S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేర్చుకుందాం

10/08/2018 - 19:08

ఉ. అంచితమైన నీదు కరుణామృత సారము నాదుపైని బ్రో
క్షించిన చాలు, దాన నిరసించెద నాదురితంబులెల్లఁ దూ
లించెద వైరివర్గమెలించెదఁ గోర్కుల నీదు బంటవై
దంచెదఁ గాల కింకరుల దాశరథీ కరుణాపయోనిధీ!

10/08/2018 - 01:35

దాశరథి శతకం
*
చ. ఇతఁడు దురాత్ముఁడంచు జనులెన్నఁగ నాఱటి గొంటి, నేనె పో
పతితుఁడనంటిపో, పతితపావన మూర్తివి నీవు గల్గనే
నితరుల వేడనంటి నిహమిచ్చిన నిమ్ము, పరంబొసంగుమీ
యతులితరామనామ మధురాక్షర పాళి నిరంతరంబు హృ
ద్గతమని నమ్మి కొల్చెదను దాశరథీ కరుణాపయోనిధీ!
*

10/05/2018 - 19:42

చ. వలదు పరాకు భక్తజన వత్సల , నీ చరితమ్ము వమ్ము గా
వలదు పరాకు, నీ బిరుదు వజ్రమువంటిది కావకూరకే
వలదు పరాకు, నాదురితవార్ధికిఁ దెప్పవుగా మనంబులో
దలఁతుమే కా నిరంతరము దాశరథీ కరుణాపయోనిధీ!

10/04/2018 - 19:10

ఉ. నీలఘనాభమూర్తివగు నిన్నుఁగనుంగొనఁ గోరి వేడినన్
జాలము చేసి డాగెదవు, సంస్తుతి కెక్కిన రామనామమే
మూలను దాచుకోఁగలవు ముక్తికిఁ బ్రాపతి ప ఆదపమూలకు
ద్దాలము గాదె మా యెడల దాశరథీ కరుణా పయోనిధీ!

10/03/2018 - 19:50

ఉ. దాసిన చుట్టమా శబరి? దాని దయామతి నేలినావు నీ
దాసుని దాసుఁడా గుహుఁడు? తావక దాస్యమొసంగినావు; నేఁ
జేసిన పాపమా? వినుతి సేసిన ఁ గానవు, గావుమయ్య, నీ
దాసుల లోన నేనొకఁడ దాశరథీ కరుణాపయోనిధీ!

10/02/2018 - 22:10

దాశరథి శతకం
*
ఉ. మామకపాతక వ్రజము మాన్ప నగణ్యము, చిత్ర గుప్తులే
మేమని వ్రాతురో శమనుఁడేమి విధించునొ? కాలకింకర
స్తోమ మొనర్చుటేమొ? వినిఁ జొప్పడదింతకు మునె్న దీనచిం
తామణి, యెట్లు గాచెదవొ? దాశరథీ కరుణాపయోనిధీ!
*

09/30/2018 - 22:22

ఉ. పాతకులైన మీ కృపకుఁ బాత్రులు గారె తలంచి చూడఁ
ట్రాతికి గల్గెఁ భావన మరాతికి రాజ్య సుఖంబు గల్గె, దు
ర్జాతికిఁబుణ్య మబ్బె ఁ గపిజాతి మహత్త్వము నొందెఁ గావునన్
దాతవ యెట్టి వారలకు దాశరథీ కరుణాపయోనిధీ!

09/28/2018 - 19:23

చ. సలలిత రామనామ జపసారమెరుంగను గకాశికాపురీ
నిలయుఁడఁగాను మీ చరణ నీరజరేణు మహాప్రభావముం
దెలియ నహల్య ఁగాను జగతీవర, నీదగు సత్య వాక్యముం
దలఁపఁగ రావణాసురుని తమ్ముడఁ గాను భవద్విలాసమున్
తలఁచి మతింప నాతరమె! దాశరథీ కరుణాపయోనిధీ

09/27/2018 - 18:50

ఉ. పరుల ధనంబుఁ జూచి, పరభామల ఁ జూచి హరింపఁ గోరును
ద్గురుతరమానసంబనెడి దొంగను బట్టి నిరూఢదాస్య వి
స్ఫురిత వివేక పాశములఁ జుట్టి, భవచ్చరణంబనే మరు
త్తరువునఁ గట్టి నేయఁ గదె దాశరథీ కరుణాపయోనిధీ!

09/26/2018 - 19:01

ఉ. చేసితి ఘోరకృత్యములు చేసితి భాగవతాపచారముల్
చేసితి నన్యదైవములఁ జేరి భజించిన వారి పొందు నేఁ
జేసిన నేరముల్ దలచి చిక్కులు బెట్టకు మయ్య, యయ్య నీ
దాసుఁడనయ్య భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ!

Pages