S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేర్చుకుందాం

03/24/2017 - 20:53

ఆదరమింత లేక నరుడాత్మ బలోన్నతి మంచివారికిన్
భేదము చేయుటం దనదు పేర్మికి గీడగు మూలమెట్ల మ
ర్యాద హిరణ్య పూర్వ కశిపున్ దనుజుండు గుణాఢ్యుడైన ప్ర
హ్లాదునకెగ్గు చసి ప్రళయంబును బొందడె మున్నుభాస్కరా!

03/23/2017 - 21:51

అవని విభుండు నేరుపరీయై చరియించిన గొల్చువార లె
ట్లన గుణులైన నేమి పనులన్నియు జేకుఱు వారి చేతనే
ప్రవిమల నీతిశాలి యగు రాముని కార్యము మర్కటంబులే
తవిలి యొనర్పవే జలధిదాటి సురారుల ద్రుంచి భాస్కరా!

03/23/2017 - 05:30

అలఘు గుణ ప్రసిద్ధుడగు నట్టి ఘనుండొకడిష్టుడై తనున్
వలచి యొకించుకేమిడిన వానికి మిక్కిలి మేలు చేయుగా
తెలిసి కుచేలుడొక్క కొణి దెండటుకుల్ దనకిచ్చినన్ మహా
ఫలదుడు కృష్ణుడత్యధిక భాగ్యము లాతని కీడె భాస్కరా!

03/21/2017 - 21:07

అనఘునికైన జేకురు ననర్హుని గూడి చరించినంతలో
మన మెరియంగ నపుడవమానము కీడు ధరిత్రియందునే
యనువుననైన, దప్పవు యధార్థము తా నది యెట్టులన్నచో
నినుమును గూర్చి యగ్ని నలయింపదె సమ్మెట పెట్టు భాస్కరా!

03/19/2017 - 23:09

అతిగుణ హీన లోభికి బదార్థము గల్గిన లేక యుండినన్
మితముగగాని కల్మిగలమీదటనైన భుజింప డింపుగా
సతమని నమ్ము దేహమును సంపద నేఱులు నిండి పారినన్
గతుకగ జూచు గుక్క తనకట్ట వీడ మీఱక యెందు భాస్కరా!

03/19/2017 - 07:18

అక్కరపాటు వచ్చు సమయంబున చుట్టము లొక్కరొక్కరిన్
మక్కువ నుద్ధరించుటలు మైత్రికి జూడగ యుక్తమే సుమీ!
యొక్కట నీటిలో మెరక నోడల బండ్లును బండ్ల నోడలున్
దక్కక వచ్చుచుండుట నిదానము గాదె తలంప భాస్కరా!

03/17/2017 - 21:15

అదను దలంచి కూర్చి ప్రజనాదరమొప్ప విభుండు కోరినన్
గదిని పదార్థమిత్తురటు కానక వేగమె కొట్టి తెండనన్
మొదటికి మోసవౌ బొదుగు మూలము గోసిన చాలు గల్గునే
పిదికిన గాక భూమి బశుబృందము నెవ్వరికైన భాస్కరా!

03/16/2017 - 21:08

శ్రీగల భాగ్యశాలి కడ జేరగవత్తురు తారుదారె దూ
రాగమన ప్రయాసమున కాదట నోర్చియు నైననిల్వను
ద్యోగము చేసి రత్ననిలయుండని కాదె సమస్త వాహినుల్
సాగరు చేరుటెల్ల మునిసన్నుత మద్గురుమూర్తి భాస్కరా!

03/15/2017 - 21:53

నీవు రాజవనుచు నిఖిలంబు నడుగుట
దగవు కాదు నాకు దగిన కొలది
యేను వేడికొనిన రుూ పదత్రయమును
జాలదనక యిమ్ము చాలు చాలు

భావము: సంతోషపడేవాడు ముల్లోకాలలోనూ గౌరవింపబడతాడు. నీళ్లవల్ల నిప్పు చల్లారిన విధంగా సంతోషం లేకపోతే తేజస్సు తగ్గిపోతుంది. నీవు రాజువు కదా అని అవీ ఇవీ అన్నీ ఇమ్మని అడగడం న్యాయం కాదు. నాకు తగినట్లుగా నేను అడిగిన ఈ మూడడుగులూ కాదనకుండా ఇవ్వు. అదే చాలు. అంతే చాలు.

03/12/2017 - 21:20

వ్యాప్తింబొందక వగవక
ప్రాప్తంబగు లేశమైన పదివేలనుచున్
దృప్తించెందని మనుజుడు
సప్తద్వీపములనిన జక్కంబడునే
భావము: బలిచక్రవర్తికి వామనుడు సమాధానమిస్తూ అబ్బినది కొంచెమైనా సరే, ఉబ్బితబ్బిబ్బు కాకుండా అదే పదివేలుగా భావించి తృప్తిని పొందాలి. అట్లా తృప్తిపడటానికి సప్తద్వీపాల సంపదలు వచ్చిపడినా కూడా తృప్తితీరదు. అందువలన సంతృప్తి వుండాలి అని భావము.

Pages