S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేర్చుకుందాం

02/28/2019 - 20:34

సీ. ఇహలోక సౌఖ్యము లిచ్చగించెదమన్న
దేహమెప్పటికిని స్థిరత నొంద
దాయుష్యమున్న పర్యంతంబు పటుతయు
నొక్క తీరు న నుండ దుర్విలోన
బాల్యయువత్వదుర్భలవార్థకములను
మూటిలో మునిగెడి మురికి కొంప
భ్రాంతిలో దీని ఁ గాపాడుదమనుకొన్నఁ
గాల మృత్యువు చేతఁ గోలుపోవు
తే. నమ్మరాదయ్య! ఇది మాయ నాటకంబు
జన్మమిక నొల్ల ననే్నలు జలజనాభ!

02/27/2019 - 19:50

సీ. హరిదాసులను వాదులాడకుండినఁ జాలు
సకల గ్రంథంబులు చదివినట్లు
భిక్షమియ్యంగ ఁ దప్పింపకుండినఁ జాలు
చేముట్టి దానంబు చేసినట్లు
మించి సజ్జనుల వంచించకుండిన ఁ జాలు
నింపుగా బహుమానమిచ్చినట్లు
దేవాగ్రహారముల్ దీయకుండిన ఁ జాలు
గనకకంబపుగుళ్ళు గట్టినట్లు
తే. ఒకని వర్షాశనము దీయకున్నఁ జాలుఁ
బేరుకీర్తిగ సత్రముల్ పెట్టినట్లు

02/26/2019 - 19:58

సీ. జీమూత వర్ణ! నీ మోముతో సరి రాక
కమలారియతి కళంకునఁ బడియె
సొగసైన నీ నేత్ర యుగముతో సరిరాక
నళిన బృందము నీళ్ల నడుమఁ జేరె
కవి రాజ వరద! నీ గళముతో సరిరాక
పెద్ద శంఖము బొబ్బ పెట్టఁ దొడఁగె
శ్రీపతీ! నీ దివ్యరూపుతో సరిరాక
పుష్పబాణుఁడు నీకుఁ బుత్రుఁ డయ్యె
తే. ఇందిరాదేవి! నిన్ను మోహించి విడక
నీకుఁ బట్ట మహిషి యయ్యె నిశ్చయముగ

02/25/2019 - 19:51

సీ. సర్వేశ! నీ పాద సరసిజద్వయమందుఁ
జిత్తముంపఁగలేను జెదరకుండ
నీవైన దయయుంచి నిలిచి యుండెడి యట్లు
చేసినన్నిపు డేలు సేవకుఁడను
వనజలోచన! నేను వట్టి మూర్ఖుఁడఁజుమ్మి
నీ స్వరూపముఁ జూడ నేర్పు వేగ
తన కుమారుల కుగ్గు తల్ల పోసినయట్లు
భక్తి మార్గంబను పాలుపోసి
తే. ప్రేమతో నన్ను ఁబోషించి పెంచుకొనుము
ఘనత కెక్కించు నీ దాసగుణములన

02/24/2019 - 20:00

తే.గీ. అరయ మానవ సేవయే ధరణిలోన
మాధవునకుఁ జేసెడి సేవ మరువఁబోకు
సత్యవాక్కుకుఁ బ్రాణమ్ము ఁ జక్కగాను
నిత్యముం బోయు వాడెపో నిజ విజేత!

తే.గ. ధర్మకంకణ బద్ధుడై దైవ చింత
నామృతంబును గ్రోలుచు హాయినొంది
సత్ప్రవర్తన తో నిల సాగువాడు
న్యాయ బుద్ధితో నిత్యమ్ము నడచువాడు
నిక్కముంబల్క వాడెపోనిజ విజేత!

02/22/2019 - 20:40

సీ. ఇభకుంభముల మీఁద కెగిరిడి సంగంబు
ముట్టునే కుఱుచైన మూషికమును
నవచూత పత్రముల్ నములుచున్న పికంబు
కొఱకునే జిల్లేడు కొనలు నోట?
అరవింద మకరంద మనుభవించెడి తేటి
పోవునే పల్లేరు పూలకడకు?
లలితమైన రసాల ఫలముఁ గొప్పెడి చిల్క
మెసపునే భ్రమిత మమ్మెత్తకాయ
తే. ఇలను నీ కీర్తనలు పాడ నేర్చినతఁడు
పరుల కీర్తన ఁ బాడునే యరసి చూడ

02/21/2019 - 19:28

సీ. నిగమాది శాస్తమ్రుల్ నేర్చిన ద్విజుఁడైన
యజ్ఞకర్తగు సోమయాజియైన
ధరణిలోపల ప్రభాత స్నానపరుఁడైన
నిత్య సత్కర్మాది నిరతుఁడైన
నుపవాస నియమంబు నొందు సజ్జనుఁడైన
గాని వస్తమ్రుఁ గట్టు ఘనుఁడునైన
దండి షోడశమహాదానపరుండైన
సకల యాత్రలు సల్పు సరసుఁడైన
తే. గర్వమునఁ గష్టపడి నిన్నుఁ గానకున్న
మోక్ష సామ్రాజ్య మొందఁడు మోహనాంగ!

02/20/2019 - 19:43

సీ. పంజరంబునఁ గానిఁ బట్టియుంచిన లెస్స
పలుకునే వింతైన చిలుక పలుకు
గార్ధ్భంబును దెచ్చి కళ్లెమింపుగ నేయ
తిరుగునే గుఱ్ఱంబు తీరుగాను
ఎనుప పోతును మావటటీడు శిక్షించిన
నడచునే మదవారణంబు వలెను
పెద్ద డిట్టకు మేతఁబెట్టి పెంచినఁ గ్రొవ్వి
సాగునే వేటాడు డేగవలెను
తే. కుజనులను దెచ్చి నీ సేవకొరకు ఁబెట్ట
వాంఛతోఁ జేతురే భక్తవరుల వలెను

02/19/2019 - 20:38

సీ. నీ భక్తులను కండ్లనిండఁ జూచిన రెండు
చేతుల జోహారు సేయువాఁడు
నేర్పుతో నెవరైన నీ కథల్ చెప్పంగ
వినయమందుచుఁ జాల వినెడువాఁడు
తన గృహంబునకు నీదాసులు రాజూచి
పీటపై ఁ గూర్చుండఁ బెట్టువాడు
నీ సేవకులజాతి నీతులెన్నక చాల
దాసోహమని చేరదలచువాడు
తే. పరమ భక్తుండు ధన్యుండు భానుతేజ
వాని గనుగొన్న పుణ్యంబు వసుధలోన

02/18/2019 - 18:44

సీ. నరసింహ నా తండ్రి ననే్నలు ననే్నలు
కామితార్థములిచ్చు కావు కావు
దైత్య సంహార! చాలదయయుంచు దయయుంచు
దీన పోషక! నీవె దిక్కు దిక్కు
రత్న భూషిత పక్ష! రక్షింపు రక్షింపు
భునవ రక్షక! నన్ను బ్రోవు బ్రోవు
మారకోటి స్వరూప! మన్నించు మన్నించు
పద్మలోచన ! చేయి పట్టు పట్టు
తే. సుర వినుత! నేను నీచాటు జొచ్చినాను
నా మొఱాలించి కడదేర్చు నాగ శయన!

Pages