S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేర్చుకుందాం

02/17/2019 - 22:16

సీ. పరుల ద్రవ్యము మీఁద భ్రాంతినొందిన వాఁడు
పరకాంతల కపేక్ష పడెడివాఁడు
ఆర్యుల చిత్తంబు లపహరించెడి వాఁడు
దాన మియ్యంగ వద్దనెడివాఁడు
సభలలోపల నిల్చి చాడి చెప్పెడివాఁడు
పక్షపు సాక్ష్యంబు పలుకు వాఁడు
విష్ణుదాసులఁ జూచి వెక్కిరించెడివాఁడు
ధర్మసాధులఁ దిట్టఁ దలఁచు వాఁడు
తే. ప్రజల జంతుల హింసించు పాతకుండు
కాలకింకర గదలచే ఁ గష్టమొంచు

02/15/2019 - 19:45

సీ. సాధు సజ్జనులతో జగడ మాటనఁగీడు
కవులతో వైరంబుఁ గాంచఁ గీడు
పరమ దీనులఁ జిక్కఁబట్టి కొట్టిన ఁ గీడు
భిక్షుకులమ దుఃఖపెట్టఁ గీడు
నిరుపేదలను జూచి నిందఁ జేసినఁ గీడ
పుణ్యవంతుల ఁదిటఁ బొసగుఁ గీడు
సద్భక్తులను దిరస్కార మాటినఁగీడు
గురుని ద్రవ్యము దోచుకొనినఁ గీడు
తే. దుష్టకార్యము లొనరించు దుర్జనులకు
ఘనతరంబైన నరకంబు గట్టు ముల్లె

02/14/2019 - 19:54

సీ. పచ్చి చర్మపు తిత్తి పసలేదు దేహంబు
లోపల నంతట రోయరోత
నరములు శల్యముల్ నవరంధ్రముల రక్త
మాంసపు కండల మైల తిత్తి
బలువైన యెండ వానల కోర్వదింతైన
తాళలేదాకలి దాహములకు
సకల రోగములకు సంస్థాన మై యుండు
నిలువ దస్థిరమైన నీటి బుగ్గ
తే. బొందిలో నుంచు ప్రాణముల్ పోయినంతఁ
గాటికే గాని కొఱగాదు గవ్వకైన
భూషణ వికాస! శ్రీధర్మపుర నివాస!

02/13/2019 - 20:12

సీ. కూటికోసము నేఁను గొఱగాని జనులచే
బలు గద్దరింపులు పడఁగ వలసె
దారసుత భ్రమ దగిలి యుండుటఁగదా
దేశదేశములెల్లఁ దిరుగ వలసె
పెను దరిద్రతపైనఁ బెనఁగి యుండుట ఁగదా
చేరి నీచుల సేవఁ జేయవలసె
నభిమానములు మది నంటి యుండుటఁ గదా
పరులఁజూచిన భీతి పడఁగ వలసె
తే. నిటుల సంసార వారాశి నీడలేక
వేయివిధముల నిన్ను నే వేడుకొంటి

02/12/2019 - 20:53

సీ. బలురోగములకు నీ పాదతీర్థమె కాని
వలదు మందులు నాకు వలదు వలదు
చెలిమి చేయుచు నీకు సేవఁ జేసెదఁ గాని
నీ దాసకోటిలో నిలుపవయ్య
గ్రహభయంబునకుఁ జక్రముఁ దలంచెదఁ గాని
ఘోరరక్షలు కట్ట ఁ గోరనయ్య
పాముకాటుకు నిన్ను భజనఁ జేసెదఁ గాని
దాని మంత్రము నేను దలపనయ్య
తే. దొరికితివి నాకుఁ దండ్రివైద్యుఁడవు నీవు
వేయి కష్టాలు వచ్చిన వెఱవనయ్య!

02/11/2019 - 22:54

సీ హరి! నీకు పర్యంకమైన శేషుఁడు చాలఁ
బవనము భక్షించి బ్రతుకుచుండు
ననువుగా నీకు వాహనమైన ఖగరాజు
గొప్ప పామును నోటఁ గొఱుకుచుండు
నదిగాక నీ భార్యయైన లక్ష్మీదేవి
దినము పేరంటంబు దిరుగుచుండు
నిన్ను భక్తులు పిల్చి నిత్య పూజలు చేసి
ప్రేమఁ బక్వాన్నముల్ బెట్టుచుండ్రు
తే స్వస్థముగ నీకు గ్రాసము జరుగుచుండ
గాసు నీచేతి దొకటైనఁ గాదు వ్యయము

02/11/2019 - 20:20

సీ. పుండరీకాక్ష నా రెండు కన్నుల నిండ
నిన్నుఁ జూచెడి భాగ్యమెన్నడయ్య!
వాసిగా నామనోవాంఛ దీరెడు నట్లు
సొగసుగా నీరూపుఁ జూపవయ్య!
పాపకర్ముని కంట బడక పోవుదమంచుఁ
బరుషమైన ప్రతిజ్ఞ పట్టినావ?
వసుధలోఁ బతితపాపనుఁ డవీవంచునేఁ
బుణ్యవంతుల నోటఁ బొగడవింటి
తే॥ నేమిటికి విస్తరించె నీకింత కీర్తి
ద్రోహినైనను నా కీవు దొరకకున్న?

02/08/2019 - 18:44

సీ కువలయశ్యామ! నీ కొలువుచేసిన నాకు
జీతమెందుకు ముట్టఁ జెప్పవైతి
మంచి మాటలచేత కొంచెమియ్యఁగ లేవు
కలహవౌనికఁ జుమ్ము ఖండితముగ
నీవు సాధువుగాన నింతపర్యంతంబు
జనువుచే నిన్నాళ్ళు జరుపవలసె
నిఁక నే సహింపనీ విపుడు ననే్నమైన
శిక్షఁ జేసిన చేయు సిద్ధ మైత్రి
తే నేడు కరుణింపకుంటివా నిశ్చయముగఁ
దెగఁబడెదఁ జూడు నీతోడ జగడమునకు

02/07/2019 - 19:46

సీ కమలలోచన నన్ను గన్న తండ్రివి గాన
నిన్ను నేమఱకుంటి నేను విడక
ఉదరపోషణకునై యొకరి నేనాసింప
నేర నా కన్నంబు నీవు పెట్టు
పెట్టలేనంటివా పిన్న పెద్దలలోనఁ
దగవుకిప్పుడు దీయఁదలఁచినాను
ధనము భారంబైనఁ దల కిరీటము నమ్ము
కుండలమ్ములు పైడి గొలుసులమ్ము
తే కొసకు నీ శంఖ చక్రముల్ కుదువఁబెట్టి
గ్రాసము నొసంగి పోషించు కపట ముడిగి

02/06/2019 - 20:22

సీ దనుజారి నావంటి దాసజాలము నీకు
కోటి సంఖ్య గలుగ కొదువలేదు
బంట్ల సందడి వల్ల బహుపరాకై నన్ను
మఱచి పోకుము భాగ్యమహిమ చేత
దండిగా భృత్యులు దగిలి నీకుండంగ
బక్క బంటే పాటి పనికివచ్చు?
నీవు మెచ్చెడి పనుల్ నేను చేయఁగ లేక
ఇంత వృథాజన్మమెత్తినాను
తే భూజనులలోను నేనప్రయోజకుఁడను
గనుగ, నీ సత్కటాక్షంబు గలుగఁజేయు

Pages