S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేర్చుకుందాం

03/12/2019 - 19:40

సీ. అందరేమైన నిన్నడుగ వచ్చెదరంచు
క్షీర సాగరమందుఁ జేరినావు
నీ చుట్టు సేవకుల్ నిలువ కుండుటకునై
భయద సర్పము మీద బండినావు
భక్త బృందము వెంటబడి చరించెదరంచు
నెగిరిపోయెడి పక్షినెక్కినావు
దాసులు నీ ద్వార మాసింపకుటకై
మంచి యోధుల కాపునుంచినావు
తే. లావుగల వాడవైతి వేలాగు నేను
నిన్ను జూతురు నా తండ్రి ! నీరజాక్ష!

03/11/2019 - 20:30

సీ. నాగేంద్ర శయన నీ నామ మాధుర్యంబు
మూడు కన్నుల సాంబమూర్తి కెరుక
పంకజాతాక్ష ! నీ బలపరాక్రమ మెల్ల
భారతీ పతియైన బ్రహ్మ కెరుక
మదుకైటభారి ! నీ మాయ సమర్థత
వసుధలో రబలి చక్రవర్తి కెరుక
పరమాత్మ !నీ దగు పక్షపాతిత్వంబు
దశశతాక్షుల పురందరున కెరుక

03/10/2019 - 22:51

సీ. భువనేశ! గోవింద! రవికోటి సంకాశ!
పక్షివాహన ! భక్త పారిజాత!
అంభోజ భవ రుద్ర జంభారి సన్నుత
సామ గాన విలోల! సారసాక్ష!
వనధి గంభీర ! శ్రీ వత్స కౌత్సుభవక్ష!
శంఖ చక్ర గదాసి శార్‌ఙ్గ హస్త!
దీన రక్షక! వాసుదేవ! దైత్య వినాశ
నారదార్చిత దివ్య నాగ శయన

03/08/2019 - 20:34

సీ. అమరేంద్రవినుత! నే నతి దురాత్ముడ నంచుఁ
గలలోనగైనను కమలఁ బడవు
నీవుప్రత్యక్షమై విలువకుండిన మానె
దొట్టగా నొక యుక్తి దొరకెనయ్య!
గట్టి కొయ్యను దెచ్చి ఘనముగా ఖండించి
నీ స్వరూపము జేసి నిలుపుకొందు
ధూప దీపములిచ్చి తులసి తో పూజించి
నిత్యనైవేద్యముల్ నీమముగను
తే. నడుపుచును నిన్నుఁ గొలిచెద నమ్మి బుదిధ
నీ ప్రపంచంబు గలిగే నాగింతె చాలు

03/07/2019 - 20:08

సీ. తార్‌క్ష్యవాహన! నీవుదండిదాతవటంచుఁ
గోరి వేడుక నిన్నుఁ గొల్వవచ్చి
యర్ధిమార్గమును నే ననుసరించితినయ్య
లావైన పదునాల్గు లక్షలైన
వేషముల్ చేసి నా విద్యా ప్రగల్భత
జూప సాగితి నీకు సుందరాంగ!
ఆనందమైన నే నడుగ వచ్చిన దిచ్చి
వాంఛ ఁదీర్చుము నీలవర్ణ! వేగ
తే. నీకు నా విద్య హర్షగాకయున్న
తేప తేప వేషముల్ దేను జుమ్మి!

03/06/2019 - 20:12

సీ. తిరుపతి స్థలమందుఁ దిన్నగానేనున్న
వేంకటేశుఁడు మేత మనేయలేఁడొ?
పురుషోత్తమునకు నేఁ బోయిన ఁ జాలు జ
గన్నాథుఁ డననంబుఁ గడపలేఁపొ?
శ్రీరంగమునకునే ఁ జేరఁ బోయిన ఁజాలు
స్వామి గ్రాసము పెట్టి సాకలేఁడొ
కాంచీపురములోనఁ గదిసి నేఁ గొలువున్నఁ
గరివరదుఁడు పొట్ట గడపలేఁడొ?
తే. ఎందుఁబోనక నేను నీ మందిరమున
నిలిచితిని నీకు నా మీఁద నెనరులేదు

03/05/2019 - 20:11

సీ. పలుమాఱు దశరూపములు ధరించితివేల?
నేక రూపముఁబొందనేల నీవు?
నయమున క్షీరాబ్దినడుమఁ జేరితివేల?
రత్నకాంచనమందిరములు లేవె?
పన్నగేంద్రుని మీఁద ఁ బవ్వళించితివేల?
జలతారు పట్టెమంచములు లేవె?
రెక్కలు గల పక్షి నెక్కి సాగితివేల?
గజతురంగాందోళికములు లేవె?
తే. వనజరోచన! ఇటువంటి వైభవములు
సొగసుగా నీకుఁ దోచెనో సుందరాంగ

03/05/2019 - 00:04

సీ. గరుడ వాహన ! దివ్యకౌస్త్భులంకార!
రవికోటి తేజ ! సారంగవదన!
మణిగణాన్విత హేమముకుటాభరణ! చారు
మకరకుండల! లసన్మందహాస!
కాంచనాంబర!రత్నకాంచీవిభూషిత!
సురవరార్చిత! చంద్రసూర్య నయన!
కమలనాభ! ముకుంద! గంగాధర స్తుత!
రాక్షసాంతక! నాగరాజశయన!
తే. పతిత పావన ! లక్ష్మీశ! బ్రహ్మజనక!
భక్తవత్సల ! సర్వేశ! పరమపురుష!

03/03/2019 - 22:33

సీ. పద్మాక్ష! మమతచేఁ బరము నందెదమంచు
విఱ్ఱవీగెదమయ్య వెఱ్ఱినంటి
మా స్వతంత్రంబైన మదము కండ్లకుఁ గప్పి
మొగము పట్టదు కామ మోహములకు
బ్రహ్మదేవుండైనఁ బైడి దేహము గల్గఁ
జేసివేయక మమ్ము ఁ జెఱచెనతఁడు
తుచ్ఛమైనటువంటి తోలెమ్ము కలతోడి
ముఱికి చెత్తలు చేర్చి మూట కట్టె
తే. నీ శరీరాలుపడిపోవుటెఱుఁగ కేము
కాముకుల మైత్రి మిఁక మిమ్ముఁ గానలేము

03/01/2019 - 19:59

సీ. వదనంబు నీ నామ భజన గోరుచునుండు
జిహ్వ నీ కీర్తనల్ సేయగోరు
హస్తయుగ్మము నిన్ను నర్చింప గోరును
కర్ణముల్ నీ మీద కథలు గోరు
తనువు నీ సేవయే ఘనముగా గోరును
నయనముల్ నీ దర్శనంబు గోరు
మూర్ధమ్ము నీ పాదముల మ్రొక్కగా గోరు
ఆత్మ నీదై యుండు నరసి చూడ
తే. స్వప్నముల నైన నేవేళ సంతతమును
బుద్ధి నీ పాదములయందు బూని యుండు

Pages