎక్కి ఆ అమ్మాయి కారుకు ముందుగా షోల్డర్ మీదకు నా కారు కూడా పోనిద్దామని సిగ్నల్ వేసి పక్కకు పోనివ్వపోయాను. అది చాలా రిస్కీ అని నాకు తెలుసు. ఒకసారి కారు స్నోలో ఇరుక్కుంటే బయటకు లాగటం కష్టం. నా సైడ్ మిర్రర్‌లో ఆ అమ్మాయి కారు దిగినట్లు కనిపించింది. చెయ్యి ఎత్తింది ఆగమని సూచిస్తూ!

07/13/2017 - 23:23

నాకేదయినా వెంటనే అర్థం కాక తప్పు చేస్తే ఇలాగే నేనూ తప్పు చేస్తే నువ్వు ఏమనేదానివి- నీ బుర్ర కాస్త వాడు. భగవంతుడు బుర్ర ఇచ్చింది గూట్లో పెట్టడానికి కాదు అని అంటూ తనూ అదే అనేవాడు.
నాకు కంప్యూటర్స్ వాడటం అంతా వాడే నేర్పించాడు.

07/12/2017 - 22:10

అంతకంటే తోటి లెక్చరర్స్ ప్రైవేటుకి వచ్చే పిల్లల్లో, రాని పిల్లల్లో ఎంత తేడా చూపించేవారో.
ఇక్కడ కూడా ఆర్థికంగా చాలా తేడా చాలా ఉంది. కానీ, కష్టపడేవారికి గుర్తింపు ఉంది. శ్రమకు ఫలితం ఉంది.
‘‘ఎంతసేపయింది లేచి?’’ వౌళి మాటలు వినిపించి వెనక్కి తిరిగాను. వౌళి కూడా కాఫీ తెచ్చుకుని, దగ్గరగా వచ్చాడు.

07/11/2017 - 21:47

నేనూ చిన్నగా నవ్వాను. ‘‘అందుకే కారణాలు వెదకడం మానేయి. కొన్నింటికి సమాధానాలు ఉండవు’’ అన్నాను.
‘‘నా చిన్నతనంలో అతన్ని కలవాలని, ఏవేవో అడిగేయాలని ఎందుకు ఊహించానో కూడా నాకు తెలియదు’’ అన్నాడు నిట్టూరుస్తూ!
ఫోన్ మోగింది.
వౌళి రిసీవర్ ఎత్తుతూనే- ‘‘ఇందాకే చాలా అలసిపోయాను అన్నావ్? ఇంకా పడుకోలేదా?’’ అన్నాడు.
‘‘.....’’

07/09/2017 - 22:36

ఎవరితో పంచుకోవాలనుకున్నా నాకు అభ్యంతరం లేదు. అది నీకు స్పష్టంగా తెలియాలి’’ అన్నాను.
‘‘నాకు తెలుసమ్మా, నిర్ణయం నాదేనని. కాని, నీ ఉద్దేశ్యం కూడా నాకు ముఖ్యమే!’’ అన్నాడు.
‘‘సరే చెప్పేశావుగా! ఇంతకీ నాకు ఒకటి చెప్పు. చిన్నప్పుడు అంటూ ఉండేవాడివి. ఎప్పుడో వెళ్లి అతన్ని అన్నీ అడిగేస్తా!’’ అని. అమెరికా వచ్చి ఇనే్నళ్ళల్లో అతన్ని కలవడం జరిగిందా లేదా! అన్నాను.

07/08/2017 - 20:35

నీలో భావోద్వేగాలు ఉన్నాయని చెప్తుంది. కన్నీళ్ళలో అంత విలువ ఉంది. అవి కార్చడం ఎప్పుడూ వృధా కాదు. కాని నీకు కన్నీళ్ళు తెప్పించే కారణానికి కూడా కొంత అర్హత ఉండాలి.
చివరకు చాలా మెల్లగా, నా చెవుల్లో చెప్పినంత మెల్లగా అన్నాడు.
‘‘మనం అతని జీవితంలో ఎప్పుడూ చోటుచేసుకోలేదు’’.

07/07/2017 - 22:30

నేను ఆ గదిలోంచి బయటకు వచ్చి డాబామీదకు వెళ్ళాను. అది చదువుతున్నంతసేపూ, వాడి మొహంలో మారే రంగులు చూడటం నాకు ఇష్టంలేదు. వాడి మనసులో చెలరేగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం నాకు చాతకాదు.
అందుకనే ఒంటరిగా డాబామీదకు వెళ్ళాను. పిట్టగోడమీద కూర్చుని ప్రశాంతంగా ఉన్న ఆకాశం వంక చూస్తూ ఉండిపోయాను. నేను ఏం చేస్తున్నాను ఇక్కడ? అని అనుకోకుండా ఉండలేకపోయాను.

07/06/2017 - 22:07

నాన్నకు అతనికి కృతజ్ఞతలు తెలపాలనిపించింది.

Pages